Friday, 11 September 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు... స్కిల్ స్కాంలో నిజం గెలిచిందా... ?

10 Sep 2026
01:23 AM
110

* హైకోర్టులో విచారణ జరుగుతోంది...

*ఈడి విచారణ జరుగుతోంది...

* జీఎస్టి ఇంటెలిజెన్స్ మేము చేసింది తప్పు అని ఏ కోర్టుకి చెప్పలేదు...

* ఒక్క సిఐడి మాత్రమే చెబితే... నిజం గెలిచినట్లా..?

* టిడిపి నిజం గెలిచింది సంబరాలు దేనికి సంకేతం..? 

Astranews : 

టిడిపి అధినేత చంద్రబాబు సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజున నంద్యాలలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు మూడేళ్ళ తరువాత నిజం గెలిచిందంటూ సంబరాలు చేసుకోవాలి...ఈ రోజున ఒక బ్లాక్ డే గా ప్రకటించాలని చెప్పడాన్ని బట్టి చూస్తే...నిజంగా నిజం గెలిచిందా...? ఇంతకి‌ ఈ మూడేళ్లలో ఏం జరుగుతుందో ఒక సారి చూస్తే....

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును ఏపీ సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 53 రోజుల పాటు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడపాల్సి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఆయన అరెస్ట్ తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా అరెస్ట్ చేస్తారంటూ ప్రజల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాతనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైల్ దగ్గరికి వెళ్లి తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్తామనే ప్రకటన చేశారు. అప్పుడే కూటమికి అంకురార్పణ కూడా జరిగింది. ఆ తర్వాత ఎన్నికల్లో దాన్నే ప్రధానమైన ఎజెండాగా కూటమి నాయకులు ప్రజల దగ్గరికి వెళ్ళారు... ప్రజలు బ్రహ్మాండ రథం పట్టారు.... కూటమిని గెలిపించారు.

ఇప్పుడు మూడేళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ నిజం గెలిచింది అంటూ సంబరాలు చేసుకోవాలి ఈరోజున ఒక బ్లాక్ డే గా ప్రకటించాలి అని చెప్తోంది. నిజంగానే నిజం గెలిచిందా ? చంద్రబాబు నాయుడు అరెస్ట్ కేవలం రాజకీయపరమైన కారణాలతో మాత్రమే జరిగిందా. నిజం గెలవడం అంటే ఆ కేసులో చంద్రబాబు సచ్చిలుడిగా బయటికి రావడం అంటే కేసు విచారణ తర్వాత కోర్టు దీనిలో చంద్రబాబునాయుడు తప్పు ఏమీ లేదని తేల్చడం....తేల్చడం మాత్రమే కాదు. అసలు ఈ కుంభకోణమే జరగలేదని తేల్చడం కూడా అది జరిగినప్పుడే నిజం గెలిచినట్లు చంద్రబాబుకు న్యాయం జరిగినట్లు. 

కానీ చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసినట్లు... ఈ ఏడాది జనవరిలో ఈ కేసుని ఏసిబి కోర్టు కొట్టేసింది. ఏసిబి కోర్టు ఈ కేసుని కొట్టేసింది కాబట్టి చంద్రబాబు నాయుడుకి దీనితో సంబంధం లేదు. అక్రమంగా ఆయన్ని ఇరికించారు అని అనుకుందాం. ఈ కేసుకు సంబంధించి ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.

2023 లో ఈ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. ఆయన 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా పని చేసిన సందర్భంగా స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకోసం రెండు ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. అప్పుడు ప్రభుత్వం సిమెన్స్ అండ్ డిజైన్ టెక్ అనే రెండు సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 3281 కోట్ల రూపాయలు ఆ సదరు రెండు కంపెనీలు దానికి 10% అంటే 330 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూట్ చేస్తే ...ఆ సంస్థలు రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టాయి. కానీ ఆ సంస్థలకు సంబంధించిన డబ్బు రాకముందే రాష్ట్ర ప్రభుత్వమే 10% డబ్బులు ఇచ్చేసింది. ఆ ఇచ్చిన డబ్బులు దుర్వినియోగం అయ్యాయి... రకరకాల షెల్ కంపెనీల ద్వారా ఆ డబ్బులు విదేశాలకి వెళ్ళిపోయింది.... మనీ లాండరింగ్ జరిగింది అనేది వివాదాస్పదం... అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన జీఎస్టి ఇంటెలిజెన్స్ మనీ లాండరింగ్ జరిగింది అనే అంశాన్ని తేల్చిన తర్వాత సదరు సెల్ కంపెనీలు టాక్స్ ఎగ్గొట్టాయి. జీఎస్టి అనే అంశాన్ని తేల్చిన తర్వాత అప్పుడు ఏపీ సిఐడి ఈ అంశం పైన కేసు నమోదు చేసింది. చంద్రబాబుని ఏ 37 గా పెట్టి కేసు పెట్టారు. చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా అప్పుడు చంద్రబాబుకి సంబంధించిన అడ్వకేట్లు హైకోర్టులో చేసిన వాదన ఆయనను 17A అనే ఒక ప్రొటెక్షన్ ప్రకారం ఆయన్ని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. 2018 లో తీసుకొచ్చిన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం ఆయన అరెస్ట్ సక్రమమైనది కాదు అంటూ కోర్టులో వాదిస్తూ వచ్చింది. కానీ ఏసిబి కోర్టు ఆయనకు రిమాండ్ ఇచ్చింది. ఆ తర్వాత హైకోర్టులో కూడా 17A ని చంద్రబాబు నాయుడుకి వర్తింప చేయాలంటూ చేసిన వాదనని హైకోర్టు తోసి పుచ్చింది. దీంతో ఆయనకి బెయిలు ఇవ్వడానికి నిరాకరించింది. ఆ తర్వాత చంద్రబాబు సుప్రీం కోర్టు కి వెళ్ళారు. సుప్రీం కోర్టులో కూడా ఆయన చేసిన వాదన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరగలేదని

 గాని... స్కిల్ డెవలప్మెంట్ లో కుంభకోణం లేదని గానీ కాకుండా 17A ప్రకారం నన్ను అరెస్ట్ చేయకూడదు. 17ఏ ప్రకారం నాకు ప్రొటెక్షన్ ఉంటుంది నన్ను అరెస్ట్

 చేయాలంటే గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేమీ లేకుండా ఏపీ సిఐడి నన్ను అరెస్ట్ చేసింది. కాబట్టి ఈ కేసుని క్వాష్ చేయండి అంటూ ఆయన సుప్రీం కోర్టు ముందుకు వెళ్ళారు. 

ఆ సందర్భంగా కోర్టులో ఈ అంశం పైన వాదనలు జరిగిన సందర్భంగా జస్టిస్ అనిరుద్ బోస్ అనే న్యాయమూర్తి చంద్రబాబుకు 17A వర్తిస్తుంది అనే అంశాన్ని చెప్పారు. చంద్రబాబుకు అనుకూలంగా 17A ని చూడాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పారు. అదే సమయంలో అది ద్విసభ్య బెంచ్ ఆ బెంచ్ లో మరొక జస్టిస్ బాలా ఎం. త్రివేదీ మాత్రం 17ఏ చంద్రబాబుకు వర్తించదు అని సో ఇద్దరు జడ్జీలు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కాబట్టి అంశాన్ని తేల్చలేదు. అనంతరం కేసును చీఫ్ జస్టిస్ బెంచ్ కి బదిలీ చేశారు. చంద్రబాబు కు 17A వర్తిస్తుందా లేదా అంటే.....17A ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 2018 లో వచ్చిన దాని ప్రకారం ప్రజా ప్రతినిధులుగా ఉన్న వాళ్ళు.... ఆఫీస్ లో ఉన్న సందర్భంగా... అంటే వాళ్ళు చైర్లో ఉన్న సందర్భంగా తీసుకున్న నిర్ణయాల పైన ప్రశ్నించే సందర్భంలో.... కేసులు పెట్టే సందర్భంలో ...విచారణ చేసే సందర్భంలో వాళ్ళను అరెస్ట్ అరెస్ట్ చేయాల్సి వచ్చిన సందర్భంలో గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సి

 ఉంటుంది. కానీ కుంభకోణం 2014 -15 ప్రాంతంలో జరిగింది అనేది అలిగేషన్ కాబట్టి...2018 తర్వాత వచ్చిన నేరాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. 2018 కంటే ముందే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగింది... కాబట్టి ఇది దానికి వర్తించదు అనేది ప్రభుత్వం సిఐడి చేసిన వాదన. ఈ వాదనకు సుప్రీం కోర్టులో కూడా బలం చేకూరిన నేపథ్యంలో 17A చంద్రబాబుకు వర్తిస్తుందనే ఆర్గ్యుమెంట్ వీగిపోయింది. కాబట్టి ఆ ప్రొటెక్షన్ ఆయనకి దొరకలేదు. ఆ సందర్భంగానే అప్పుడు ఆయన బెయిల్ పైన బయటికి వచ్చారు. బెయల్ పైన వచ్చిన బెయలు కాస్త కంటిన్యూస్ బెయిల్ అయిపోయింది. అనారోగ్య కారణాలతో బెయిల్ వచ్చింది. ఆ తర్వాత ఆ బెయిల్ కంటిన్యూ అయింది. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్ళారు. అధికారంలోకి వచ్చారు ముఖ్యమంత్రి అయ్యారు. 

ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగింది ఏంటి?  ఇక ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగింది చూస్తే ...ఏపీ సిఐడి అయితే స్కిల్ డెవలప్మెంట్ అంశంలో కుంభకోణం జరిగిందని భావించిందో... దాదాపు 3000 పేజీలకు పైగా చార్జ్ షీట్ ని ఫైల్ చేసిందో ...ఫారెన్సిక్ అడిట్ కూడా చేసిందో... ఈడి కూడా ఈ కేసులో ఎంటర్ అయి విచారణ చేసిందో....అనేక రకరకాల ఆధారాలను సేకరించిన తర్వాత 37 మంది ఈ కేసులో ఉన్న నిందితులకు సంబంధించిన క్రిమినల్ క్రిమినల్ ప్రాసిక్యూషన్ పూర్తి అయిన తర్వాత చార్జి షీట్ ఫైల్ చేసిన తర్వాత ... దాని పైన ట్రైల్ మాత్రమే జరగాల్సి ఉన్న సందర్భంలో.... ఆంధ్రప్రదేశ్ ఏసిబి కోర్టులో ఏపీ సిఐడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత.... ఈ కేసు మిస్టేక్ ఆఫ్ ఫాక్ట్ గా ఏసిబి కోర్టు ముందుకు తీసుకొచ్చింది. అంటే మేము ఏ నేరాన్ని ఆరోపించి కేసు పెట్టామో... ఆ నేరానికి సంబంధించిన ఆధారాలు ఏవి మాకు దొరకలేదు కాబట్టి దీన్ని మిస్టేక్ ఆఫ్ ఫాక్ట్ గా తీసుకొని కేసుని కొట్టేయండి అంటూ ఏసిబి కోర్టు ముందుకు వచ్చింది ఏపీ సిఐడి. ఫలితంగా ఏపి సిఐడి చెప్పిన మేరకు ఏసీబి కోర్టు కేసుని కొట్టివేసింది. 

కానీ కేసు కొట్టివేసినంత మాత్రాన నిజం గెలిచినట్టా..! చంద్రబాబు తప్పు చేయనట్లా...? ఏసిబి కోర్టు ఈ అంశంలో చార్జ్ షీట్ పైన విచారణ చేసి ట్రైల్స్ చేసి... ఆ తర్వాత కేసుని కొట్టివేయలేదు. ఏపీ సిఐడి ఇచ్చిన చార్జ్ షీట్ పైన విచారణ చేసి కోర్టు చంద్రబాబుకి సంబంధం లేదు అని చెప్పలేదు. అలా చెప్పి ఉంటే కోర్టులు క్లీన్ చీట్ ఇచ్చి ఉంటే కోర్టులు ఈ కేసులో చంద్రబాబుని ఎలా ఇరికిస్తారు? ఎలా ఆయన పేరు మెన్షన్ చేస్తారు? మీరు తప్పు చేశారు ..అని కోర్టు విచారణ తర్వాత చెప్పి ఉంటే కచ్చితంగా నిజం గెలిచినట్లే భావించాలి.

కానీ ఏ సిఐడి అయితే కేసు పెట్టిందో... ఏ సిఐడి అయితే 3000 పైగా ఎవిడెన్స్ ని సేకరించి చార్జ్ షీట్ ఫైల్ చేసిందో ...అదే సిఐడి చంద్రబాబు నాయుడు అజమాయిషీలో పని చేస్తున్న సిఐడి ... ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగా సిఐడి ఆఫీసర్స్ గా పని చేస్తున్న వాళ్ళకు సంబంధించిన మెరిట్ ని.... వాళ్ళకు సంబంధించి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది అసెస్మెంట్ చేసే పొజిషన్ లో ముఖ్యమంత్రి ఉంటారు. ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఐపిఎస్ అధికారులకు సంబంధించిన పర్ఫార్మెన్స్ ని అసెస్ చేస్తారో ...ఆ ఐపిఎస్ అధికారే సిఐడి కి

 బాధ్యుడిగా ఉంటారు. ఆ సిఐడి వచ్చి ఏసిబి కోర్ట్లో చంద్రబాబుకి సంబంధం లేదు అని చెప్పింది. కాబట్టి దీన్ని రాజకీయ పరంగా చూసినప్పుడు సిఐడి పైన ఒత్తిడి

 తీసుకొచ్చి... లేకపోతే సిఐడికి ఆదేశాలు ఇవ్వడం ద్వారా కేసు విత్చే డ్రా చేసుకునేలాగా చేశారు అని అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. అనవసరంగా అటువంటి అవకాశాన్ని తన

 రాజకీయ ప్రత్యర్థులకు చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టు చూడాలి. చార్జీ ఫైల్ చేసినప్పుడు దాని పైన విచారణ చేసి విచారణ జరిగిన తర్వాత ఆయనక ఏం సంబంధం లేదు అని తెలిస్తే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కేసు నుంచి బయట పడ్డట్టు భావించాలి. ఆయన నిజంగా గెలిచినట్టు భావించాలి. పైగా ఈ కేసులో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించిన మాజీ చైర్మన్ గా ఉన్న అజయ్ రెడ్డి అనే వ్యక్తి ఏసిబి కోర్టు కేసు కొట్టేయడాన్ని నిరసిస్తూ.... కొట్టేయడానికి

 వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ విచారణ జరుగుతోంది. ఆ విచారణ జరుగుతుండగా ఇప్పుడు అంతకుముందే ఏసిబి కోర్టు కొట్టేసింది కాబట్టి కేసే లేదు అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఇంకా ఆ కేసు పెండింగ్ లో ఉంది. దానితో పాటు మరొక కీలకమైన అంశం ఈ కేసుకు సంబంధించి మరొక అత్యంత కీలకమైన అంశం ఏంటంటే ...నిజం గెలిచింది ...ఆయన తప్పు లేదు ...తప్పు చేయలేదు అని జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదు... అని చెప్పడానికి సంబంధించిన కీలకమైన ఆధారం ఏంటి అంటే ....ఈ కేసు ఇంకా ఈడి క్లోజ్ చేయలేదు. ఏసిబి కోర్ట్లో కేసు క్లోజ్ అయింది.ఏపీ సిఐడి నమోదు చేసిన కేసు. కానీ ఈ కేసు ఈడి పరిధిలో కూడా ఉంది. ఈడి ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కొంతమందిని విచారణ చేసింది. ఈ కేసులో కొంతమంది ఈడి దగ్గర కూడా అప్రూవర్ గా మారారు. ఎవరైతే ఆ రెండు సిమన్స్, డిజైన్ టెక్ కంపెనీకి సంబంధించిన వినాయక్ కావచ్చు, ముకుల్ చంద్ర అగర్వాల్ కావచ్చు, సుమన్ జోషి కావచ్చు అలాగే డిజైన్ టెక్ సిస్టమ్స్ కావచ్చు, సురేష్ గోయల్ కావచ్చు వీళ్ళందరినీ కూడా ఈడి విచారణ చేసింది. దీనిలో మనీ లాండరింగ్ జరిగింది అనేది ప్రాథమికంగా నిర్ధారణ చేసింది. ఆ కేస్ ఇంకా కంటిన్యూ అవుతుంది.  

ఈ కేసులో చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ప్రమేయం లేదని ఈడి ఎక్కడా ప్రస్తావించలేదు. చంద్రబాబుని దీంట్లో నిందితుడిగా ఈడి చేర్చలేదు. విచారణ చేయలేదు. కాబట్టి ఈ కేసుకు సంబంధం ఉన్న వ్యక్తులు 370 కోట్ల రూపాయలు ఏ రకంగా పూణేలోని కొన్ని కంపెనీలకు సెల్ కంపెనీలకి వెళ్ళాయో ...ఆ కంపెనీలు ఏ రకంగా టాక్స్ ఎగ్గొట్టాయో ...ఎగ్గట్టిన తర్వాత ఆ డబ్బులు ఏ రకంగా బయటికి వెళ్ళాయో ...మనీ లాండరింగ్ ఏ రకంగా జరిగిందో దీనికి సంబంధించిన ఆధారాలని జీఎస్టి ఇంటెలిజెన్స్ నుంచి తీసుకున్న తర్వాత ఈడి కేసులో విచారణ చేస్తుంది. ఈడి కొన్ని ఆధారాలను కూడా తేల్చింది. అంటే స్కిల్ డెవలప్మెంట్ అంశానికి సంబంధించి నిధులు దుర్వినియోగం అయ్యాయనో కుంభకోణం జరిగిందనో అంశానికి సంబంధించిన ఎవిడెన్స్ ఈడి దగ్గర ఉన్నప్పుడు... దీంట్లో ఎవిడెన్స్ఏ లేదు కాబట్టి దీన్ని కొట్టేయండి అంటూ ఏపీ సిఐడి ఏసిబి కోర్టులో పిటిషన్ వేయడానికి కూడా మనం తప్పు పట్టాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈడి దగ్గర ఎవిడెన్స్ ఉన్నప్పుడు సిఐడి ఎవిడెన్స్ఏ లేవని... మేము పొరపాటున కేసు నమోదు చేసామని ఏ రకంగా చెప్తుంది. అలా చెప్పడానికి నైతికత ఏముంటుంది. కాబట్టి మొత్తం వ్యవహారంలో ఆయనకు క్లీన్ చీట్ వచ్చిందా ...నిజం గెలిచిందా ... అంటే నిజం గెలవలేదు ... నిజం ఏంటో తెలియకుండా దాచారు అన్నదే సమాధానం.

 

 నిజం గెలవలేదు ..నిజం ఏంటో తెలుసుకునే అవకాశాన్ని ఎవరికీ ఇవ్వలేదు. నిజం గెలవలేదు. నిజం గెలిచిందా లేదా నిజాన్ని నిర్ధారణ చేయాల్సిన కోర్టులో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దీన్ని విచారణ చేయాల్సిన అవసరం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చాయి.

 

అంతేకాదు ఈ కేసులో ఎవరైతే ప్రతివాదులుగా ఉన్నారో ...వాళ్ళు సడన్ గా సిఐడి ఇటువంటి పిటిషన్ ఏసిబి కోర్ట్ లో వేస్తే కూడా మాకేమ అభ్యంతరం లేదు ...మేము గతంలో అలిగేషన్ చేసాం కానీ ఇప్పుడు సిఐడి అటువంటి పిటిషన్ వేస్తే మేమేమో అలిగేషన్స్ కట్టుబడి లేము. మేము చేసిన అలిగేషన్స్ కూడా తప్పని ఒప్పుకుంటున్నాం అంటూ కోర్టుకి ఇచ్చారు . కాబట్టి కోర్టు కొట్టేసింది ..అయితే కోర్టు కొట్టేసినంత మాత్రాన నిజం గెలిచినట్టు కాదు. నిజం తెలియనట్టు.... నిజాన్ని తెలియకుండా దాచినట్లు. ఎందుకంటే ఈ కేస్ ఇంకా హైకోర్టులో ఉంది. హైకోర్టులో అజయ్ రెడ్డి పిటిషన్ వేశారు... విచారణ జరుగుతోంది. ఈ కేసు ఈడి దగ్గర విచారణ జరుగుతోంది. జీఎస్టి ఇంటెలిజెన్స్ మేము చేసింది తప్పు అని ఏ కోర్టుకి ఇప్పటి వరకు చెప్పలేదు. పైగా ఆ కంపెనీలకు సంబంధించిన అంశంలో కొంతమంది అప్రూవర్ గా మారారు. ఆ కంపెనీలకు

 సంబంధించిన ఎండిలు... ఆ కంపెనీలు మా కంపెనీలు కాదు స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఒప్పందం చేసుకున్న కంపెనీయే చెప్పాయి. కాబట్టి చాలా ఇష్యూలు ఈ అంశంలో తేలాల్సి ఉంది. చాలా ఇష్యూలకు సంబంధించి విచారణ జరిగిన తర్వాత .. ఆ విచారణ చేసిన తర్వాత చేసిన చార్ షీట్ ని కూడా పక్కన పెట్టారు.

కాబట్టి ప్రస్తుతానికి నిజం దాక్కుంది... పక్కన నిజానికి ముసుగేశారు తప్ప నిజం గెలవలేదు. నిజం గెలిచినట్టుగా సంబరాలు చేసుకోవడం నైతికతో కాదో ఆ పార్టీ ఆలోచన చేసుకోవాలి.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!