Wednesday, 28 October 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

కడప వైసీపీ మేయర్ అభ్యర్ధిగా బండి దీప్తి..!

14 Oct 2026
02:18 PM
785

* ప్రకటించిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి...
* ఇది వరకు కార్పొరేటర్ గా...ప్రస్తుతం నగర మహిళా అధ్యక్షురాలిగా కొనసాగుతున్న దీప్తి...

కడప  : 
కడప నగర వైసీపీ మేయర్ అభ్యర్ధిగా మాజీ కార్పొరేటర్ బండి దీప్తిని ఆ పార్టీ ప్రకటించింది. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. బండి దీప్తీ ..2014–2019 మధ్య కడప కార్పొరేషన్‌లో కార్పొరేటర్‌గా కొనసాగారు. విద్యావంతురాలైన ఆమె MBA, LLB, పూర్తి చేశారు. ప్రస్తుతం కడప నగర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే రాజకీయంగా మంచి గుర్తింపు ఉన్న బండి కుటుంబం, కడప నగర రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. బండి దీప్తి తండ్రి సీహెచ్ చంద్రశేఖర్ రెడ్డి కడప నగర ప్రజలకు సుపరిచితమైన ప్రజా నాయకుడు. పలు ప్రజా ఉద్యమాలు, పోరాటాల్లో కీలక పాత్ర పోషించిన ఆయన ముఖ్యంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో కడపలో చురుకైన పాత్ర పోషించారు. అలాగే బండి దీప్తి భర్త బండి నిత్యానంద రెడ్డి కూడా కడప మాజీ డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి కొనసాగిన రాజకీయ అనుబంధాన్ని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితోనూ కొనసాగిస్తున్నారు.  ప్రత్యేకించి జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి శిష్యుడిగా కూడా ప్రత్యేక గుర్తింపు పొందారు. 

ఈ ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి  రేసులో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపించినా... చివరకు బండి దీప్తి పేరు ఖరారు కావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!