Saturday, 12 September 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

ప్రధాని మోదీ హింసించాడు ....చంపించాడు...! అంటూ కడపలో మోడి కటౌట్లపై స్టిక్కర్లు...

24 Aug 2026
08:41 AM
99

కడప :

 ప్రధాని మోదీ హింసించాడు ....చంపించాడు... అంటూ కడపలో మోడి కటౌట్లపై స్టిక్కర్లు ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. నగరంలోని ఎర్రముక్కపల్లె సర్కిల్లోని లక్ష్మీతులసి భారత్ పెట్రోల్ బంక్లో ప్రధాని మోదీ చిత్రంపై ఈ నినాదాలతో కూడిన పోస్టర్లు అంటించడం వివాదాస్పదంగా మారింది. 'మోదీ చంపించాడు, మోదీ హింసించాడు. జెన్ జీని చూసి మోదీ భయపడ్డాడు' తదితర నినాదాలతో కూడిన స్టిక్కర్లు అంటించారు. అయితే 20 రోజులుగా ఈ స్టిక్కర్లు ఉన్నా ఎవరూ గుర్తించలేదు. నిత్యం జనసంచారం ఉన్న ప్రదేశమైన  ఎవ్వరు వీటిని గుర్తించక పోవడం విశేషం. వీటిని ఎవరు అతికించారు.. ఎందుకు అతికించారన్నది అంతుపట్టడం లేదు. అయితే ప్రధాని పై ఇలాంటి విమర్శలు చేస్తూ స్టిక్కర్స్ అతికించడం దారుణమని,  బాధ్యులపై చర్యలు తీసుకోవాలని BJP జిల్లా అధ్యక్షుడు జంగిటి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!