Tuesday, 28 July 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / అంతర్జాతీయ వార్తలు

OpenAI తయారు చేసిన ChatGPT ని గుడ్డిగా నమ్మి ప్రాణాల మీదికి తెచ్చుకున్న వ్యక్తి ...!

26 Jul 2026
03:28 PM
16

America  :

ప్రస్తుతం అన్ని రంగాల్లో AI సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇలానే వైద్య రంగంలోను వేగంగానే దూసుకెళ్తుంది ఎఐ. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే గూగుల్ లేదా AI చాట్‌బాట్‌లను అడగడం పరిపాటిగా మారింది. కానీ ఇటీవల ఓ వ్యక్తి OpenAI తయారు చేసిన ChatGPT ని గుడ్డిగా నమ్మి ప్రాణాల మీదికి తెచ్చుకున్న ఘటన అమెరికాలో వెలుగు చూసింది. వైద్యుడి దగ్గరికి వెళ్లకుండా AI చెప్పిన మాటలు విని తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధి బారిన పడటంతో... ఆగ్రహం చెందిన ఆయన ఏకంగా OpenAI కంపెనీపైనే కోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది.

అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన 55 ఏళ్ల పాస్టర్ స్కాట్ కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే డాక్టర్‌ను సంప్రదించడానికి బదులు ఆయన ChatGPT ని వైద్య సలహా అడిగారు. ఇందుకు ChatGPT సైతం అతన్ని డాక్టర్ వద్దకు వెళ్లొద్దంది. ChatGPTతో స్కాట్ తన సమస్యను ఎన్నిసార్లు చెప్పినా… డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని, దేవుడే కాపాడతాడని మతపరమైన మాటలతో చాట్‌బాట్ ఆయనను నమ్మించింది. ఇక ఆయన కూడా దాని మాటలను గుడ్డిగా నమ్మి ఇంట్లోనే ఉండిపోయారు.

చివరకు పరిస్ధితి విషమించి ప్రాణాల మీదికి తెచ్చింది తన నిర్లక్ష్యం. సమయానికి సరైన వైద్యం అందకపోవడంతో స్కాట్ అనారోగ్యం తీవ్రమైన లంగ్ డిసీజ్ (ఊపిరితిత్తుల వ్యాధి)గా మారింది. ఇక పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోక తప్పలేదు. మొదట్లోనే అసుపత్రికి వెళ్లి ఉంటే కొద్ది మొత్తంలోనే ఖర్చు అయ్యేది. కానీ ChatGPT కారణంగా మరికొంత అదనంగా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్ధితి తప్పలేదు. దీనిపై ఆయన కోలుకున్న తర్వాత శాన్ ఫ్రాన్సికో కోర్టులో ఓపెన్‌ఏఐ (OpenAI) సంస్థపై మరియు సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌పై లాసూట్ (కేసు) నమోదు చేశారు.   

కానీ వైద్యులు మాత్రం ఎంత సాంకేతికతపెరిగినా అది మనుషులకు సహాయం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని,  వైద్యుల స్థానాన్ని AI ఎప్పటికీ భర్తీ చేయలేదని స్పష్టం చేస్తున్నారు. కాబట్టి అనారోగ్యం వస్తే సొంత వైద్యాలు లేదా AI సలహాలు నమ్మకుండా వెంటనే డాక్టర్‌ను కలవడమే శ్రేయస్కరమని గుర్తించాలని వైద్యులు సలహ ఇస్తున్నారు. AI చాట్‌బాట్‌లు ఇచ్చే సమాచారం కేవలం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమేనని, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఎల్లప్పుడూ అర్హత కలిగిన వైద్యులను మాత్రమే సంప్రదించాలని సూచిస్తున్నారు. 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!