Friday, 11 September 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

OBC, ST, OC లు ఏ మతంలో ఉన్నా కులం మారడం లేదు.. SCలకే ఆంక్షలు ఎందుకు ? ..

04 Aug 2026
03:55 PM
1,329

* ఎస్సీలపై వివక్ష చూపడం కరెక్ట్ కాదు...
* 80 ఏళ్ళూగా అపరిషృతంగా ఉన్న సమస్య ఇది..
*  రాజ్యాంగ పరమైన పరిష్కారం లభించే వరకు న్యాయం జరగదు...
* ఎపిలో  రాజకీయ నాయకులకు చిత్తుశుద్ది లేదు.. 
* పండుగలు... ఎన్నికలోస్తే వీడుకోవడం తప్ప...వీరికి అస్సలు చిత్తశుద్ది లేదు...
* అందుకే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది..
*  లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రిటైర్డ్ IAS విజయ్ కుమార్

కడప  : 
ఓబిసి, ఎస్టీ, ఓసి ఏ మతంలో ఉన్నా కులం మారడం లేదని, ఇతరులకు లేని ఆంక్షలు ఎస్సీలకే ఎందుకని ప్రశ్నించారు లిబరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు, రిటైర్డ్ IAS విజయ్ కుమార్. మంగళవారం కడప అర్సీఎం బిషప్ హౌస్ లో బిషప్ పాల్ ప్రకాష్ గారి అధ్వర్యంలో దళిత క్రైస్తవులు - మతం హోదా రద్దుపై నిర్వహించిన సమావేశంలో అయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ...  భారతదేశం లో 150 కోట్ల మందికి ఒక రాజ్యాంగం ఉంది.  ఓబిసి, ఎస్టీ, ఓసి ఏ మతంలో ఉన్నా కులం మారడం లేదు. క్రైస్తవులుగా మారిన వారికి కులం మార్చడం లేదు. కానీ క్రిస్టియన్ గా మారిన ఎస్సీలపై వివక్ష చూపడం కరెక్ట్ కాదు. ఎస్సీగా పుట్టి మతం మారిన వారిని ఎస్సీగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నా. 80 ఏళ్ళూగా అపరిషృతంగా ఉన్న సమస్య ఇది.. అందరికీ సమ న్యాయం చేయాలి.. ఇతరులకు లేని అంక్షలు ఎస్సీలకు పెడితే అన్యాయం జరుగుతుంది. ఇది ఎస్సీలకు జరుగుతున్న భయంకరమైన అన్యాయం. ఈ అంశంలో తీవ్ర అన్యాయం ఉంది. అందుకే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యకు పూర్తి మద్దతు తెలుపుతుంది. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా ఎక్కడ ఏవరికి అన్యాయం జరిగినా ముందుంటుంది. 

క్రైస్తవులుగా అనేక కులాల వారు చేరుతున్నారు. కానీ వారికి కులం మారడం లేదు. కాబట్టే మతం మారిన వారికి ఎస్సీ హోదానే వర్తింపచెయ్యాలి. రాజ్యాంగ పరమైన పరిష్కారం లభించే వరకు న్యాయం జరగదు. ఆంధ్రప్రదేశ్ పార్టీ రాజకీయ నాయకులకు చిత్తుశుద్ది లేదు.. పండుగల వస్తే... ఎన్నికలు వస్తే వీరిని వీడుకోవడం తప్ప... వీరికి అస్సలు చిత్తశుద్ది లేదు. అసెంబ్లీలో తీర్మానం చేస్తే చట్టం మారదు..ఇది అందరికి తెలిసిందే. కాబట్టి  పార్లమెంట్ లో చట్టం చేయాలి.. పార్లమెంట్ లో బిల్లు పెట్టి బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావాలి.. రాష్ట్రంలో కూటమి ఎపిల గుంపే ఉంది. కాబట్టి తక్షణం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాజ్యాంత పరమైన పరిష్కారం చూపాలి. రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఎస్సీలను వాడుకుంటారు తప్ప ఆదుకోరు. ఇప్పటికైనా మార్పు తీసుకురండి. 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!