* స్థానిక సంస్థల ఎన్నికల వేళ... పార్టీ శ్రేణులకు దశదిశా చేసేందుకు కుప్పానికి పెద్దిరెడ్డి...
* 2024 ఎన్నికల తర్వాత తొలిసారి కుప్పానికి పెద్దిరెడ్డి ....
* చంపడానికైనా.. చావడానికైనా సిద్ధం : ఎమ్మెల్సీ భరత్
* పెద్దిరెడ్డి వస్తాడనే పోస్టుకే టీడీపీ నేతల్లో భయం.. నిజంగా వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్న ...
* పెద్దిరెడ్డిని అడ్డుకుంటామంటున్న టిడిపి శ్రేణులు...
* కుప్పంలో హైఅలెర్ట్ ....
కుప్పం :
చంద్రబాబు గడ్డపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన ఉత్కంఠను రేపుతొంది. పెద్దిరెడ్డి పర్యటనతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో రాజకీయ వేడి మరింత పెరిగింది. 2024 ఎన్నికల తర్వాత తొలిసారి కుప్పానికి పెద్దిరెడ్డి రానుండటంతో టిడిపి సైతం అలర్ట్ అయ్యింది. కుప్పంలో పెద్దిరెడ్డి పర్యటనను అడ్డుకుంటామని, అయనను అడుగుపెట్టనివ్వమంటూ టిడిపి శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. దీంతో కుప్పంలో హైఅలెర్ట్ నెలకొంది.
ఈ నేపధ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ భరత్ చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికలను యుద్ధంగా అభివర్ణించిన ఆయన.. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు ఎలాంటి ఒత్తిళ్లకు భయపడకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ‘చంపడానికైనా.. చావడానికైనా సిద్ధంగా ఉండే వారినే అభ్యర్థులుగా ఎంపిక చేస్తాం... రక్తాభిషేకం చేసినా ఈ యుద్ధంలో గెలుస్తాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను బరిలోకి దింపుతామని స్పష్టం చేశారు. అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగలిగితేనే సగం విజయం సాధించినట్లేనని అన్నారు. టీడీపీ నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా, అధికార యంత్రాంగం ఎన్ని ఇబ్బందులు పెట్టినా నామినేషన్ వేసిన ఒక్క అభ్యర్థి కూడా ఉపసంహరించుకోకుండా ఉండేలా అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. వైసీపీ సమావేశం నిర్వహించేందుకు కళ్యాణ మండపాలు అద్దెకు ఇవ్వకుండా అడ్డుకున్నారని భరత్ ఆరోపించారు. వైసీపీ సమావేశం పెట్టుకుంటేనే ఎందుకంత భయమని ప్రశ్నించారు. సమావేశం జరిగితే గొడవ జరుగుతుందని టీడీపీ నేతలు ముందుగానే హెచ్చరించినప్పటికీ వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చాయని తెలిపారు.

టీడీపీ నాయకులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంతో పాటు, నామినేషన్లు వేసిన వారిని ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా తాము భయపడబోమని అన్నారు. సింహంలా బతకడం వేరు.. సింహం వేషం వేసుకుని బతకడం వేరు అంటూ టీడీపీ నాయకులపై ఎమ్మెల్సీ భరత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కోసం పనిచేసే ప్రతి నాయకుడు సింహమేనని, అధికారంలో ఉన్నా లేకపోయినా ఒకే విధంగా పనిచేస్తారని అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న నాలుగేళ్ల కాలంలో సింహం వేషం వేసుకున్న టీడీపీ నాయకులు రోడ్డుపైకి వచ్చారా అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే తాము ప్రజల కోసం రోడ్డుపైకి వచ్చి పోరాడుతున్నామని, కేసులు పెట్టడం తప్ప ఇంకేం చేస్తారని ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెడితే అంతగా ప్రజల్లో తమ బలం పెరుగుతుందని వ్యాఖ్యానించారు.
కాలం కలిసి వస్తే ఎవరైనా రాజు కావచ్చని, అందుకు ప్రత్యేక అర్హత అవసరం లేదని భరత్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కాలం టీడీపీకి కలిసి వచ్చిందని, అందువల్ల ఆ పార్టీ నాయకులు ఇష్టానుసారంగా పెద్దా, చిన్నా తేడా లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం నియోజకవర్గానికి వస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పోస్టుపై కూడా భరత్ స్పందించారు. పెద్దిరెడ్డి వస్తారనే పోస్టు పెట్టగానే టీడీపీ నేతలు భయపడి సమావేశం పెట్టారని, నిజంగా పెద్దిరెడ్డి కుప్పానికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని సవాల్ చేశారు.
2024 ఎన్నికల తర్వాత తొలిసారి కుప్పానికి పెద్దిరెడ్డి ... :
బుధవారం జరగనున్న సమావేశం ద్వారా త్వరలో జరగనున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలపై వైసిపి శ్రేణులకు పెద్దిరెడ్డి సైతం దిశ నిర్దేశం చేయనున్నారు పెద్దిరెడ్డి గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. అప్పడు అన్ని తానై పెద్దిరెడ్డి వ్యవహరించారు. ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి వ్యూహంతో మరింత దూకుడుగా ముందుకు వెళ్ళాలని శ్రేణులకు దిశా నిర్దేశం చేయబోతున్నారు పెద్దిరెడ్డి 2024 ఎన్నికల తర్వాత తొలిసారి కుప్పల్లో పెద్దిరెడ్డి పర్యేటిస్తూ ఉండడంతో ఒకింత ఉద్రిక్త వాతావరణం నెలకొనేటువంటి అవకాశం ఉన్నట్లుగా పోలీసులు ముందస్తు చర్యలు చేపెట్టారు. గతంలో పార్టీ గెలిచినటువంటి సందర్భంలో అక్కడ క్యాడర్ ని ప్రజల్ని ఏ విధంగా ఒకతాటి మీదకి తీసుకొచ్చారో అదే విధమైనటువంటి వ్యూహంతో మళ్ళీ ముందుకు వెళ్ళాలని ఒక మాస్టర్ ప్లాన్ తో పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి కుప్పం పర్యటన కొనసాగనుందని పార్టీ వర్గాల సమాచారం. కుప్పంలో పార్టీ శ్రేణులను మళ్ళీ తిరిగి యక్టివ్ మోడ్లోకి తీసుకొని రావాల్సినటువంటి బాధ్యతను పార్టీ అదిష్టానం పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి భుజస్కంధాల మీద పెట్టిన నేపధ్యంలో నియోజక వర్గంలో పర్యటించడం.... ఇతర నాయకులని సమన్వయం చేసుకోవడం ....ఇప్పటికే కుప్పం నియోజక వర్గ సీనియర్ నాయకుల్ని రామచంద్ర రెడ్డి పిలిపించుకొని మాట్లాడిన తర్వాత ఖరారైనటువంటి పర్యటన కావడంతో అందరిలో అసక్తిని రేపుతొంది.
పెద్దిరెడ్డిని అడ్డుకుంటామంటున్న టిడిపి శ్రేణులు... :
మరో వైపు మంగళవారం కుప్పం వైసీపీ ఇన్ చార్జి భరత్ చేసిన వ్యాఖ్యలు, కుప్పంలో పెద్దిరెడ్డి పర్యటనపై టిడిపి శ్రేణులు మండిపడుతున్నాయి. కుప్పంలో పెద్దిరెడ్డిని అడుగు పెట్టనివ్వమని, తప్పక అడ్డుకుంటామంటూ టిడిపి శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. ఒకరినొకరు స్థానికంగా విమర్శించుకుంటున్నటువంటి పరిస్థితుల్లో రెచ్చగొట్టడానికే పెద్దరెడ్డి వస్తున్నాడంటూ టిడిపి ఆరోపణలు గుపిస్తుంది. కుప్పంలో పులివెందుల సంస్కృతికి కుట్రలు జరుగుతున్నాయని టిడిపి విమర్శల దాడి కూడా మొదలుపెట్టిందని విమర్శిస్తున్నారు.
పోలీసుల హైఅలర్ట్ .... :
ఈ నేపథ్యంలో పోలీసులు భారి బందోబస్తుతో హై అలర్ట్ అయ్యారు. ఉత్కంఠ, ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో నిఘా సంస్థల హెచ్చరికలతో ఈ నేపథ్యంలో అక్కడ రేపు ఏదో జరగబోతుంది చాలా సెన్సిటివ్ పరిస్థితిగా కూడా దీన్ని పోలీసులు పరిగణిస్తున్నారు. దీంతో పూర్తి స్థాయిలో పోలీసులు అప్రమత్తమయ్యారు.