Friday, 11 September 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

మాటలతో.. రాజకీయ మరణ శాసనం రాసుకున్న మాగుంట... !

04 Sep 2026
04:15 PM
126

* వైఎస్ జగన్ పై విమర్శల  అనంతరం.... మాట్లడలేక మౌనం దాల్చిన ఎంపి మాగుంట..
* ఇన్నేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న పెద్దరికాన్ని చేజేతులా పోగొట్టారంటున్న కుటుంబ సభ్యులు...అభిమానులు...
* తన వ్యాఖ్యలపై ఇంటా బయటా వెల్లువెత్తుతున్న ప్రశ్నలు...
* ఐనవారందురు ఫోన్లు చేసి ప్రశ్నిస్తున్న వారే...
* సమాధానం చెప్పలేక కాల్స్ సైతం సైతం తియ్యలేక సతమతం...
Astranews desk : 
ఎపి రాజకీయాల్లో హుందాగా  రాజకీయం చేస్తారని పేరున్న పొలిటీషియన్స్ లో ఒంగోలు టిడిపి ఎంపి మాగుంట శ్రీనివాసుల్ రెడ్డి  ఒకరు.  టిడిపీ తో పాటు గతంలో కాంగ్రెస్,  వైసీపీ తరపున కూడా ఎంపీ అయ్యారు. ఆయన గత ఎన్నికలకు ముందు  వైసీపీ నుంచి తెలుగుదేశం కండువా కప్పుకొని ఎంపిగా గెలిచారు. పార్టీలు మారిన వ్యక్తిగతంగా వివాదాలకు దూరంగా ఉంటారన్న పేరుంది ఆయనకు. అంతేకాదు రాజకీయ ప్రత్యర్థుల విషయంలో కూడా ఆచితూచి మాట్లాడతారని చెబుతారు. అలాంటి వ్యక్తి తొలిసారి కాస్త తేడాగా మాట్లాడడం పొలిటికల్ హాట్ అయ్యింది. ఇప్పుడు ఆ సెగ కాస్తా అయన రాజకీయ మరణశాసనంగా మారిందన్న ప్రచారం జోరుగా సాగుతొంది. 

వెలిగొండ  ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ సభలో వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ ను ఉద్దేశించి మాగుంట చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చను మార్చేసాయి. జగన్ హయాంలో వెలిగొండ  ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే ప్రారంభోత్సవం చేశారంటూ విమర్శిస్తూ...చివర్లో ఎలక్షన్ సమయంలో తూతూ మంత్రంగా దానిని ఏదో చేసి ఒక పైలా నిర్మాణం చేసి జాతికి అంకితం అని చెప్పిన ఒక మూర్ఖుడు వాడు ...అంతవరకు ఓకే. అది రాజకీయం . కానీ దానికి కొనసాగింపుగా సొంత కులపోడని ఓట్లు వేసి గెలిపిస్తే ఇష్టం వచ్చినట్లు చేసిన మూర్ఖుడు అనడంతో పాటు జగన్ ప్రజలను మోసం చేశారని  ఆరోపించారు. ఎవరో బిజేపి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి లాంటి వారు ఇలా విమర్శించారంటే ఎదో వారి నోరు అంతే. అని అనుకోవచ్చు.  కానీ మాగుంట లాంటి నేత నోటి నుంచి ఈ స్థాయి మాటలు రావడం ఏంటంటూ కాస్త ఆశ్చర్యంగానే మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. 

వాస్తవానికి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెలిగొండకు సంబంధించిన కార్యక్రమాల్లో మాగుంట కూడా వైసిపి ఎంపీ హోదాలో భాగస్వామిగా ఉన్నారు. అంతకుముందు  వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పనులు జరిగినప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. ఆ తర్వాత చంద్రబాబు హయాంలో ప్రాజెక్ట్ పనులు కొనసాగినప్పుడు టీడిపీ లో  ఉన్నారు. అంటే తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ప్రాజెక్ట్ ప్రతి దశలోనూ మాగుంట శ్రీనివాసుల్ రెడ్డి భాగమయ్యారు. అలాంటిది  అన్నీ తెలిసిన నాయకుడు రాజకీయ విమర్శలకు పరిమితం కాకుండా జగన్ను వ్యక్తిగతంగా ఎందుకు టార్గెట్ చేశారు అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉన్న ప్రధాన ప్రశ్న.  అందుకు సమాధానంగా కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెర మీదకి వస్తున్నాయి. 

ఆ మధ్య చెన్నైలో జరిగిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోదరుడి కొడుకు పెళ్లికి వెళ్ళారు మాగుంట. అక్కడ జగన్తో  ఆయన సన్నిహితంగా మాట్లాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో మాగుంట శ్రీనివాసుల్ రెడ్డి మళ్ళీ వైసపీకి దగ్గర అవుతున్నారన్న ప్రచారం జరిగింది. ఈ ప్రచారం పట్ల టిడిపి పెద్దలు మాగుంటపై అనుమానాలు పెంచుకున్నారో ... లేక పనులు కావడం లేదో గానీ... ఇప్పుడు వెలిగొండ వ్యాఖ్యలు ఆ ప్రచారానికి చెక్ పెట్టడానికేనా అన్న అనుమానాలు మొదలయ్యాయి.  రాజకీయ వర్గాల్లో మరువైపు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో అధికార పార్టీకి చెందిన  కొందరు నేతలతో మాగుంటకు మనస్పర్ధలు వచ్చాయన్న ప్రచారం సైతం వినిపిస్తుంది.  

అలాగే వెలిగొండ సభకు ముందురోజు రాత్రి వరకు మాగుంట హాజరుపై స్పష్టత లేదని సమాచారం. చివరకు పార్టీ పెద్దల నుంచి సమాచారం రావడంతో  చెన్నై నుంచి నేరుగా హెలికాప్టర్ లో సభా ప్రాంగణానికి చేరుకుని... పూర్తైన వెంటనే తిరిగి వెళ్ళిపోయారు ఆయన. అయితే వేదికపై మాత్రం జగన్ ను టార్గెట్ చేస్తూ  తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎంపీ వ్యాఖ్యలు కేవలం జగన్ పై విమర్శల లేక టిడిపి నాయకత్వానికి పరోక్షంగా పంపిన రాజకీయ సందేశమా అన్న చర్చ జరుగుతోంది.  చెన్నై పెళ్లి ఎపిసోడ్ తర్వాత వచ్చిన అనుమానాలకు తెరదించడంతో పాటు టీడిపీ తో తన అనుబంధాన్ని మరింత బలంగా చాటుకునే ప్రయత్నం చేసి ఉంటారన్నది విశ్లేషకుల  అంచన. జగన్తో నాకు ఎలాంటి రాజకీయ సంబంధం లేదని చెప్పేందుకే అంత ఘాటుగా మాట్లాడి ఉంటారని విశ్లేషిస్తున్నారు. ఢిల్లీ మధ్యం  కేసు సమయంలో మాగుంట ఆయన కుటుంబ సభ్యుల పేర్లు వచ్చినప్పుడు కూడా ప్రత్యర్ధుల నుంచి రాజకీయ విమర్శలు వచ్చినా పూర్తిగా ఆయన్ని ఎవరూ టార్గెట్ చేయలేదు. కానీ  తాజాగా వెలిగొండ వ్యాఖ్యల తర్వాత వైసపి శ్రేణులు నేరుగా ఎంపీ ని లక్ష్యంగా చేసుకున్నాయి. ముఖ్యంగా మార్కాపురం ప్రాంతంలో పార్టీలకు అతీతంగా జగన్ కు  అభిమాన వర్గం ఉందన్న రాజకీయ అంచనాల నడుమ ఎంపీ మాటలు స్థానికంగా కూడా చర్చకు దారి తీసాయి. ఓట్ల సంగతి అటుంచితే మార్కాపురం  ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గంలో జగన్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందని రాజకీయ వర్గాలే ఒప్పుకుంటాయి.  దీంతో ఇన్నాళ్ళు వివాదాలకు  దూరంగా ఉన్న మాగుంట శ్రీనివాసుల్ రెడ్డి ఇమేజ్ కు ఈ కాంట్రవర్సీ కామెంట్స్ ఇబ్బందికరంగా మారొచ్చన్న అభిప్రాయం బలపడుతుంది. 

ఇవన్నీ అయన వ్యక్తిగతం కాగా... టిడిపి పెద్దల మెప్పు కోసం మాగంటి చంద్రబాబు ట్రాప్లో పడ్డారా అన్న అనుమానాలు లేకపోలేదు. సాధారణంగా ప్రత్యర్ధి పార్టీపై ఘాటైన వ్యాఖ్యలు చెయ్యించడం... భవిష్యత్లో సరిదిద్దుకోలేని నష్టాన్ని మిగుల్చుకునేలా చెయ్యడం చంద్రబాబు చరిత్ర చెప్పే నిజం.  అందుకే మాగంటితో అనుచిత వ్యాఖ్యలు చేయించారని... ఇదే టీడీపీ కోరుకుంటోందని అయన సన్నిహితులు అంటున్నారు. ఈ వ్యాఖ్యల ఫలితంగా భవిష్యత్లో రాజకీయంగా జీవితాన్ని ముగించుకోవాల్సిందేనని.... తను ఎట్టి పరిస్తితులోనూ  వైసీపీలోకి వెళ్లకుండా మాగుంటతో మాట్లాడించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి రాజకీయంగా, వ్యక్తిగతంగా మాగుంట కుటుంబం, బంధుమిత్రులంతా వైసీపీకి అనుకూలం. రాజకీయ, వ్యాపార అవసరాల రీత్యా టీడీపీ నుంచి మాగుంట ప్రాతినిథ్యం వహిస్తున్నట్టు వాళ్లు చెబుతున్నారు. అయితే జగన్ పై మూర్ఖంగా మాగుంట మాట్లాడి, భవిష్యత్లో వ్యాపారాల్ని కూడా బలి పెట్టుకోవాల్సిన దుస్థితిని తనకు తానే తెచ్చి పెట్టుకున్నారనే అంతర్మథనం ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల్లో సాగుతోంది. 

 వైఎస్ జగన్ పై  మాగుంట శ్రీనివాస్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున తప్పు పడుతున్నారు. మాగుంట కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు కూడా తీవ్రంగా పశ్చాత్తాపం చెందుతున్నట్టు తెలుస్తోంది. మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఇన్నేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న పెద్దరికాన్ని చేజేతులా పోగొట్టుకున్నారని వాళ్లంతా వాపోతున్నారని సమాచారం.  మాగుంటకే పెద్ద సంఖ్యలో ఫోన్లు చేస్తూ నిలదీస్తున్నారని సమాచారం. అలాగే జగన్ పై అనుచిత వ్యాఖ్యల్ని తప్పు పడుతూ, భారీ సంఖ్యలో ఆయన వాట్సాప్నకు మెసేజ్లు పంపుతున్నారని సమాచారం. దీంతో ఫోన్ కాల్స్ కూడా తీసి సమాధానం చెప్పడానికి  కూడా మాగుంట అయిష్టత చూపుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు

ఈ వ్యాఖ్యల ద్వారా రాజకీయంగా మాగుంట తనకు తానే బందీ అయ్యారనే అభిప్రాయం ఆయన దగ్గరి వాళ్ల నుంచి వ్యకమవుతోంది. రానున్న రోజుల్లో వైసీపీలోకి మాగుంట వెళ్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో, ఆయనకు ఆ పార్టీలో తలుపులు మూసుకుపోయినట్టైంది.  మొత్తం మీద టిడిపి అధినేత చంద్రబాబు దగ్గర తన ఇమేజ్ పెంచుకునేందుకు చేసిన ప్రయత్నం ..మాగుంట భూమరాంగ్ అయినా కావచ్చన్న విశ్లేషణలు ఎక్కువగానే వినపడుతున్నాయి. 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!