Saturday, 12 September 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

సంస్థల ఎన్నికల వేళ ..టిడిపికి జనసేన టెన్షన్ ..!

27 Aug 2026
09:04 PM
143

* స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కవ స్థానాల్లో పోటీ చెయ్యాలనుకోవడం...
* టిడిపిని కాదని ..జనసేన పార్టీ పోటీకి  ఆసక్తి చూపిస్తున్న పలు కార్పొరేషన్లలో... 
* జనసేన పోటీకి సమాయత్తం అవుతుండటంతో టిడిపిలో పెరుగుతున్న ఆందోళన ...

Astranews Desk : 
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వేల కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న జనసేనను చూసి... తెలుగుదేశం పార్టీని భయపెడుతున్నట్లు కనిపిస్తొంది. దీంతో తెలుగుదేశం పార్టీకి జనసేన ఫోబియా పట్టుకున్నట్లు కనబడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది  జనసేన పార్టీ పోటీకి  ఆసక్తి చూపిస్తున్న స్థానాలు ... పోటీకి ఆ పార్టీ సమాయత్తం అవుతున్న తీరుతో తెలుగుదేశం పార్టీలో ఆందోళన పెంచుతోంది. 

జనసేన  పార్టీకి గడిచిన శాసన సభ ఎన్నికల సందర్భంగా కేవలం 21 స్థానాలను తెలుగుదేశం పార్టీ కేటాయించింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ కేటాయించిన 21 స్థానాలతోనే జనసేన సంతృప్తి చెందింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవకూడదు అనేదే మా లక్ష్యం... ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే కారణంతో తెలుగుదేశం పార్టీతో     అడ్జస్ట్ అయ్యింది. టిడిపితో కలిసిన సందర్భంగా మనం తగ్గుతున్నాం అంటే మన బలం తక్కువ అని కాదు... నాకు ఒక వ్యూహం ఉంది. ఆ వ్యూహం పేరకు నేను ముందుకు వెళ్తున్నాను. మీరంతా నాతో ఉండాల్సిందే అనంటూ జనసేన కార్యకర్తలకు పవన్ కళ్యాణ్  సర్దిచెప్పి ముందుకు నడిపించారు. ఆ మేరకు జనసేన పార్టీ కార్యకర్తలంతా 21 స్థానాలతో సరిపెట్టుకున్నారు. అయినా 21 చోట్ల పోటీ చేసిన జనసేన 21 స్థానాల్లో గెలుచుకుంది. సరే అప్పుడు అధికారమే పరమావధిగా పెట్టుకున్న కూటమి పార్టీలు దాంతో సరిపెట్టుకున్నాయి. 

కానీ ఇప్పుడు పరిస్ధితి మారింది. అధికారం వచ్చి రెండున్నరేళ్లు దాటింది. ఈ నేపధ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రావడం...ఇప్పుడు మాత్రం మీరు ఇచ్చినన్ని సీట్లే తీసుకునే పరిస్థితిలో మేము లేము అని చాలా స్పష్టంగా జనసేన పార్టీ చెప్తోంది. చాలా స్పష్టంగా నాలుగు గోడల మధ్య కూర్చున్న మీటింగ్లో చెప్పడం కాదు ఓపెన్ గా మీడియా మైకుల ముందు చెప్తున్నారు జనసేన పార్టీకి సంబంధించిన నేతలు. మంత్రి నాదేండ్ల మనోహర్ సైతం ఇప్పటికే  చెప్పారు. మేము గతంలో తీసుకున్న సీట్లు మా బలం మేరకు కాదు... అప్పుడు మా లక్ష్యం వేరు ...ఇప్పుడు లక్ష్యం వేరు... పార్టీకి సంబంధించిన విస్తరణ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరికీ అవకాశం కల్పించాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నామంటూ ఆయన చెప్పడం ఇటీవల చూశాం. 21 స్థానాల్లో పోటీ చేసామంటే మా బలం అంతే అని కాదు.. మాకు బలం అన్న చోట పోటీకి సంబంధించి ఎట్టి పరిస్థితిలో ముందుకు వస్తాం... సర్దుకునిపోయే పరిస్థితి సరి ఉండదంటూ ఆయన మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే మాట మాట్లాడుతూ వచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎపిలో స్థానిక ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కంటే జనసేన పార్టీ చాలా యాక్టివ్ గా సన్నద్ధం అవుతున్నట్లు కనపడుతుంది. దానిలో భాగంగా స్థానిక ఎన్నికల్లో ఏ రకంగా ముందుకు వెళ్లాలో దానిపైన ఒక 14 మంది పార్టీకి సంబంధించిన  నాయకులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు జనసేన అధినేత. ఎదిఎమైనా తమ పార్టీలో కనీసం 40% సీట్లు అడగాలి 30% సీట్లను తీసుకొని పోటీ  చేయాలని జనసేన చాలా కృత నిశ్చయంతో ఉన్నట్లు కనపడుతుంది. కానీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రం టిడిపి 80, జనసేన 15, బిజేపి 5 శాతం సీట్లలో పోటీ చేస్తుందని మంత్రి నారా లోకేష్ చెప్పడం.. ఆ మాటల దుమారం రేపడం జరిగిపోయాయి. అంతేకాకుండా జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ సైతం టిడిపికి కొమ్ము కాసేందుకు జనసేన ఎర్పడలేదని, అధికారంలోకి రావడానికి ఎర్పడిందని చెప్పడం ఇటీవల సంచలనంగా మారింది. దీనికి బదులుగా సర్దుచెప్పుకునే మాటలతో అప్పటికి సర్దుకున్నా...జనసేన మాత్రం ఈ సారి ఎక్కవ స్థానాల్లో పోటీ చెయ్యాలని కసరత్తులో ఉంది. ఇదే ఇప్పుడు టిడిపికి వణుకు తెప్పిస్తుంది.  

జనసేన ఎక్కువ స్థానాల్లో పోటీ చెయ్యడమే కాదు... ప్రధానమైన కార్పొరేషన్లు విజయవాడ కార్పొరేషన్, తిరుపతి,ఒంగోలు, కాకినాడ లాంటి కార్పొరేషన్లు తామే పోటీ చేయాలని జనసేన పార్టీ అనుకుంటుంది. డైరెక్ట్ ఎన్నిక కాబట్టి  తమ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మేయర్ గా ఉండాలనే పార్టీ కోరుకుంటుంది. ఈ మేరకు తమ ప్రయత్నం కేవలం తాత్కాలిక ప్రయత్నం కాదని... ఏదో ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించడం కోసం కాదని.. తమ ప్రయత్నం చాలా  సీరియస్ గా ఉందని చెప్పే ప్రయత్నం  కూడా జనసేన పార్టీ చేస్తూ వస్తుంది. 

ఎందుకంటే  ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకపోతే జనసేన పార్టీకి సంబంధించిన ఉనికికే ప్రమాదం ఉంటుంది. గతంలో పవన్ కళ్యాణ్ 2021 స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువ బలంగా జనసేన పార్టీ క్యాడర్ స్థానిక ఎన్నికల్లో పోరాడింది. చాలా చోట్ల స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చేతులు ఎత్తేస్తే జనసేన పార్టీకి సంబంధించిన స్థానిక నాయకత్వం పోటీ చేశారు. తొట్ట తొలి సారి తెలుగు జనసేన పార్టీ ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారానే 2019 ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలిచి ఉండొచ్చు కానీ ... ఆ తర్వాత ఆయన వైసిపీ లో చేరిపోయారు. కానీ జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎంపిటీసిగా, జెడ్పిటిసిలుగా, సర్పంచులుగా, వార్డ్ మెంబర్లుగా, కౌన్సిలర్లుగా గెలిచిన సందర్భం తొట్ట తొలిసారి ఆ పార్టీ చూసింది. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ బలాన్ని చూసే తెలుగుదేశం పార్టీ కూడా జనసేనతో పొత్తు కోసం తహతహలాడింది. జనసేనతో పొత్తు కోసం కొంత దిగి వచ్చింది. కానీ ఇప్పుడు గతంలో తమ బలాన్ని చూపించింది స్థానిక సంస్థల ఎన్నికలేనని, తమ పార్టీకి సంబంధించిన క్యాడర్ బలంగా ఫైట్ చేసిందని,   స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమీ లేని సందర్భంలో .. ఇప్పుడు మనం డిప్యూటీ సీఎం గానో 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ఇటువంటి సందర్భంలో మనం పోటీ చేయకుండా వదిలేస్తే క్యాడర్ మనల్ని వదిలేస్తారేమో... ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి జనసేన పూర్తిగా లొంగిపోయింది లాంటి ప్రచారం బలంగా విస్తరిస్తుందని జనసేన చెబుతుంది. 

 స్థానిక సంస్థల ఎన్నికల్లో గనక మనం తెలుగుదేశం పార్టీకే పూర్తిగా బాధ్యతలు ఇచ్చేస్తే.. వాళ్ళకే ఎక్కువ సీట్లు ఇస్తే ...జనసేన క్యాడర్ మనతో ఉండదు. జనసేన క్యాడర్ కి ఏం సమాధానం చెప్పాలి? గతంలో చెప్పాం ..ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు ...వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలనే కారణంతో నేను తగ్గాను అని చెప్పాం. ఇప్పుడు ఏం చెప్తాం? ఇప్పుడు మనకు బలం లేదని చెప్పుకుందామా ..బలం ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ పారిపోయిన సందర్భంలో జనసేన స్థానిక ఎన్నికల్లో పోటీ చేసింది. కాబట్టి ఇప్పుడు పోటీ చేయకుండా ఉండడానికి కారణం చెప్పడానికి కూడా రీజన్ లేదు. జనసేన పార్టీ దగ్గర ఇప్పుడు తమ పార్టీ నాయకత్వాన్ని స్థానిక నాయకత్వాన్ని కాపాడుకోలేకపోతే స్థానిక నాయకత్వానికి అవకాశాలు కల్పించలేకపోతే వాళ్ళ ఎవరు జనసేన పార్టీతో ఉండే పరిస్థితి ఉండదు. స్థానిక ఎన్నికలు చాలా సీరియస్ గా ఉంటాయి. స్థానిక ఎన్నికలు చాలా ఫ్రస్ట్రేజెస్ ఉంటాయి చాలా ఎమోషన్స్ ఉంటాయి. మాకు పోటీ చేసే అవకాశం కూడా లేకపోతే ఎట్లా ? అనే ఆలోచన గనుక జనసేన క్యాడర్ వస్తే జనసేన పార్టీకి సంబంధించిన ఉనికి కూడా ప్రమాదంలో పడే పరిస్థితి ఉంటుంది. 

ఈ కారణంగానే జనసేన అధినేత స్థానిక ఎన్నికల్లో పోటీకి అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు తీసుకోవడం ద్వారా ఎక్కువ చోట్ల పోటీ చేయడం ద్వారా పార్టీని విస్తరించడం విషయం పక్కన పెడితే పార్టీని బలోపేతం చేసుకోవచ్చు.ఏ కారణంతో అయితే జనసేన పార్టీ బలంగా ఉందని భావిస్తున్నారో...అటువంటి చోట్ల జనసేన పార్టీకి సంబంధించిన స్థానిక ప్రజా ప్రతినిధులు ఉండడం అవసరం. ఇలాంటి సమయంలో వాళ్ళ కోసం నిలబడడం అవసరం. వాళ్ళ కోసం ఫైట్ చేయడం అవసరం... అనేది జనసేన పార్టీ అధినేత వ్యూహంగా కనబడుతుంది.

గతంలో మనకి చాలా నియోజకవర్గంలో అభ్యర్థులు లేరు. క్యాడర్ లేరు. మన దగ్గర డబ్బులు లేవు. తెలుగు దేశం పార్టీ అంతా బలం మనకు ఉందా అంటూ పవన్ మాట్లాడడం చూసాం. కానీ ఇప్పుడు ఆయన ఆ మాట మాట్లాడలేరు. చాలా గ్రామాల్లో చాలా ప్రాంతాలలో జనసేన పార్టీకి ఇప్పటికీ ఒక క్యాడర్ ఏర్పడింది. ఆ క్యాడర్ అంతా కాస్త ఆర్గనైజ్డ్ అవుతున్నారు. వాళ్ళంతా కూడా జనసేన పార్టీ తరపున పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్  ఆదేశాలు లేకపోయినప్పటికీ ...అధికారంలో లేకపోయినప్పటికీ... పార్టీకి సంబంధించిన పరిస్థితి ఏమాత్రం బాగలేనప్పటికీ మనం ఎన్నికలో పోటీ చేసాం గెలిచాం. ఇప్పుడు మెరుగైన ఫలితాలు సాధించగలుగుతామ అనే ఆలోచన వాళ్ళందరికీ ఉంది. కాబట్టి వాళ్ళను నిరుత్సాహ పరిచే  పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు లేరు. అది తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలనే కోణంలో కాకపోయినా జనసేన పార్టీకి సంబంధించిన బలాన్ని సుస్థిరం చేసుకోవడంలో భాగంగా జనసేన క్యాడర్లో స్థైర్యం నింపడంలో భాగంగా జనసేన క్యాడర్ అంతా జనసేనతోటే ఉండేలా చేయడంలో భాగంగా మెజారిటీ స్థానాల్లో పోటీ చేసే ఆలోచన జనసేన చేస్తోంది. 

అయితే 30% సీట్లు జనసేన పార్టీకి ఇవ్వడం అంటే ప్రతి గ్రామంలో ప్రతి నియోజక వర్గంలో బలమైన క్యాడర్ నెట్వర్క్ ఉన్న తెలుగుదేశం పార్టీకి అది చిన్న విషయం కాదు. అది క్యాడర్ కి ఏదో సర్ది చెప్పుకునే విషయం ఏమాత్రం కాదు. అది కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించే విషయం. ఈ చిక్కుముడిని ఈ సమస్యని తెలుగుదేశం పార్టీ ఏ రకంగా పరిష్కరిస్తుందో చూడాలి. జనసేన స్థానిక  ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి జనసేన టెన్షన్ పెంచుతున్న పరిస్థితి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మనకు కనబడుతుంది.

 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!