* ఇవ్వాళ మేము, రేపు ఎవ్వరో...
* పదవులు ఉన్నా లేకున్న మా గౌరవం మాకు ఉంటుంది...
* ఎక్స్ లో కొండా మురళి ట్విట్ ....
*అన్ని దరిద్రాలు ఏకమై మా మీదా చేస్తున్న చేసిన రాజకీయ దాడులకు..
* దృఢంగా నిలబడతాం, మొండిగా ఎదురు వెళ్లగలం...
*నా బర్తరఫ్ ఒక కుట్ర : కొండా సురేఖా...
Astranews :
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అధికార కాంగ్రెస్ పార్టీలో విబేధాలు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారాయి. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే లేఖ రెడీ చేసి గవర్నర్‌కు పంపడం..గవర్నర్ ఆమోదం తెలపడం జరిగిపోయాయి. ఓ వైపు కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించే అంశం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీయగా... మరో వైపు ఆమె భర్త కొండా మురళీ బాల్కానీ నుంచి మీసం మెలేస్తూ అభిమానులకు అభివాదం చేయడం వైరల్‌గా మారింది.
ఈ క్రమంలో ఆమె భర్త కొండా మురళీ వ్యవహార తీరు ప్రస్తుతం సంచలనంగా మారింది. తన భార్య మంత్రి పదవి పోయినా ఆయన తన ఇంటి బాల్కనీ నుంచి మీసం తిప్పుతూ అభిమానులకు అభివాదం చేయడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు.. ఇదేం కొత్త కాదు, ఉన్నది ఉన్నట్టు, కుండా బద్దలు కొట్టినట్టు మాట్లాడుతే ఎవ్వరు తట్టుకోరు! ఇవ్వాళ మేము, రేపు ఎవ్వరో.
పదవులు ఉన్నా లేకున్న మా గౌరవం మాకు ఉంటుంది. మేము ప్రతిదానికీ స్పందిచకపోవచ్చు కానీ ప్రతీ ఒక్కటి గమనిస్తూనే ఉంటాం అంటూ ఎక్స్ లో పోస్టు చేశారు. అన్ని దరిద్రాలు ఏకమై మా మీదా చేస్తున్న చేసిన రాజకీయ దాడులకు దృఢంగా నిలబడతాం, మొండిగా ఎదురు వెళ్లగలం అంటూ కూడా ఎక్స్ లో పేర్కొన్నారు.
అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక సమాచారం రాకముందే కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు, అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనను బర్తరఫ్ చేయడంలో వీరి కుట్ర ఉందంటూ ఆమో ఆరోపించారు. తనకు చెప్పకుండా తనను మంత్రి పదవీ నుంచి తప్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కూతురి చేసిన ఆమె వ్యక్తిగత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు. అయినా పార్టీని చాలా మంది తిట్టారని, కానీ నన్ను మాత్రమే కావాలని టార్గెట్ చేశారంటూ కొండా సురేఖ వ్యాఖ్యానించారు. అయితే మంత్రి పదవి పోయినా తాను పార్టీకి రాజీనామా చేయనని కొండా సురేఖ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లోనే ఉంటూ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ప్రజలకు సేవ చేస్తానని ఆమె తెలిపారు.
నా బర్తరఫ్ ఒక కుట్ర :
కానీ తన కూతురు ఇండిపెండెంట్ అని, ఆమె వ్యక్తిగత అభిప్రాయాలను గౌరవించాలని, తన కూతురి చేసిన వ్యాఖ్యలతో తనకేం సంబంధం అంటూ ఆమె స్పష్టం చేశారు. తనకు ఏ సమాచారం ఇవ్వకుండా బర్తరఫ్ ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. అలాగే తన బర్తరఫ్ ఒక కుట్ర అని దానీ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు, అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉన్నారంటూ ఆమె ఆరోపించారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయం చేశారని, తనను మంత్రి పదవి నుంచి తప్పించకుంటే, సీఎం పదవి నుంచి నేను తప్పుకుంటాను అని బెదిరించినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి.