Friday, 11 September 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

పుంగనూరు టిడిపిలో ఒకే వరలో రెండు కత్తులేనా ... ?

08 Sep 2026
07:51 PM
115

*ఇన్ చార్జి మార్పు ప్రయోగం....అదిష్టానం ప్రయత్నం ఫలిస్తుందా...
* బెటిసికొట్టి మొత్తానికే మోసం తెస్తుందా... ?
* ఇన్ చార్జిని మార్చినా మాజీ మంత్రి పెద్దిరెడ్డిని ఎదుర్కొగలరా... ? 
Astranews   : 
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని  పుంగనూరు టిడిపి అధిష్టానం ఒకే వరలో రెండు కత్తులు నిమర్చడానికి ప్రయత్నిస్తుందా అంటే అవునన్న అభిప్రాయమే వ్యక్తమవుతోంది. ఎంతో శ్రద్ధగా..జాగ్రత్తగా...ఆ ప్రయత్నాలు మొదలుపెట్టిన అది సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎంత అంటే భవిష్యత్తే నిర్ధేశించాలాంటొంది స్థానిక శ్రేణులు. ఇందుకు కారణం ఇటీవల  ఇంచార్జ్ పదవి నుంచి తప్పించిన నేత వ్యవహారమే కారణం. 

పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయం ఎప్పుడు నివురుగప్పిన నిప్పులానే ఉంటుంది. అలాంటి పుంగనూరులో ఇటీవల వరకు ఇన్ చార్జిగా కొనసాగిన  చల్లా రామచంద్ర రెడ్డి అలియాస్ బాబును తప్పించి మధుసూధన్ నాయుడికి పగ్గాలు అప్పగించింది. దీంతో అయన కార్యకర్తల సమావేశంలోనే కన్నీరు పెట్టుకుంటూ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.  కానీ పార్టీ మాత్రం పుంగనూరు నుంచి వైసీపీ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న బలమైన నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని డీ కొట్టడమే లక్ష్యంగా ఈ భారీ మార్పు చేసినట్లు పార్టీ పెద్దలు స్పష్టం చేస్తున్నారు. 

కానీ  ఇంచార్జ్ మార్పు అనేది పార్టీలో సాధారణ వ్యవహారమే అయినప్పటికీ పొంగనూరులో మాత్రం ఇది పెను రాజకీయ దుమారానికి దారి తీసింది.  కొంతకాలంగా నియోజక వర్గంలో కొనసాగుతున్న వర్గపోరు నాయకత్వ పనితీరుపై ఓ వర్గం నుంచి అధిష్టానానికి వెళ్ళే ఫిర్యాదులే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని  చెప్పుకుంటున్నారు. అటు జూలైలో నిర్వహించిన అంతర్గత అభిప్రాయ సేకరణ సమావేశం ఏకంగా ఇరు వర్గాల ఘర్షణకు దారి తీయడం అధిష్టానం వద్ద పంచాయతీ పెట్టడంతో  మార్పులు చకచక జరిగిపోయాయి. మామూలుగా అయితే ఇంచార్జీ పదవి నుంచి తప్పించిన నేతను పెద్దగా ఎవరు పట్టించుకోరు. కానీ పుంగనూరులో మాత్రం వ్యవహారం రివర్స్ లో  ఉందట. పగ్గాలు కొత్త నేతక ఇచ్చిన టిడిపి అధిష్టానం మాత్రం చల్లా బాబు లైట్ తీసుకోవడం లేదట. ఈ క్రమంలోనే ఇంచార్జిగా  బాధ్యతలు చేపట్టిన మధుసూదన్ నాయుడే స్వయంగా చల్లా బాబు ఇంటి గడప తొక్కారు.  కలిసి పని చేద్దామని ఆయన కోరారని పార్టీ వర్గాల సమాచారం. అయితే పైకంతా ప్రశాంతంగానే కనిపిస్తున్న క్షేత్ర స్థాయిలో రెండు వర్గాల మధ్య ఉన్న అంతరం అంత తేలిగ్గా  సమసిపోతుందా అన్న అనుమానాలు సీనియర్స్ ను వెంటాడుతున్నాయని వినికిడి. దీన్ని ముందే పసిగట్టి ఎక్కడో తేడా కొట్టేస్తుందని గ్రహించిన  పార్టీ అదిష్టానం హుటాహుటిన మంత్రులు బీసి జనార్ధన్ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డిలను స్వయంగా చల్లాబాబు ఇంటికి వెళ్లి మంత్రాలు జరపించడం నియోజకవర్గ రాజకీయాల్లో హాట్ టాపిక్ మారింది. నాయకత్వం  కోల్పోయిన నేత ఇంటికి ఇద్దరు మంత్రులు వెళ్ళడం వెనుక అసలు వ్యూహం ఏంటంటూ రకరకాల విశ్లేషణలు నడుస్తున్నాయి. 

తెలుగుదేశం పార్టీలో చల్లా  బాబుకు ప్రాధాన్యం తగ్గలేదన్న బలమైన సందేశాన్ని క్యాడర్కు పంపేందుకే ఈ భేటీ జరిగినట్టుగా అంచనావేస్తున్నారు. చల్లా గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దిరెడ్డి  రామచంద్ర రెడ్డిని డీకొట్టి స్వల్ప తేడాతో ఓడిపోవడం ఒక ఎత్తు అయితే... అసలు రామచంద్ర రెడ్డి లాంటి నేతకు ఓటమి భయం చూపించారన్న అభిప్రాయం స్థానిక క్యాడర్ లో ఉంది.  ఎన్నికల తర్వాత కూడా చల్లానే పార్టీని నడిపించడంతో నియోజకవర్గంలోని మెజారిటీ క్యాడర్ ఇప్పటికీ ఆయన వెంటే ఉందంటున్నారు.  కారణం ఏదైనా ఇప్పుడు ఒక్కసారిగా లోకల్ పగ్గాలు మారడంతో ఆ క్యాడర్ డీలా పడకుండా పార్టీని వీడకుండా కాపాడుకునేందుకు అధిష్టానమే ఈ బుజ్జగింపు పర్వాన్ని తెరపైకి తెచ్చినట్టుగా అంచనా వేస్తున్నారు. నియోజక వర్గ ఇంచార్జ్ పదవి నుంచి తప్పించినప్పటికీ పెద్దిరెడ్డి  కుటుంబానికి వ్యతిరేకంగా ఆయన చేసిన సుదీర్ఘ రాజకీయ పోరాటాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా లేదా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ లేదా కీలక పార్టీ పదవిని  అప్పగించే యోచనలో పెద్దలు ఉన్నారని టాక్ నడుస్తొంది. ఈ విషయాన్ని ఆయన చెవిన వేయడంతో పాటు స్థానిక ఎన్నికల్లో కలిసి పని చేసి పెద్దిరెడ్డికి చెక్ పెట్టమని కోరేందుకే  మంత్రులు చల్లా బాబు ఇంటికి వెళ్ళినట్టుగా తెలిసింది. 

అయితే చల్లా బాబు ఇంటికి మంత్రులు రావడానికి మరో ప్రధాన కారణం కూడా ఉందని వినికిడి. ఇటీవల ఇన్ చార్జి  పదవి పోయిన తర్వాత చల్లా బాబు అనుచరులతో భావోద్వేగంతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమైన బాబు వీడియోలు వైరల్ కావడంతో పార్టీ  వర్గాల్లో కలకలం రేపాయి. ఆ అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా మారితే ముందముందు నష్టం తప్పదని గ్రహించిన పార్టీ పెద్దలు ఆయన రాజకీయ భవిష్యత్తుకు భరోసా  ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే పొంగనూరులో టిడిపి ఓ క్లిష్టమైన రాజకీయ ప్రయోగం చేస్తుందని మధుసూధనకు అధికార పగ్గాలు అప్పగిస్తూనే చల్లా  వర్గాన్ని కలుపుకొని వెళ్ళాలన్నది పార్టీ పెద్దల వ్యూహం అంటున్నారు సీనియర్ నేతలు.  వాళ్ళ ఆలోచన ఎలా ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పాత విభేదాలను పక్కన పెట్టి రెండు వర్గాలు సమిష్టిగా పని చేసినా మాజీ మంత్రి పెద్దరెడ్డి కోటను బద్దలు కొట్టడం  కష్టతరమైన పనే. మరి ఇద్దరు కలిసి పనిచెయ్యలేదంటే ..ఒకే ఓరలో రెండు కత్తులను ఇమర్చాలని చూస్తున్న టిడిపి అధిష్టానం ప్రయత్నం బెడిసి కొట్టి మొదటికే  మోసం వచ్చే ప్రమాదం సైతం లేకపోలేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!