Friday, 11 September 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

ఆ క్రెడిట్ మొత్తం వైఎస్ఆర్ దే.. ! - డిప్యూటి సిఎం పవన్ ...

03 Sep 2026
01:49 PM
88

*గతేడాది కాకినాడ సెజ్ పై  పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. 
* పవన్ ప్రసంశలను ఎక్స్ లో పోస్ట్ చేసిన ఏపీ కాంగ్రెస్ ..
*వైఎస్సార్ చేసిన పని ఎంత బలంగా ఉందో పవన్ మాటలే చెబుతున్నాయన్న కాంగ్రెస్.... 
Astranews : 
ఉమ్మడి ఎపిలోనే కాదు...దేశ వ్యాప్తంగా కూడా ఎవరికి రానీ నూతన ఆలోచలనా విధానాలతో అనేక నూతన పథకాలు... కార్యక్రమాలు రూపకల్పన చేసి అమలు చేసిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిది. ఇందులో ఆరోగ్య శ్రీ,. 108, ఫీజు రీఎంబర్స్ మెంట్, ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి పథకాలతో ప్రజల గుండెల్లో కొలువైపోయారు. అయన పథకాలతో లబ్దిపొందిన వారు ఇప్పుడు అయన మరణానంతరం పూజలు చేస్తున్న వారు లేకపోలేదు. 

Article Image 

ఇప్పుడు అలాంటిదే మరో కార్యక్రమైన  కాకినాడ సెజ్ రూపకల్పన గురించి  ఎపి కాంగ్రెస్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. దీంతో పాటుగా గతేడాది డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంశలను కూడా పోస్ట్ చేశారు. గతేడాది పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ...నక్కపల్లి నుంచి కాకినాడ SEZ వరకు వైఎస్సార్ గారే ప్రారంభించారు. ఈ కాన్సెప్ట్‌ను జనసేన కానీ, ఏ పార్టీ కానీ తీసుకురాలేదు' అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ వీడియోను ట్వీట్ చేశారు. దీంతో వైఎస్సార్‌ చేసిన పనులు ఎంత బలంగా ఉన్నాయో.. ఈ మాటలే చెబుతున్నాయి అంటూ పవన్ కళ్యాణ్ కాకినాడలో నిర్వహించిన సభలో మాట్లాడిన వీడియోను ట్వీట్ చేస్తూ ఎపి కాంగ్రెస్ మరోమారు వైఎస్ఆర్ పాలనను గుర్తిచేసింది. 

రాజకీయాలు ఎలా ఉన్నా.. వైఎస్సార్ చేసిన పని ఎంత బలంగా ఉందో, పవన్ మాటలే చెబుతున్నాయి' అంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసిన వీడియోలో.. '2005 నుంచి నక్కపల్లి SEZ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఇది జనసేన కానీ మిగిలిన పార్టీలు చేసింది కాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి SEZను ప్రతిపాదించి తీసుకొచ్చారు' అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. 

Article Image

గతేడాది అక్టోబర్ నెలలో డిప్యూటీ సఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా ఉప్పాడలో నిర్వహించిన మత్స్యకారుల బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ గురించి ప్రస్తావించారు. కేంద్రం రూ.323 కోట్లతో ఉప్పాడ సీ ప్రొటెక్షన్‌ వాల్‌ నిర్మించేందుకు సానుకూలంగా ఉందని, మత్స్యకారులు పరిశ్రమలకు వ్యతిరేకం కాదని చెబుతున్నారని.. కానీ వారికి ఆ పరిశ్రమల వల్ల మత్స్య సందప తగ్గిపోతుందనే ఆందోళన ఉందన్నారు. వ్యర్థాలను శుద్ధి చేయకుండా బయటకు విడుదల చేయడంతో మత్స్యసంపద దెబ్బతింటుందని.. అందుకే కాలుష్యం తగ్గించేందుకు ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఆ సమయలో నక్కపల్లి SEZ గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. 

ఈ సందర్బంగా పవన్ చేసిన వ్యాఖ్యలను... ఎపి కాంగ్రెస్ ఎక్స్ వేదికగా పోస్ట్ చెయ్యడంతో... దివంగత వైఎస్ఆర్ కార్యక్రమాలు, పథకాలు ఎంతో వినూత్నంగా...ఎంత నూతనంగా ఉన్నాయోనంటూ తెలియజేసే ప్రయత్నం చేసింది. అంతేకాదు... ఇలాంటి కార్యక్రమాల ఆలచనలు ఏ పార్టీకి రాలేదంటూ చెయ్యడం కూడా వైఎస్ఆర్ పాలనకు అద్దం పడుతున్నాయని ... రాజకీయాలు ఎలా ఉన్నా... వైఎస్సార్ చేసిన పని ఎంత బలంగా ఉందో, ఈ మాటలే చెబుతున్నాయంటూ పేర్కొంది. 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!