* సిఎం రేవంత్ హైదరాబాద్ చేరుకున్నాకా ..కొండా సురేఖా బర్తరఫ్ అంటూ ప్రచారం...
*పరిస్ధితిని సమీక్షిస్తున్న కొండా సురేఖా...
* పార్టీ నిర్ణయాన్ని బట్టి ఘాటుగానే స్పందించేందుకు సిద్దమైన కొండా...
* మధ్యాహ్నాం తరువాత కార్యాకర్తలతో భేటి అయ్యే అవకాశం ....
Astranews desk :
తెలంగాణా రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఉత్కంఠగా మారింది. సిఎం రేవంత్ రెడ్డి పై మంత్రి కొండా సురేఖా కుమార్తె చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో ... మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ ఖాయమన్న సంకేతాలు ఇప్పటికే హల్ చల్ చేస్తుండటంతో... మరింత ఉత్కంఠగా మారాయి. కొండ సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంలో పార్టీ హై కమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో నన్న ఉత్కంట నెలకొన్న నేపధ్యంలో... హస్తినలో నిన్నంతా వరుస భేటీలు జరిగాయి. ఈ భేటిల్లో నిన్న సిఎం రేవంత్ రెడ్డి కేంద్ర పెద్దలతో చెప్పాల్సి చెప్పి హైదరాబాద్ కు బయలుదేరారు. దీంతో అయన హైదరాబాద్ కు చేరుకున్న అనంతరం మంత్రివర్గం నుంచి మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చెయ్యడం ఖాయమన్న ప్రచారం ఉపందుకుంది.
మరో వైపు కొండా సురేఖ, చిన్నారెడ్డిలు కూడా హైకమాండ్ కు ఎవరి బాధలు వారు వినిపించారు. తాజా పరిణామాలను బట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొండా బర్త్ ఆఫ్ దిశగా అడుగులు పడుతున్నట్లు సమాచారం. ఢిల్లీ పెద్దలను కలిసి తన వాదన వినిపించిన కొండా సురేఖ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ రోజు వరంగల్ వెళ్ళనున్నారు. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో దాన్ని బట్టి స్పందించాలని మంత్రి కొండా సురేఖ వేచి చూస్తున్నారు. అధిష్టానం నిర్ణయం తర్వాత హనుమకొండ రామనగర్ లోని తన నివాసంలోనే స్పందించే అవకాశం ఉంది. ఎలాంటి నిర్ణయం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని క్యాడర్ కు కొండా దంపతులు ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.
ఇక మరోవైపు కొండా సురేఖ ఎపిసోడ్ పై ఎవరు స్పందించొద్దని జిల్లా నేతలకు హై కమాండ్ ఆదేశాలు జారీ చేసింది. అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు ఎవరు మాట్లాడొద్దని సూచించింది. కొండా సురేఖ చిన్నారెడ్డి వ్యవహారంలో పార్టీ హై కమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో నన్న ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే దీని మీద కొండా సురేఖ కూడా పార్టీ నిర్ణయం తర్వాత మాట్లాడదామన్న ఆలోచనలో కూడా ఉన్నారు.
కానీ మరో వైపు మంత్రివర్గం నుంచి కొండా సురేఖ భర్త రఫ్ కు రంగం సిద్ధమైందని, ఏ క్షణంలోనైనా అధిష్టానం నుంచి సిఎం రేవంత్ రెడ్డికి ఆదేశాలు వచ్చేటు వంటి అవకాశం ఉంది. రెండు గంటల లోపు ఈ భర్త రఫ్ కు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ముగించేటువంటి అవకాశం ఉంది . పచివాలయానికి సంబంధించినటువంటి అధికారులని కూడా ఇప్పటికే అలర్ట్ చేశారు. అయితే బర్తరఫ్ కి సంబంధించినటువంటి లేఖ రాజ్ భవన్ కి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియపై అధికార యంత్రాంగాన్ని అలర్టు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది.
అయితే ఢిల్లీ కి సంబంధించినటువంటి విషయాన్ని చూస్తే సిఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ప్రస్తుతానికి ఢిల్లీలోనే ఉన్నారు. సాయంత్రం హైదరాబాద్ కి ఇద్దరు బయలుదేరి రాబోతున్నారు. ఈ ఎపిసోడ్ అన్నిటి మీద కూడా పార్టీలో క్రమశిక్షణ అనేది ముఖ్యమని, ఎన్నికలు ఇంకా
రెండు ఏళ్లు ఉన్నటువంటి క్రమంలోనే ఒక్కొక్క నాయకుడు బయటికి వచ్చి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో పార్టీలో క్రమశిక్షణ అనేది ఉండాల్సిందేనని, నాయకులైనా .. మంత్రులైనా ఎవరైనా సరే దానికి కట్టుబడి ఉండాలనే వాస్తవాన్ని పార్టీ అదిష్టానం చెబుతు వస్తొంది. కానీ నిత్యం ఎక్కడో ఒక చోట అదే రిపీట్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే వీటన్నిటికీ ఎక్కడో ఒక దగ్గర బుల్ స్టాప్ పెట్టాలనేటువంటి ఆలోచనతో అధిష్టానం ఉంది.
సీఎం రేవంత్ రెడ్డి కూడా జరిగినటువంటి ఎపిసోడ్ మీద సీరియస్ గా ఉన్నారు. మంత్రి కొండ సురేఖ కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు మొదటిసారి క్షమించినప్పటికీ కూడా రెండోసారి కూడా అది రిపీట్ అయ్యింది. కాబట్టి ఏం కాదులే అనే ధోరణిలోకి వెళ్తుంది అన్న అభిప్రాయము అధిష్టానం దగ్గర బలంగా ఉన్న నేపధ్యంలో.. ఇఖ ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా భర్తరాఫ్ చేయాల్సిందే అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చిందని, అది మరి కాసేపట్లో అధికారికంగా ఒక నిర్ణయం ప్రకటించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది.
ఇక కొండా సురేఖాకి సంబంధించి ప్రస్తుతం ఇంకా అమె హైదరాబాద్ నివాసంలోనే ఉన్నారు. మూడు గంటల తర్వాత తను మాట్లాడటానికి లేదంటే ఆమూడు గంటల తర్వాతనే తనకు సంబంధించినటువంటి అప్డేట్స్ ... జరుగుతున్నటువంటి పరిణామాల మీద స్పందిస్తారా లేదా అనేది చూడాలి. కొండా సురేఖ వరంగల్ కు వెళ్ళేలోపు ... ప్రస్తుతం వరంగల్ కు వెళ్ళడం కంటే వరంగల్ కు సంబంధించి తనకు ఉన్నటువంటి అనుచరులందరినీ కూడా హైదరాబాద్ కి రమ్మన్నట్టు తెలుస్తొంది. కొద్దిసేపు క్రితమే మీడియా కొండా సురేఖ నివాసానికి వెళ్ళినటువంటి సందర్భంగా మూడు గంటల దాకా మేడం కిందికి రారు .. మూడు గంటల తర్వాతనే ఏదైనా మాట్లాడతారేమో అనే విషయాన్ని చెప్పినట్లు సమాచారం.