* ఎన్నికలొస్తే ఎవరికెన్ని సీట్లు ?... గెలిచేదెవరు ?
* ఎపిలో చర్చనీయాంశంగా హైదరాబాద్ ఐఐటీయన్స్ గ్రూప్ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ఆంధ్రా’ సర్వే ఫలితాలు
* సర్వేలో ప్రజల మద్దతు వైసీపీకి 44.5 శాతం.. కూటమికి 40 శాతం..
* కూటమి vs వైసీపీ పోటీలో వైసీపీ 83, కూటమి 62 సీట్లు అని అంచనా ...
* సీఎం ఎంపికలో వైఎస్ జగన్ 44 శాతం.. చంద్రబాబు 32%, లోకేశ్ 5% , పవన్ 6% ...
Astranews desk :
ఎపి రాజకీయాల్లో ‘మూడ్ ఆఫ్ ఆంధ్రా’ పేరుతో వెలువడిన ఓ సర్వే ఫలితాలు సంచలనంగా మారాయి. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు ఉండగానే... హైదరాబాద్‌కు చెందిన ఐఐటీయన్స్ గ్రూప్ (IITians Group) నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలోని ప్రజల రాజకీయ అభిప్రాయాలను అంచనా వేసినట్లు నివేదికలో పేర్కొంది. గతంలోను ఇదే గ్రూప్ పేరుతో ఏపీకి సంబంధించిన సర్వే నివేదికలు కూడా ప్రచురితం కాగా... తాజాగా చేపట్టిన సర్వే ప్రకారం మరో మారు ప్రజల రాజకీయ అంచానాలను స్పష్టం చేసింది. ఈ సర్వేలో అధికార కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని పేర్కొంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 44.5 శాతం, కూటమి పార్టీలకు 40 శాతం మద్దతు ఉన్నట్లు సర్వే అంచనా వేసింది.మరోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా అనే ప్రశ్నకు 44 శాతం మంది రాదని అభిప్రాయపడినట్లు నివేదిక పేర్కొంది. సీఎం ఎంపికలో వైఎస్ జగన్ 44 శాతం.. చంద్రబాబు 32%, లోకేశ్ 5% , పవన్ 6% శాతం మద్దతు తెలిపినట్లు సర్వే అంచానా వేసింది. దీంతో ఈ సర్వే ఫలితాలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అందరిని మూడ్ ను సర్వేపైనే ఆలోచించేలా చేస్తొంది.
సీఎం ఎంపికలో వైఎస్ జగన్ ముందంజ ... :
‘మూడ్ ఆఫ్ ఆంధ్రా’ సర్వేలో ఓ కీలక అంశం ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. ఎప్పుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడిని కాదని... వైసీపీ అధినేత వైఎస్ జగన్ సిఎం ఎంపిక రేసులో ముందున్నట్లు పేర్కొంది. ఈ సర్వేలో సీఎం ఎంపికలో వైఎస్ జగన్ కు 44 శాతం.. చంద్రబాబు 32%, లోకేశ్ 5% , పవన్ 6% శాతం ప్రజల మద్దతు వ్యక్తమైంది.

సర్వేలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. :
ఈ సర్వేలో ‘మూడ్ ఆఫ్ ఆంధ్రా’ మరో ప్రధాన అంశాన్ని కూడా వెల్లడించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో మూడు పార్టీలు ( టిడిపి, బిజేపి, జనసేన) కలిసి పోటీ చెయ్యడంతో భారీ మెజార్టీ సీట్లతో కూటమి అధికారంలోకి వచ్చింది. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే భవిష్యత్తులోను కూటమికి తిరుగుండదని ప్రచారం సాగుతుంది. కానీ ఈ సర్వేలో మాత్రం ప్రస్తుత కూటమిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, తీవ్ర అసంతృప్ది ఉన్నట్లు స్పష్టమైంది.
ప్రజల మద్దతు వైసీపీకి 44.5 శాతం..కూటమికి 40 శాతం .. :
సర్వేలో వైసీపీ ప్రతిపక్ష పార్టీ అయినా ప్రజల మద్దతు 44.5 శాతం నమోదు కాగా, కూటమికి 40 శాతం మాత్రమే ప్రజల మద్దతు లభించింది. కూటమికి వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా... మండలి వేదికగా అధికార కూటమిని హామీలు, పథకాలు, వైఫల్యాలు, సమస్యలు, రైతుల సమస్యలు, అక్రమాలు, అవినీతి, శాంతి భద్రతలపై నిలదీస్తుండటం... దీనికితోడు సమస్యలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం రోడ్డెక్కి బాధితుల దగ్గరకు వెళ్తుండటం వంటి కారణాల వల్ల కావొచ్చు... ఈ సర్వేలో వైసీపికి 44.5 శాతం ప్రజలు మద్దతు తెలిపారు. అయితే హామీల అమలులో వైఫల్యాలు, రైతుల సమస్యలు, శాంతిభద్రతల వైఫల్యాలు, అభివృద్ది, అక్రమాలు, అవినీతి వంటి ప్రభావం కావొచ్చు... కూటమికి ప్రజల మద్దతు తగ్గిందన్న అభిప్రాయం వ్యక్తమవుతొంది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై కూడా సర్వేలో ప్రశ్నలు అడిగినట్లు నివేదిక పేర్కొంది. అందులో అవినీతి 27 శాతం, రైతుల సమస్యలు 25 శాతం, నిరుద్యోగం 21 శాతంతో ప్రధాన సమస్యలుగా నిలిచినట్లు వెల్లడించింది.దీనికితోడు ఎపిని కుదిపేస్తున్న డిఎస్సీ అక్రమాలు వ్యవహారంలో వైసీపీ వర్సెస్ కూటమి పోరు పెద్ద ఎత్తున నడుస్తుంది. ఈ అంశంలో అక్రమాలు సరిగాయని 48 శాతం నమ్మితే... లాంటిదేమీ లేదన్న వారి శాతం మాత్రం 39 శాతంగా నమోదైంది.
కూటమి vs వైసీపీ పోటీలో ... వైసీపీ 83, కూటమి 62 సీట్లు అని అంచనా ... :
కూటమి వర్సెస్ వైసీపీ పోటీలో వైసీపీకి 83 అసెంబ్లీ స్థానాలు, కూటమికి 62 స్థానాలు వస్తాయని సర్వే అంచనా వేసినట్లు పేర్కొంది. అయితే ఈ సీట్ల అంచనాలు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ఆధారంగా చేసిన సర్వే ప్రొజెక్షన్లు మాత్రమేనని, ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ప్రజాభిప్రాయం మారే అవకాశం ఉంటుందని కూడా సర్వే స్పష్టం చేసింది. అదే పొత్తు లేకపోతే మాత్రం వైసీపీకి 47 శాతం, టీడీపీకి 36 శాతం, జనసేనకు 6.5శాతం, బీజేపీకి 2.5 శాతం ఓట్లు వస్తాయని తేలింది. దీన్ని సీట్లుగా మారిస్తే వైసీపీకి 110-112, టీడీపీకి 43-45, జనసేనకు 2-4 సీట్లు వస్తున్నాయి. మరో 20-21 సీట్లలో హోరాహోరీ ఉంది.


ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి ఆరోపణలపై సంచలన రిపోర్ట్ .. :
‘మూడ్ ఆఫ్ ఆంధ్రా’ సర్వేలో మరో కీలక అంశం.. ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి. ఈ అంశంలో సంచలన రిపోర్ట్ వ్యక్తమైంది. ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతిని అంగీకరించిన ప్రజలు 42% కాగా... సమాధానం చెప్పని వారు 19 % మంది. ఎమ్మెల్యేల పనితీరుపై కేవలం 39 % మంది ప్రజలు మాత్రమే సంతృప్తిగా ఉన్నారన్న వాస్తవాన్ని బహిర్గతం చేసింది. మొత్తంగా చూస్తే.. ‘మూడ్ ఆఫ్ ఆంధ్రా’ పేరుతో వచ్చిన ఈ సర్వే అధికార కూటమికి ప్రతికూలంగా, వైసీపీకి అనుకూలంగా ప్రజాభిప్రాయం మారుతోందని సూచిస్తోంది.

