Wednesday, 28 October 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

సీమలో కూటమికి ముచ్చెమటలు...!

19 Oct 2026
05:33 PM
214

* రాయలసీమలో పరిస్ధితి బాగాలేదని ముందే గ్రహించిందా...?
* ఆ భయమే స్థానిక పోరులో వైసీపీని నామినేషన్లు వేయకుండా అడ్డుకునేలా చేశాయా...!
* వైసీపీ నామినేషన్లు వేసినా బండారం బయటపడుతుందన్న ఆందోళన ఉందా ?
* ప్రొద్దుటూరు సభ నుంచే చంద్రబాబు జాగ్రత్త పడ్డారా...?
* అయినా వైసీపీ ఇంటా..బయటా గెలిచామని చెప్పే ప్రయత్నమేనా...?
* స్థానిక ఎన్నికల్లో టిడిపి తీరు ఉద్దేశ్యం..ఇవేనా ...!

Astranews desk  : 
రాయలసీమలో కూటమికి ముచ్చెమటలు పడుతున్నాయి. పరిస్ధితి బాగాలేదని కూటమి గ్రహించినట్లుంది.  కడప, చిత్తూరు, కర్నూల్ లాంటి ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడమంటే ఇదే కారణంగా కనపడుతుంది. అంతేకాదు... వైసిపి కి ప్రధానమైన ..బలమైన ప్రాంతంగా  ఉన్న ప్రాంతాల్లో రాయలసీమలో నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం ద్వారా ఇతర ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బతీయాలనేది అధికార కూటమి ఆలోచనగా కనపడుతుంది. ఇన్నీ కారణాలు కూటమిలో ఉన్నప్పుడు .. ఇటీవల కడప జిల్లా ప్రొద్దుటూరుకు వచ్చిన చంద్రబాబు...నాది రాయలసీమేనని...ఇక్కడి నీళ్లే తాగానని...కానీ కొంత మంది నన్ను రాయలసీమ ద్రోహి అంటున్నారని ....రాయలసీమ అభివృద్దిలో టిడిపి ముద్ర కనపడుతుందని అంతగా చెప్పుకున్నా ప్రజలు నమ్మలేదా అంటే... ఎన్నికల్లో కూటమి అక్రమాలు చూస్తే...నమ్మడం లేదన్నది స్పష్టమవుతొంది.   

ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అధికార కూటమి చేస్తున్న ప్రయత్నాలను చూసినప్పుడు ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న తీరు చూసినప్పుడు అధికార పార్టీకి రాయలసీమ టెన్షన్ పట్టుకున్నట్టు కనపడుతుందని చెప్పకతప్పదు. అధికార పార్టీకి రాయలసీమలో పరిస్థితి బాలేదనే విషయం అర్థమైనట్టు కనపడుతుంది. అధికార పార్టీకి రాయలసీమ వచ్చే ఎన్నికల్లో తమకు షాక్ ఇవ్వబోతుందనే విషయం కూడా ఇప్పటికే బోధపడిందని అనిపిస్తుంది. అందుకునేమో... మున్సిపల్ ఎన్నికల వేల మెజారిటీ ప్రాంతాల్లో రాయలసీమలోని కడప, చిత్తూరు, కర్నూల్ లాంటి ప్రాంతాల్లో నామినేషన్లు వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడం వెనక ప్రధాన కారణం ఇదేనన్నట్లు కనపడుతుంది.వైసిపికి ప్రధానమైన బలమైన ప్రాంతంగా ఉన్న ప్రాంతాల్లో నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం ద్వారా రాయలసీమలోని మిగతా ప్రాంతాల్లో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బతీయాలనేది అధికార కూటమి ఆలోచనగా కనపడుతుంది. 

ప్రధానంగా కడప జిల్లాలో ... అనమయ జిల్లాలో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల నామినేషన్లను తీసుకోవద్దని రిటర్నింగ్ అధికారులకు కూడా  ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయని సమాచారం. తిరుపతి లాంటి చోట్ల  నామినేషన్ వేసే పరిస్థితి లేకపోవడం... పుంగనూరు లాంటి చోట నామినేషన్లు వేసే పరిస్థితి లేకపోవడం... కడప జిల్లాలో పులివెందులు లాంటి చోట్ల కౌన్సిలర్లు నామినేషన్లు వేసే పరిస్థితి లేకపోవడం...కడపలో నామినేషన్లు వేసే కార్పొరేటర్ అభ్యర్ధులను స్వయానా పోలీసులు టిడిపి కార్యకర్తలకు అప్పగించి చితకబాదించడం ..ఇవన్నీ చూసిన తర్వాత అధికార పార్టీకి రాయలసీమ తమపైన తిరగబడుతోంది. రాయలసీమ ప్రజలు తమకు వ్యతిరేకంగా ఉన్నారు. రాయలసీమ ప్రజలు తమకు ఈ ఎన్నికల్లో ఓటు వేసే పరిస్థితి లేదు అనే విషయం అర్థమైనట్లుగా కనబడుతుంది. ఇందులో భాగంగానే రాయలసీమలో  కూడా మాకు మెజారిటీ ఉంది. రాయలసీమలో కూడా మేము భారీగా గెలిచాం అని చెప్పుకోవడానికి సంబంధించిన అవకాశం కోసం ప్రతిపక్ష పార్టీని నిలువరించే ప్రయత్నం చేస్తుందా  అనిపిస్తుంది. 

పులివెందుల కూడా మేము గెలుస్తామంటూ కొద్ది రోజుల క్రితం వరకు మాట్లాడుతూ వచ్చిన నాయకులు ఇప్పుడు పులివెందులలో నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు... నామినేషన్లు వేస్తే ప్రతిపక్ష పార్టీ గెలుస్తుందనా...ప్రతిపక్ష పార్టీ నామినేషన్ వేస్తే మనక ఎవరు ఓట్లు వేయరనా...కడప, అన్నమయ్య జిల్లాల  లాంటి చోట్ల అధికార పార్టీ ఎందుకు ప్రతిపక్షాలకు సంబంధించిన నామినేషన్లని వేయకుండా అడ్డుకుంటుంది ... నామినేషన్ కేంద్రంలోకి వెళ్లి చైర్మన్ అభ్యర్థి నామినేషన్ పత్రాలు ఇస్తే కూడా పైనుంచి మాకు ఒత్తిళ్లు ఉన్నాయి కాబట్టి మేము నామినేషన్లు తీసుకోమని ఎన్నిక కల రిటర్నింగ్ అధికారులే చెప్తున్నారు అంటే...పైనుంచి చెప్తోంది ఎవరు ప్రభుత్వమే కదా .. పైనున్న ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది. పైనున్న ప్రభుత్వం ప్రజలు ఓట్లు వేస్తే గెలిచే ఎన్నికల పట్ల ఎందుకు ఇంత ఆందోళన చెందుతోంది. పైనున్న ప్రభుత్వానికి స్థానిక ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ గెలిస్తే ప్రభుత్వం ఏం కూలిపోదు కదా ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ ఉండదు కదా.

అంతేకాదు 28 నెలల కాలంలో మీరు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశమని ...సూపర్ సిక్స్ హామీలు అమలు చేసామని చెప్తున్నారు.. లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చామని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కి శాంతిని ఇచ్చామని ... ఆంధ్రప్రదేశ్ లో అప్పులు లేకుండానే అభివృద్ధి చేస్తున్నామ అని చెప్తున్నారు. సంపద సృష్టించామ అని చెప్తున్నారు అమరావతి నిర్మాణం చేశమని  చెప్తున్నారు. ఇన్ని చేస్తున్నప్పుడు ప్రతిపక్షాన్ని నిలవరించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఇన్ని చూసినప్పుడు ప్రతిపక్ష పార్టీకి ఓట్లు ఎవరు వేస్తారు ..అసలు మీరు ఇంత అభివృద్ధి చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీ వైపు చూసే వాళ్ళు ఎవరు?  మీరు ఇంత అభివృద్ధి కార్యక్రమాలని ఇంత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మీకు కాకుండా ఇంకెవరికి ఓట్లు వేసే పరిస్థితి ఉంటుంది. అలాంటి మీరు ప్రతిపక్ష పార్టీల నామినేషన్లని తీసుకోవద్దు అంటూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారంటే ప్రతిపక్ష పార్టీలు నామినేషన్లు వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ప్రతిపక్ష పార్టీలకు బలమైన చోట్ల బెదిరించి కార్లు తగలబెట్టి ఆఫీసులు తగలబెట్టి కత్తులు చూపిస్తూ కర్రలు చూపిస్తూ  ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు నామినేషన్లు వేయకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారంటే...మీకున్న భయం ఎంటీ...మీరు చెప్పే మాటల్లో వాస్తవం లేదనా...ఇవి గమనించిన సీమ తిరగబడుతుందనే భయం అనుకోవాలా?

రాయలసీమకి ఏం చేసింది కూటం సర్కార్ అంటే...అధికారంలోకి వచ్చిన 28 నెలల్లో అంటే ఏం చేసిందో చెప్పుకొని ఓట్లు అడిగితే బాగుంటుంది. ప్రధానంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం అంశానికి సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన  మాటలు...రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ ని తెలంగాణ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ఆపేసింది. నేను క్లోజ్ డోర్ మీటింగ్ లో చంద్రబాబుతో చెప్తే రాయలసీమ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసారు అంటూ ఓపెన్ గా తెలంగాణ అసెంబ్లీ లో రేవంత రెడ్డి మాట్లాడిన తర్వాత దానిపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ప్రభుత్వం మాట్లాడలేదు ఈ క్షణానికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి సమాధానమే లేదు. ఈ క్షణానికి రాయలసీమ  ప్రాంతానికి సంబంధించి చేసిన అభివృద్ధి ఏంటి... రాయలసీమ ప్రాంతంలో ప్రాజెక్టులను పక్కన పెట్టేస్తున్నారు. రాయలసీమకు సంబంధించిన ...అనంతపురం జిల్లాకు సంబంధించిన ఏమ్స్  లాంటి  ఇన్స్టిట్యూట్ ని అక్కడి నుంచి అమరావతికి తీసుకెళ్ళిపోయారు. కడప జిల్లాకు సంబంధించిన బ్యాంకుల్ని  అమరావతికి తీసుకెళ్ళిపోయారు. రాయలసీమలో కొత్తగా ప్రాజెక్టులు.. కొత్తగా ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావడం విషయం పక్కన పెడితే ...అక్కడన్న ఇన్స్టిట్యూషన్స్ ని  అమరావతికి తరలిస్తున్నారు. ఈ ప్రాంత అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళకపోగా ..ఈ ప్రాంతానికి  నష్టం కలిగించే తరహాలో ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న అభిప్రాయం  రాయలసీమ ప్రాంతంలో బలంగానే కనబడుతుంది. వినపడుతుంది.  అలాగే మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి కూడా  రాయలసీమలోని పులివెందులు లాంటి చోట మెడికల్ కాలేజ్ పూర్తై...రేపే మాపో క్లాసులు నిర్వహించాల్సిన పరిస్థితిలో ఆ మెడికల్ కాలేజీని పడేసి... ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటూ చెప్పేసి ప్రభుత్వం వాటిని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టింది లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతుంది. 

అంతే కాదు అక్కడ ఎమ్మెల్యేలు స్థానిక నాయకులు  వాళ్లకు సంబంధించిన అవినీతి పైన వస్తున్న వార్తల్ని కూడా అనేకం చూస్తున్నాం. తెలుగు దేశం పార్టీకి  సంబంధించిన మీడియాలోనే స్థానిక అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల దోపిడీలు, ల్యాండ్ కబ్జాలు లేకపోతే గ్రావెల్ దోపిడీలు లాంటి వార్తలు వస్తున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో మనం చేసింది ఏమీ లేదు. పైగా మనం ఇక్కడ నుంచి ఇంకా చాలా  తరలించుకుపోయాం. ఈ ప్రాంతానికి నష్టం చేశం. పైగా ఈ ప్రాంతంలో వైసిపి బలంగా ఉంది. ఇక్కడ గనక వాళ్ళు గెలిస్తే రాయలసీమ తిరగబడింది అనే విషయం మనకి అర్థమవుతుంది. రాష్ట్ర ప్రజలంతా చూస్తారు. ఇదే జరిగితే రాయలసీమ ఇక  మన కంట్రోల్ లో ఉండదు. రాయలసీమ ఎలా గెలిచినా అంటే...వైసీపీ వాళ్ళని నామినేషన్లు వేయకుండానో బెదిరించో ఇంకో రకంగానో మనం గెలిచామని అనిపించుకుంటే కాస్త సేఫ్ గా ఉంటామని..మీ ఊర్లోనే మేము గెలిచాం. మీ నియోజక వర్గంలోనే మేము గెలిచాము అంటూ ఇంకో రెండున్నర ఏళ్ళు  కాలయాపన చేయొచ్చు అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆలోచనగా కనిపిస్తోంది. బహుశా ఇప్పటికే చాలా మంది అధికారులు  ప్రభుత్వం మాట వినడం మానేశారు. ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తుందా రాదా అనే అనుమానంలోకి వచ్చేశారు. అంతేకాదు కొంతమంది ప్రభుత్వం మళ్ళీ రాదు అనే నిర్ధారణకు వచ్చేశారు .  ప్రభుత్వం ఏది చేయమంటే అది చేసే పరిస్థితిలో చాలా మంది బ్యూరోక్రాట్స్ ఇప్పటికే కనపడట్లేదు. మున్సిపల్ ఎన్నికలు కూడా రాయలసీమలో వన్ సైడ్ గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గనక విజయం సాధిస్తే ఆ పరిస్థితి మరింత పెరుగుతుంది. మొత్తం అధికార యంత్రాంగం పైన మనం పట్టు కోల్పోవాల్సిన పరిస్థితి  ఉంటుంది. మనం ఏ పని చెప్తే ఆ పని అధికార యంత్రాంగం చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి రాయలసీమ కూడా మనం గెలిచామని అనిపించుకోవాలి.. రాయలసీమలో మనం వైసీపీని  నిలవరించామని అనిపించుకోవాలి. కాబట్టి దానికోసం ఏమైనా చేయాలి.. ఏమైనా చేద్దాం అన్నట్లుగా కూటమి వ్యవహార తీరు వ్యవహార శైలి కనపడుతుంది. రాయలసీమ తిరగబడుతుందనే భయం కూటమి ఈ తరహా చర్యలకు పోనుకోవడానికి కారణంగా కనిపిస్తుంది.

ఇటీవల కడప జిల్లా ప్రొద్దుటూరుకు వచ్చినా చంద్రబాబు ...ఇదే వాస్తవాన్ని గ్రహించే  "నేను పుట్టింది సీమలోనే.. తాగింది సీమ నీళ్లే" అని గుర్తుచేస్తూ, రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాయలసీమ నుంచి ప్రతినెల రెండు ఉపగ్రహాలు, పుట్టపర్తిలో ఫైటర్ జెట్ల తయారీ వంటి భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. ఈ ఎత్తుగడ కూడా స్థానిక సంస్థల ఎన్నికల వేళ... పార్టీకి ప్రయోజనం చేకుర్చడమే లక్ష్యమన్నట్లు మాట్లాడారు. అయినా ఫలితం లేకపోవడం వల్లే ఇలా వైసీపీని నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకుందన్న అబిప్రాయం వ్యక్తమవుతొంది. మొత్తం గెలవాలని చేసిన అరాచకాలు...సీమలో మరింత తీవ్ర స్థాయిలో వ్యతిరేకత తెచ్చిపెట్టిందన్న చెడ్డ పేరు మరింతగా ముటగట్టుకున్నారని చెప్పక తప్పదు. 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!