Friday, 11 September 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / అంతర్జాతీయ వార్తలు

నేపాల్‌లో జల ప్రళయం... !

26 Aug 2026
07:20 PM
59

* కోండల్లో నుంచి సునామీల వచ్చి పడిన జలకెరటాలు ...
* జలప్రళయంలో కొట్టుకుపోయిన గ్రామలు, వంతెనలు, రహదారులు... 
* వందల మంది భారతీయులు గల్లంతు.. 
* కైలాస యాత్రికులపై తీవ్ర ఆందోళన..
* బీహార్, యూపీ జిల్లాల్లో హెచ్చరికలు

Nepal Floods :  

నేపాల్‌లో జలప్రళయం తీవ్ర వినాశానాన్ని సృష్టించాయి. ప్రత్యేకించి రసూవా జిల్లా సమీపంలో చైనా సరిహద్దు ప్రాంతంలో సంభవించిన తీవ్రమైన అకస్మాత్తుగా వచ్చిన వరదలు భారీ వినాశనాన్ని సృష్టించాయి. భోటే కోషి నదిలో ఒక్కసారిగా ఉప్పొంగిన ప్రవాహం ధాటికి రసూవాగఢి-తిమురే ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ ప్రమాదంలో కనీసం 31 మంది మరణించగా, వందలాది మంది గల్లంతయ్యారు. గల్లంతైన దాదాపు 384 మంది పర్యాటకులలో కనీసం 105 మంది భారతీయ పర్యాటకులు, 37 మంది ఎన్ఆర్ఐలు ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కైలాస మానససరోవర యాత్రకు వెళ్లిన యాత్రికులు కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం.

Article Image

నేపాల్ నుంచి వచ్చిన భారీ వరద నీటి ఉధృతికి ఒక వంతెన కొట్టుకుపోవడం, బహుళ అంతస్తుల భవనాలు కూలిపోవడం వంటివి అక్కడి నుంచి విడుదలైన వీడియోల్లో కనిపిస్తోంది. నేపాల్‌లోని నువాకోట్ జిల్లాలో బురద వరద నీరు ప్రవహించిన తర్వాత ఇళ్లు పాక్షికంగా మునిగిపోయినట్లు ఇతర చిత్రాల్లో కనిపిస్తోంది. భూకంపం ఆకస్మిక వరదలకు దారితీయడం వల్ల ఇది జరిగి ఉండవచ్చని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయని నేపాల్ విదేశాంగ మంత్రి తెలిపారు. చైనా నియంత్రణలో ఉన్న టిబెట్‌లో "భారీ ప్రాణనష్టం" జరిగినట్లు చైనా ప్రభుత్వ మీడియా కూడా పేర్కొంది. నేపాల్ నుండి విడుదలైన వీడియోలలో, వరద నీటి ఉధృతికి ఓ భారీ వంతెన కొట్టుకుపోవడం, బహుళ అంతస్తుల భవనాలు కూలిపోవడం, ఓ పట్టణంలో అనేక భవనాలు ధ్వంసమైన అనంతర దృశ్యాలు కనిపిస్తున్నాయి. కఠ్మండుకు వాయువ్యంగా సుమారు 16 మైళ్ల (25 కి.మీ.) దూరంలో ఉన్న భాగమతి ప్రావిన్స్‌లోని నువాకోట్ జిల్లాలోని త్రిశూలి బజార్ ప్రాంతానికి సంబంధించిన వీడియోలుగా పోషియల్ మీడియాలో పేర్కొన్నాయి.  

Article Image

ఈ జల ప్రళయం నేపధ్యంలో నేపాల్ రక్షణ దళాలు, సైన్యం హెలికాప్టర్లు, డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్ సహాయంతో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటి వరకు కొందరిని సురక్షితంగా బయటకు తీసి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. ఈ అకస్మాత్తు వరదకు ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియలేదు. టిబెట్ సరిహద్దులోని హిమానీనదం పగలడం  లేదా కొండచరియలు విరిగిపడటం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన కారణంగా రసూవా, నువాకోట్ జిల్లాల్లో పలు విద్యుత్ ప్రాజెక్టులు, వారధులు, వాహనాలు కొట్టుకుపోయాయి.

Article Image

నేపాల్ ప్రధాని బాలేంద్ర షా జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీతో అత్యవసర సమావేశం నిర్వహించారు. సైన్యం, పోలీసులు, సహాయక బృందాలను తక్షణమే ప్రభావిత ప్రాంతాలకు తరలించారు. నేపాలీ సైన్యానికి చెందిన హెలికాప్టర్లతో సహాయక చర్యలు చేపట్టినప్పటికీ, వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో అత్యంత దెబ్బతిన్న ప్రాంతాల్లో ల్యాండింగ్ సాధ్యం కాలేదు. రసువా, నువాకోట్, ధాదింగ్, గూర్ఖా, చిత్వాన్ జిల్లాల్లో నదీ తీర ప్రజలకు హై అలర్ట్ ప్రకటించారు. ఈ వరద ధాటికి రసువాగధి వద్ద ఉన్న ఫ్రెండ్‌షిప్ బ్రిడ్జ్‌తో పాటు పలు జలవిద్యుత్ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. దీనివల్ల దేశంలోని మొత్తం 3.2 గిగావాట్ల జలవిద్యుత్ సామర్థ్యంలో 12 శాతానికి సమానమైన 430 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

Article Image

భారత్‌లో ముందస్తు హెచ్చరికలు  :
నేపాల్‌లోని త్రిశూలి నది ఉప్పొంగడంతో ఆ ప్రభావం భారత్‌లోని గంధక్ నదిపై పడే అవకాశం ఉందన్న కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. బీహార్, ఉత్తరప్రదేశ్ సరిహద్దు జిల్లాలను అప్రమత్తం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రధాని బాహ్య బాధ్యతలకు సంఘీభావం తెలపడంతో పాటు అవసరమైన సహాయం అందిస్తామని ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీహార్ ముఖ్యమంత్రితో మాట్లాడి ఎన్డీఆర్ఎఫ్ బలగాలను రంగంలోకి దించారు.

Article Image

 

 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!