* అభ్యర్ధుల ప్రకటన ఆలస్యమవుతుందని ఆందోళన వద్దు...
* స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చెయ్యాలనుకునే ఆశావాహులకు అధిష్టానం భరోసా...
* మనకు అధికారం ఉంది...ఆధైర్యపడవద్దు....
విజయవాడ :
ఎపిలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది...నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. కానీ ఇంత వరకు మేయర్, కార్పోరేటర్లు, మున్సిపల్ ఛైర్మన్ లు, కౌన్సిలర్ల ఎంపికే కాలేదు. అసలు కూటమిలో ఉన్న మూడు పార్టీల్లోనే సఖ్యత లేదు. ఎవరెన్ని స్థానాల్లో పోటీ చెయ్యాలో క్లారిటి లేదు...మిమ్మల్ని ఎప్పుడు అభ్యర్ధులుగా ప్రకటిస్తారు...ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు ఎపిలోని అన్ని జిల్లాలు...నియోజకవర్గాల్లో అశావాహుల నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్నలు.
ఓ వైపు కూటమిలోని పార్టీలో ఎవరికెన్ని స్థానాల్లో పోటీ చెయ్యాలో తేల్చుకునే పనిలో ఉన్న మూడు పార్టీల అధినేతలకు... ఆశావాహుల నుంచి ఇప్పడు తమ ప్రకటన ఎప్పుడంటూ ప్రశ్నలు...ఒత్తిళ్లు తప్పడం లేదు. దీంతో ఓ వైపు పొత్తు ధర్మం...మరో వైపు అశావాహుల ఒత్తిడితో సతమతమవుతున్న అధినేతలు ఓ కీలక సూచన చేశారని టాక్ నడుస్తుంది. కేవలం రెండు రోజుల ఎన్నికలకు ఇప్పటి నుంచే మా తలలెందుకు తింటారంటూ ఎదురు ప్రశ్నలు వినవస్తున్నాయట. ఇది విన్న ఆశావాహులకు పార్టీ పెద్దల మాటలు అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారట. అసలే సమయం తక్కువ...ఇప్పటికిప్పుడు ప్రకటించి ప్రచారం చేసుకుంటే గానీ గెలవడం కష్టం. అసలే ప్రతిపక్ష పార్టీ తాడోపేడో తేల్చుకునేందుకు సిద్దమై ఎన్నికలకు సమాయత్తమైంది. మీరు చూస్తే రెండు రోజుల ఎన్నికలంటూ ఎలా మాట్లాడతారంటూ ఎదురు ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయట. కానీ తీరా చివరకు పార్టీ పెద్దల మాటలకు అర్ధాలే వేరులే అన్నట్లో తీరిగ్గా ఆలోచన చేస్తే....అందులోని మర్మం చిన్నగా ఆశావాహులకు అర్ధమవుతుందట.
అదేమంటే..."అధికారం మన చేతుల్లో ఉంది. అధికార యంత్రాంగం మనం చెప్పినట్లు వింటారు. మనం అభ్యర్ధులను నిర్ణీత గడువులోకా ప్రకటించేలా జాగ్రత్త పడితే చాలు...ప్రజల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు...అంతా మేము చూసుకుంటాం... మీరుందుకు గాభరా పడతారు...మీకు గాభరా పడి మమ్మల్నెందుకు తొందరపెడతారు" అంటూ అశావాహులపై పార్టీ పెద్దలు విసుక్కుంటున్నారని టాక్ నడుస్తుంది. టికెట్ ఇచ్చే వరకు మీరు ఎన్నికలు ఎలా జరిపించాలో మాకు తెలుసులే అంటూ అసహానం వ్యక్తం చేస్తున్నారట.
ఇదంతా విన్న ఆశావాహులు, వారి బంధువర్గం, కార్యకర్తలు...ఇదంతా బాగానే ఉంది...కానీ కొంచం తొందరగా ప్రకటిస్తే బాగుంటుంది అనుకుంటూ పార్టీ పెద్దలను ఎదిరించే ప్రయత్నం చెయ్యలేకపోతున్నారట. ఇలాంటి పార్టీ పెద్దల మాటలు విన్న అశావాహుల్లో కొంత ధైర్యాన్ని ఇస్తున్నా... మరో వైపు ప్రతిపక్ష పార్టీ గట్టిగా పోరాడితే పరిస్ధితి ఎంటని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్ధితి ప్రధానంగా టిడిపిలో వ్యక్తమవుతుంటే... జనసేన, బిజేపిలో మాత్రం టికెట్లు గురించి ఎవరెన్ని అడగాలో...టికెట్లు ఎవరికి వస్తాయోనన్న సమాచారమే తెలియక అయోమయంగా ఉంటున్నారట. ఇలా ఒక్కో పార్టీ అశావాహులు ఒక్కో రకంగా అయోమయంలో ఉంటే... పార్టీ పెద్దల్లో మాత్రం రెండు రోజుల ఎన్నికలకు ఇంత గాభరా ఎందుకు అంటూ ఎదురు ప్రశ్నలు వస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఎన్నికల చరిత్రలో రెండు రోజుల ఎన్నికలంటే ఎలాంటివో చూడబోతున్నామా అంటూ ప్రశ్నలు అసక్తికరంగా మారాయి.