Tuesday, 27 October 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

అబ్బో పెద్ద ప్లానే...!

14 Oct 2026
01:38 PM
224

* మున్సిపల్ ఎన్నికల్లో 40 శాతం సీట్లు కావాల్సిందే...జనసేన పట్టు ...
* అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకం ఫార్ములాను ఈ సారి అనుసరించబోం ...
* ప్రస్తుతం పార్టీ బలం, సంస్థాగత విస్తరణ ...
* కార్యకర్తల అంచనాల ఆధారంగా ఎక్కువ స్థానాలు ఇవ్వాల్సిందే...

విజయవాడ   : 
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగబోయే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ కూటమి పొత్తులో భాగంగా సుమారు 40 శాతం (40.1%) సీట్లు కేటాయించాలని పట్టుబడుతుండటం సం,లనంగా మారింది. ఈ భారీ ప్రతిపాదన డిమాండ్ ను జనసేన పార్టీ కూటమి ముందు  ఉంచినట్లు సమాచారం. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలలో సుమారు 40.1 శాతం వాటాతో మొత్తం 2,091 స్థానాలను తమకు కేటాయించాలని జనసేన కోరినట్లు తెలుస్తోంది. మొత్తం పట్టణ స్థానిక సంస్థల్లోని 5,220 పదవులకు గానూ 2,091 పదవులను తమకు కేటాయించాలనే ప్రతిపాదనను జనసేన శ్రేణులు తెరపైకి తెచ్చాయి. 

ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన నేత నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్‌ల మధ్య సీట్ల పంపకంపై పలు దఫాల చర్చలు జరిగినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోపు తుది ఫార్ములాను ఖరారు చేయాలని కూటమి నాయకత్వం ప్రయత్నిస్తోంది. నేరుగా మంత్రి నిమ్మల రామానాయుడు, పార్టీ రాష్ర్ట అధ్యక్షులు పల్లా రాములు డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ తో చర్చించగా... అయన ఓ మారు మంత్రి నాదేండ్లతో చర్చించాలని సూచించినట్లు సమాచారం.  

త్యాగాలకు గుర్తింపునివ్వండి- కూటమి ముందు జనసేన్ సంచలన డిమాండ్  : 
గత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం జనసేన చాలా సీట్లు త్యాగం చేసిందని, గత అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకం ఫార్ములాను ఈ సారి అనుసరించబోమని జనసేన ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రస్తుతం పార్టీ బలం, క్షేత్రస్థాయి సంస్థాగత విస్తరణ, కార్యకర్తల అంచనాల ఆధారంగా ఎక్కువ స్థానాలు ఇవ్వాలని జనసేన వాదిస్తోంది.  క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని పెంచుకున్నందున స్థానిక సంస్థల ఎన్నికల్లో పాత ఫార్ములా వర్తించదని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ  మొదట్లో 15-20 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు ఇవ్వజూపగా పవన్ కళ్యాణ్ దానికి అంగీకరించలేదని సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జనసేన నేతలు చర్చలు జరుపుతున్నారు.

జనసేన పార్టీ ఈ విధంగా బహిరంగంగా ... సోషల్ మీడియా వేదికగా 40% సీట్ల కోసం పట్టుబట్టడం కూటమి శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై కూటమి నాయకత్వం నుండి ఇంకా ఎలాంటి అధికారిక తుది నిర్ణయం వెలువడలేదు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కూటమి ధర్మాన్ని ప్రస్తావిస్తూ జనసైనికుల త్యాగాలకు తగిన గుర్తింపు స్థానిక ఎన్నికల్లో కనిపించాలని పేర్కొన్నారు. అయితే జనసేన కోరిన 40 శాతం వాటాపై కూటమి నుంచి ఇంకా అధికారిక నిర్ణయం వెలువడలేదు. తుది సీట్ల పంపకంపై చంద్రబాబు నాయుడు, జనసేన, బీజేపీ నేతల మధ్య జరిగే చర్చల అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ అంశం రాజకీయ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో కూడా విస్తృత చర్చకు దారితీసింది.  ఈ లెక్కన జనసేనకు సీట్లు ఇస్తే... ఇటు తెలుగుదేశం అశావాహులు ఒప్పుకుంటారా లేదా అన్నది కూడా అనుమానాలకు తావిస్తొంది. 

 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!