Tuesday, 27 October 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

కడపలో ప్యాన్ జోరు ...! కుమ్ములాటలతో కూటమి బేజారు.... !!

12 Oct 2026
05:03 PM
885

* మేయర్ అభ్యర్ధి ఎంపిక కోసం టిడిపిలో జరుగుతున్న అంతర్యుద్దం...
* నిత్యం చేరికలు...సభలు...సమావేశాలతో జోరందుకున్న వైసీపీ ... 
కడప  : 
కడప నగర పాలక సంస్థలో ఫ్యాన్ గిరా గిరా తిరుగుతుంది. నిత్యం చేరికలు...సభలు ...సమావేశాలతో ఫ్యాన్ జోరందుకుంటే... కూటమి మాత్రం మేయర్ అభ్యర్ధి ఎంపిక కోసమే  అంతర్యుద్దం చేస్తుంది. నగర పాలక సంస్థ రిజర్వేషన్ ఖరారు కాకమునుపే అయా డివిజన్లలో నిత్యం నేతల పర్యటనలు, సభలు, సమావేశాలతో ఆ పార్టీ నేతలు బిజీబిజీగా గడుపుతుండగా... కూటమి నేతలు మాత్రం ఉన్న కొంత మంది నేతలు కూడా మా వర్గానికి టికెట్ కావాలంటే... మా వర్గానికి టికెట్ కావాలంటూ అధిష్టానం, పార్టీ పెద్దలతో తాడోపేడో తేల్చకునే పనిలో పడ్డారు. 

కడప నగర పాలక సంస్థ పరిధిలో వైసీపీ గడచిన వారం పది రోజులుగా సభలు, సమావేశాలు, చేరికలతో ఆ పార్టీ నేతలు బిజీబిజీగానే గడుపుతున్నారు. ప్రత్యేకించి జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి, మాజీ డిప్యూటి సిఎం అంజాద్ బాష, పార్టీ ఈసీ సభ్యులు సురేశ్ బాబులు ఈ పనుల్లో తలమునకలయ్యారు. డివిజన్ల వారీగా వైసీపీ ఒకరిద్దరికి మించి అభ్యర్ధులు పోటీలో నిలిచేందుకు సిద్దంగా ఉండగా... మేయర్ స్థానం కోసం మాత్రం తీవ్ర పోటీ నెలకొంది.  మేయర్ స్థానం  ఓసీ జనరల్ కు వస్తే పది మంది వరకు పోటీలో నిలిచేందుకు సమాయత్తమయ్యారు. ఇందులో  విద్యావంతురాలైన జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథరెడ్డి సతీమణి అరుణ కుమారి, అయన కుమార్తె డాక్టర్. రమ్యతారెడ్డి, నగర మాజీ డిప్యూటి మేయర్ నిత్యానందరెడ్డి సతీమణి నగర మహిళా అధ్యక్షురాలు బండి దీప్తిల పేర్లు ప్రముఖంగా వినవస్తున్నాయి. దీంతో డివిజన్లలో నిత్యం పర్యటనలు, సమావేశాలు, పార్టీలో చేరికలపై ప్రధానంగా దృష్టి సారించి ముందుకు వెళ్తున్నారు.  కడపలో తమకు కలిసివచ్చే అంశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తూనే వ్యూహ ప్రతివ్యూహాలతో కలిసికట్టుగా అడుగులేస్తున్నారు. 

కుమ్ములాటలతో కూటమి బేజారు.... : 
ఇక అధికారంలో ఉన్న కుమ్ములాటలతో కూటమి మాత్రం బేజారుగా మారింది. ఓ వైపు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవీరెడ్డి, అమె భర్త శ్రీనివాసులరెడ్డి ఓ వర్గంగాను...వారి వ్యతిరేకవర్గం మరో వర్గంగాను జట్టుకట్టి .... ప్రత్యర్థి వైసీపీపై కాకుండా టికెట్ కోసం తమలో తాము పోరాడుతున్నారు. కడపలో ఎన్నికల కోసం ప్రత్యేకంగా పరిశీలకులను నియమించినా... కడప రాజకీయాలు కొలిక్కి రావడం లేదు. దీంతో రానురాను సమస్య మరింత జఠిలంగా మారుతూనే ఉంది. ఎమ్మెల్యే, అమె భర్త శ్రీనివాసులరెడ్డిలు తాము చెప్పిన వారికి టికెట్ ఇవ్వాలని కోరుతూ నగరంలో ఓ వైద్యురాలి పేరు ప్రతిపాదించినట్లు ప్రచారం సాగుతుంది. ఈ కారణంగానే తాము ప్రజల్లో ఉన్నామని, గడచిన రెండున్నరేళ్లులో చేసిన అభివృద్ది, చేసిన సహాయం వంటి అంశాలను పొందుపరచి నగరంలో పెద్ద ఎత్తున ప్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్యనీయాంశంగా మారింది. దీనికితోడు తమకు వ్యతిరేకమైన వారికి టికెట్ ఇస్తే తాము ఎంతకైనా తెగించేందుకు సిద్దమని కూడా హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.  అయితే ఇక వీరి ప్రత్యర్థి వర్గం మాత్రం ఎమ్మెల్యే వర్గం కాకుండా మైనార్టీ, బలిజలలో ఎవిరికో ఒకరికి పాత వారికే టికెట్ ఇస్తే తామంతా పార్టీ కోసం పని చేస్తామని ... లేకపోతే పార్టీకి తాము పనిచేసేది లేదని తెగేసి చెప్పినట్లు తెలుస్తుంది.  పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి కాకుండా కొత్త వారికి టికెట్ ఇచ్చినా పనిచేసేది లేదంటూ ఖరాఖండిగా పార్టీ పెద్దలతోనే చెప్పినట్లు వినికిడి. 

దీనికితోడు బలిజ, మైనార్టీలలో ఎవరికో ఒకరికి ఇవ్వాలని...లేనిపక్ష్యంలో తాము కూటమికి వ్యతిరేకంగా పనిచేస్తామని.... ఓట్లు వేసేది లేదని కూడా అల్టిమేటమ్ జారీ చేశారని సమాచారం. ఈ ఎన్నికల హడావుడి మొదలైన నాటి నుంచి కడపలో కూటమి పరిస్ధితిని అదుపులోకి తెచ్చుకోవాలని టిడిపి అధిష్టానం ఎంతగా ప్రయత్నించినా సాధ్యపడటం లేదు. కడప నగర పాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ అభ్యర్ధిగా అలాంఖాన్ పల్లెకు చెందిన సీనియర్ నేత లక్ష్మీరెడ్డి కోడలు మాజీ కార్పొరేటర్ ఉమాదేవి పేరును అధిష్టానం ఖరారు చేసేందుకు సిద్దమైందని టాక్ నడుస్తుంది. కానీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి, అమె భర్త శ్రీనివాసులరెడ్డిలు ఉమాదేవి పేరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీటికితోడు కమలాపురం టిడిపి సీనియర్ నేత పొత్తా నరసింహారెడ్డి కూడా కడపపై పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం లేకపోలేదు. కానీ అయన మాత్రం బయటపడటం లేదు. 

Article Image

మొత్తం మీద వైసీపీ మాత్రం మంచి జోరు మీద ఉండగా... కూటమి పరిస్ధితి మాత్రం అంతర్యుద్దంతో పార్టీకి అంతుబట్టక... తలనొప్పి వ్యవహారంగా తయారైంది. టిడిపి అధిష్టానంతో కడప ఎమ్మెల్యే, అమె భర్తల మధ్య ఈ వ్యవహారం తెగేదాక లాగడం లాంటి పరిస్ధితిని తలపిస్తొందన్న చర్చ నడుస్తుంది. మరి చివరకు ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనన్నది వేచి చూడాలి. 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (1)

L
Lathif Lathif Lathif 223 • 12 Oct, 2026

Kadapa YSR Kamalpuram peddacheppalli Lathif