* సస్పెన్ష్ కు తెర ...పాత దుకాణాదారులకే మళ్లీ అవకాశం...
*అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవని వార్నింగ్ ....
* ఎమ్మెల్యేలే సెట్ రైట్ చేసుకోవాలని కీలక వ్యాఖ్యలు చేసిన సిఎం చంద్రబాబు...
Andhra Pradesh Liquor Shops Renewal :
ఏపీలో మద్యం దుకాణాలపై సిఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నెలతో పాలసీ ముగుస్తుండగా.. ప్రభుత్వం కొత్త పాలసీపై ఫోకస్ పెట్టిందని జరుగుతున్న నేపధ్యంలో... ప్రస్తుతం ఉన్న పాలసీనే కొనసాగిస్తూ... ఇప్పుడున్న దుకాణాలను రెన్యువల్ చేయనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం పాలసీకి సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్న వార్తలు ఇటీవల ప్రసారమయ్యాయి. ప్రస్తుతమున్న మద్యం పాలసీ 2024 అక్టోబర్‌లో అమల్లోకి వచ్చింది.. ఈ ఏడాది అక్టోబర్ నాటికి రెండేళ్లు పూర్తికానుంది. ఈ క్రమంలో కొత్త పాలసీ కింద మళ్లీ దరఖాస్తులా?.. పాలసీని రెన్యువల్ చేయాలా? అనే రెండు ప్రతిపాదనల్ని ఎక్సైజ్‌శాఖ సిద్ధం చేసినట్లు సమాచారం సాగింది. అయితే ప్రధానంగా పాలసీని రెన్యువల్ చేసే అంశంపై చర్చ జరగగా.... మరో రెండేళ్ల పాటూ ప్రస్తుతం మద్యం షాపులు నడిపిస్తున్నవారికే అవకాశం ఇచ్చేందుకు ప్రభుత్వం మొగ్గుచూపారు. 2024లో పాలసీ సమయంలో 90వేల దరఖాస్తులకు గాను రూ.1990 కోట్లు ఫీజుల రూపంలో వచ్చాయి. షాపులు దక్కిన వారు తమకు సరైన మార్జిన్ ఇవ్వలేదని.. నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేయగా.... ఆ తర్వాత ఎక్సైజ్‌శాఖ సమీక్ష చేసి మార్జిన్ పెంచింది.
ఇలాంటి పిరిస్థితుల్లో మళ్లీ కొత్త పాలసీకి వెళితే పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ కూడా జరిగింది. ఈసారి మళ్లీ కొత్త పాలసీ తీసుకొస్తే ఎన్ని దరఖాస్తులొస్తాయో క్లారిటీ లేకపోగా.... ఒకవేళ తక్కువ ధరఖాస్తులు వస్తే.. ప్రభుత్వ ఖజానాకు లోటు ఏర్పడుతుందని ప్రభుత్వం భావించింది. అందుకే కొత్త పాలసీ కాకుండా ఇప్పుడు ఉన్న లైసెన్స్ లకు పాలసీ రెన్యువల్ చేయాలనే ప్రతిపాదన వైపే ప్రభుత్వం మొగ్గు చూపింది.
అయితే టెండర్ల సమయంలో గతంలో వచ్చిన రూ.1900 కోట్లను లైసెన్స్ ఫీజుతో పాటు మరో 30 నుంచి 40 శాతం అదనంగా రెన్యువల్ ఫీజు కింద చెల్లిస్తే రెన్యువల్ చేసే అవకాశం ఉంటుందని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా లైసెన్సీలు చాలామంది రెన్యువల్‌కు ఓకే చెబుతున్నారు. కొందరు మాత్రం అంత భారీ మొత్తం ఫీజు చెల్లించలేమంటూ అభిప్రాయపడినట్టు అధికార వర్గాల సమాచారం. రెన్యువల్ చేసి ఎవరి షాపులు వారికే ఇస్తున్నామని, ఎంఆర్పి పై ఒక్క రూపాయి కూడా అదనంగా అమ్మడానికి వీలు లేదని... ఎక్కడైనా అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తప్పవని సిఎం వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు ఆయా నియోజక వర్గాల్లో సెట్రైట్ చేసుకోవాలని సూచన చేశారు. మరి అమలులో ఎంత వరకు అచరణ సాధ్యమవుతుందొ వేచి చూడాలి.