* బాబు కులాలతో ఆటలు ఇనాటివి కావు...
*మొదట దళితుల్లో చీలిక ...
* 2014లో అధికారంలోకి వచ్చాకా కాపుల రిజర్వేషన్ పేరిట అర్బాటం ...
* ఇప్పుడు బీసీల రిజర్వేషన్ పేరుతో ఆట ...
Astranews desk :
ఎపిలో చంద్రబాబు సిఎం అయ్యింది మొదలు....కులాలతో ఆటలు ఆడటం సర్వసాధారణంగా మారింది. ఇప్పటికే అయన సొంత మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారన్న అపవాదు ఎదుర్కొంటుండగా... కులాలతోను ఆటలాడటం పరిపాటిగా మారింది. దీంతో అయా కులాల్లో చీలికలు... వాదులాటలకు దారితీస్తున్నాయి.
చంద్రబాబు ఎప్పుడు అధికారం లేకపోయినా...రిజర్వేషన్లు పెంచడం రాజ్యంగ సవరణ చెయ్యకుండా సాధ్యకాదన్న వాస్తవం తెలిసినా...రిజర్వేషన్లు పెంచుతామని, ఒక సామాజిక వర్గంలోని కులాలను మరో సామాజిక వర్గంలో చేర్పుతామంటూ హామీలిస్తారు. తీరా అధికారంలోకి వచ్చాకా కేంద్రాన్ని సంప్రదించకుండా... అడ్డగోలు జీవొలతో ఎపిలో మాత్రం రిజర్వేషన్లు పెంచుతున్నట్లు ప్రకటిస్తారు. తీరా కేంద్ర వద్దకు బిల్లు వెళ్లాకా అవి కాస్త రిజక్ట్ అవుతుండటం మనం తరచు చూస్తూనే ఉన్నాము. గతంలో ఇదివరకు గాండ్లను బీసీ-బి నుంచి ఎస్సీకి...ఆరె కటికలను బీసీ-డీ నుంచి ఎస్సీకి...కురుమ, కురబలను బీసీ-బి నుంచి ఎస్సీకి, వాల్మీకి, బోయిలను ఎస్టీల్లోకి మార్చేందుకు చర్యలు తీసుకుంటామంటూ హామీలిస్తారు.
కానీ చంద్రబాబు కులాలతో ఆటలాడటం ఎస్సీలతో ప్రారంభమైంది. ఎస్సీలో ఓ వర్గం మాత్రమే అభివృద్ది చెందుతుందని, అందుకే వారిలో ఎబిసిడిలు ఉండాలంటూ ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చి వారిలో చిచ్చు పెట్టారు. దీంతో వారు అభివృద్ది మాట అటుంచితే...నేటికి వర్గ విభేధాలతో ఒకరంటే ఒకరు గిట్టనివారిలా ఉంటున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ చంద్రబాబు కులవివక్షత వ్యాఖ్యలు చేయడం పట్ల అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యాఖ్యలు ఎస్సీలో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి.
ఇక 2014లో అధికారంలోకి రాకమునుపు కాపులకు రిజర్వేషన్లు ఇస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ హామీలో కాపులు గంపగుత్దగా ఓట్లేశారు. కానీ అధికారంలోకి వచ్చాకా ఆ మాట పట్టించుకోలేదు. దీంతో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ 2016లో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం నిరసనకు దిగారు. ఈ ఎఫెక్ట్ కాపుల్లో ఆగ్రహావేశాలను రేపడంతో ఒక్క సారిగా రెచ్చిపోయిన కాపులు పక్కనే ఉన్న తుని రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపైకి దూసుకెళ్లి విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలును నిలిపివేశారు. ప్రయాణికులను కిందికి దించివేసి, రైలు ఇంజన్‌తో పాటు కొన్ని బోగీలకు నిప్పు పెట్టారు. రైలుతో పాటు తుని రూరల్ పోలీస్ స్టేషన్‌ను, అక్కడ ఉన్న పలు వాహనాలను కూడా ఆందోళనకారులు తగులబెట్టారు. ఈ హింసాత్మక ఘటనల వల్ల జాతీయ రహదారి (NH-16) పై వాహనాల రాకపోకలు, అలాగే విజయవాడ-విశాఖపట్నం మార్గంలో రైళ్ల సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. భారీ నష్టం సైతం చవిచూడాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి అనేక మంది కాపులు కేసుల్లో ఇరుక్కుని జైళుకు వెళ్లాల్సి వచ్చింది. అనంతరం వారిపై ఆ కేసులు ఎత్తివేసినా... చాలా కాలం పాటు కాపులైతే కేసుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొవల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ అంశం అపరిషతంగానే ఉండిపోయింది.
ఇప్పుడు కూటమిగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు బీసీల రిజర్వేషన్ల పెంపుతో మరోమారు గేమ్ అరంభించారు. ఈ రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం జీవోలను జారీ చేసింది. కానీ వీటిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేయడం ప్రస్తుతం తీవ్ర వివాదానికి ... రాజకీయ చర్చకు దారితీసింది. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఈ జీవోలు ఉల్లంఘిస్తున్నాయని హైకోర్టు పేర్కొంది. దీంతో బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశం మళ్లీ గందరగోళంగా తయారైంది. రిజర్వేషన్ల పెంపుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది పొందాలన్న టిడిపి వ్యూహం ఫలించకపోవడంతో ...ఇటు బీసీల నుంచి... ప్రతిపక్షాల నుంచి విమర్శలు దాడి కొనసాగుతున్నాయి. ఈ పరిస్ధితుల్లో ఈ వేడిని చల్లార్చేందుకు ఎపి హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తున్నట్లు ప్రభుత్వం స్పస్టతనిచ్చింది. కానీ దీన్ని ఎవ్వరు బీసీలు నమ్మడం లేదన్నది బహిరంగ సత్యం. కేవలం విమర్శల నుంచి తప్పించుకునేందుకే తప్పా... ప్రభుత్వంలో బీసీ రిజర్వేషన్ల పెంపు పట్ల చిత్తశుద్ది లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మొత్తం మీద చంద్రబాబు నాయుడు మరోమారు కులాల రిజర్వేషన్ల పేరుతో చేసిన అర్బాటం మాత్రం తిరిగి అయన మెడకు చుట్టుకున్న చందంగా తయారైంది. కేంద్రం చట్ట సవరణ చెయ్యించాలనే ప్రయత్నం చెయ్యకుండా....ఏకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కానీ చట్ట సవరణ చెయ్యకుండా కోర్టు కూడా ఈ కేసును ఎటువంటి పరిస్ధితుల్లోను సమర్ధించదు. మరి సుప్రీం కోర్టు కూడా ఈ కేసు కొట్టివేస్తే టిడిపి పరిస్ధితి ఎంటన్నది చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీ ఈ విడత అధికారంలోకి వచ్చాకా బీసీలతో కులాల ఆట బెడిసికొట్టింది. మరి రానున్న రోజుల్లో బీసీలు ఆగ్రహవేశాలు ఎలా ఉంటాయో వేచిచూడాలి.