Tuesday, 27 October 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా మోగింది.. షెడ్యూల్ విడుదల !

14 Oct 2026
06:52 PM
185

* రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభం ...
* అమలులొకి ఎన్నికల కోడ్ ...
* దాదాపుగా రెండున్నర నెలల పాటు కొనసాగనున్న రాజకీయ వేడి...
Vijayawada  :
ఎపిలో  స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఎట్టకేలకు అధికారికంగా పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ షెడ్యుల్ విడుదలతో రాష్ట్రంలో దాదాపుగా రెండున్నర నెలల పాటు ఎన్నికల వేడి కొనసాగనుంది.  మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీల ఎన్నికలను దశలవారీగా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct) అమల్లోకి వచ్చినట్లైంది. మొదటి దశలో రాష్ట్రంలోని మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటిలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలు ఉన్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి నేడు అధికారిక నోటిఫికేషన్ జారీ అయింది.
 
నగర, పట్టణ ఎన్నికల షెడ్యూల్  : 
అక్టోబర్ 16 నుంచి 18 వరకు – నామినేషన్ల స్వీకరణ 
అక్టోబర్ 19 – నామినేషన్ల పరిశీలన 
అక్టోబర్ 21 – నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 
అక్టోబర్ 28 – పోలింగ్ 
అక్టోబర్ 30 – ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన 

గ్రామీణ స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ కూడా వెంటనే ప్రారంభం కానుంది. ఈ ఎన్నికలకు ప్రత్యేకంగా అక్టోబర్ 19న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

 MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్  : 
అక్టోబర్ 19 – ఎన్నికల నోటిఫికేషన్ 
అక్టోబర్ 23 – నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 
అక్టోబర్ 24 – నామినేషన్ల పరిశీలన 
అక్టోబర్ 27 – నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 
నవంబర్ 3 – పోలింగ్ 
నవంబర్ 5 – ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన 

గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
 గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్  : 
నవంబర్ 26 – తొలి దశ పోలింగ్ 
నవంబర్ 29 – రెండో దశ పోలింగ్ 
డిసెంబర్ 2 – మూడో దశ పోలింగ్ 
గ్రామ పంచాయతీలకు సంబంధించిన పూర్తి జిల్లా వారీ షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలో విడుదల చేయనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలు, స్థానిక సమీకరణాలపై దృష్టి సారించాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. స్వేచ్ఛాయుత, పారదర్శక, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించింది. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం మరింత  హీటెక్కనుంది. 

 

 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!