* పెల్లెట్ గన్ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ..
* పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ సమీపంలో రాహుల్ దాదాపు 8 గంటలపాటు ధర్నా...
* కేసు నమోదుకు పోలీసులు అంగీకరించడంతో ...ధర్నా విరమణ ...
ఢిల్లీ :
పెల్లెట్ గన్ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన ధర్నాతో ఢిల్లీ వనికిపోయింది. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ సమీపంలో రాహుల్ దాదాపు 8 గంటలపాటు ధర్నా కొనసాగించారు. పెల్లెట్ గన్ బాధితుడితో కలిసి పోలీసులను ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్ ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు దిగొచ్చారు. కనాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. దీంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్న డిమాండ్‌తో కొనసాగుతున్న రాహుల్ ధర్నా కీలక మలుపు తిరిగింది. జులై 20న జరిగిన విద్యార్థుల నిరసనల్లో పెల్లెట్లు తగిలాయని బాధితులు ఆరోపించగా.. పోలీసులు మాత్రం ఆందోళన సమయంలో పెల్లెట్ గన్స్ ఉపయోగించలేదని గతంలో పేర్కొన్నారు. ఈ అంశంపైనే రాహుల్ గాంధీ తాజాగా పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు.

అంతకు ముందు ఏం జరిగింది .. ?
నీట్ యూపీ ప్రశ్నాపత్రం లీక్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వంలో జరిగిన విద్యార్థుల ఆందోళనలతో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, జులై 20 పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థులు.. జంతర్ మంతర్ నుంచి ర్యాలీగా బయలుదేరడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ సమయంలో విద్యార్థులపై లాఠీఛార్జ్, టియర్ గ్యాస్, పెల్లెట్లు ప్రయోగించారు. ఈ ఘటనపై తాజాగా బాధితుడితో కలిసి రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా జులై 20న నీట్ యూజీ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో విద్యార్థులపై లాఠీఛార్జీ, పెల్లట్లు ఉపయోగించమని ఎవరు ఆదేశాలిచ్చారో చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు బాధితుడితో కలిసి వెళ్లారు. ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేవరకు అక్కడ నుంచి కదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, కేసు నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించడంతో బాధితుడు సాహిల్ లోచాబ్‌తో కలిసి పోలీస్ స్టేషన్ వెలుపల రాహుల్ ధర్నాకు దిగారు. విద్యార్థుల నిరసన సమయంలో పోలీసులు, పారామిలిటరీ బలగాలు క్రూరంగా వ్యవహరించారనే ఆరోపణలపై పరిశీలనకు సుప్రీంకోర్టు ఒక ఉన్నతాధికార నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్టు ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే, ఎఫ్ఐఆర్ నమోదు అయ్యే వరకు కదలేది లేదని కాంగ్రెస్ ఎంపీ ఉద్ఘాటించారు.
‘‘మేము విద్యార్థుల కోసం నిలబడతాం. న్యాయం కోసం పోరాడతాం. మేము మౌనంగా ఉండం.. ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు డీసీపీ ఆఫీస్ వద్ద ధర్నా కొనసాగుతుంది’’ అని కాంగ్రెస్ ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొంది. ఈ ధర్నాలో ప్రియాంకా గాంధీ కూడా పాల్గొన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. జులై 20న జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సాహిల్‌పై పోలీసులు పెల్లెట్ గన్‌తో దాడి చేశారని, దానివల్ల అతడు ఒక కంటిని కోల్పోయే స్థితిలో ఉన్నాడని తెలిపారు. అయితే, నిరసనకారులపై పెల్లెట్ గన్‌లు తాము వాడలేదని ఢిల్లీ పోలీసులు ఖండించారు.
ఉదయం నుంచి నాటకీయ పరిణామాలే .. :
ఈ ఘటనకు సంబంధించి శుక్రవారం తెల్లవారుజామున నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎఫ్ ఐఆర్ నమోదు చేసేందుకు ఢిల్లీ పోలీసులు నిరాకరించారని లోనన్ ఆరోపించడంతో, రాహుల్ గాంధీ కొంతమంది కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయనను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ముందుగా వారు కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అయితే న్యూఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సచిన్ శర్మ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఉన్నారని సమాచారం అందడంతో వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు.
తెల్ల టీషర్ట్, లేత గోధుమరంగు ప్యాంట్ తో రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్లోకి నడుచుకుంటూ వెళ్లడంతో అక్కడి అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. తొలుత ఫిర్యాదు నమోదు చేయాలని ఆయన అధికారులను ఒత్తిడి చేశారు. అయితే అధికారులు నిరాకరించడంతో పోలీస్ స్టేషన్ బయట బైరాయించి నిరసన ప్రారంభించారు. లోచవ్ ఫిర్యాదును నమోదు చేసేందుకు అధికారులు అంగీకరించే వరకు తన నిరసనను విరమించబోనని ఆయన తెలిపారు. "లోచవ్ కంటిలో 3 గుళ్లు దిగాయి. అతని శరీరంలో 200 గుళ్లు ఉన్నాయి. అతని గుండె సమీపంలో తాకలేని గుళ్ల ముక్కలు ఉన్నాయి. తాము గాలి తుపాకులతో కాల్పులు జరపలేదస్ ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. పోలీసులు కాకపోతే గాలి తుపాకులతో కాల్పులు జరిపింది ఎవరు? బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయవద్దని తమకు పైస్థాయి నుంచి ఆదేశాలు వచ్చాయని పోలీసులు చెప్పారు" అని రాహుల్ మీడియాతో అన్నారు. విద్యార్థి శరీరం నుంచి వెలికితీసిన లోహపు గుళ్లను కూడా ఆయన మీడియాకు చూపించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ వాద్రా, కుమారి సెల్టా, జైరాం రమేశ్, రణదీప్ సుర్జేవాలా రాహుల్ గాంధీతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. వారు పోలీస్ స్టేషన్లోకి వెళ్లారు. చివరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో కాంగ్రెస్ నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.