* కూటమి వచ్చి మూడేళ్లు కావొస్తున్నా పట్టుదొరకని మండలి...
*డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికతో మరోమారు పట్టు నిరుపించుకున్న వైసీపీ ...
* ఈ అక్రోశం కాకారణంగానేనా...
* డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక అనంతరం బయటక వెళ్ళిన కూటమి సభ్యులు...
Astranews :
ఎపిలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి భారీ మెజార్టీతో అధికార పీఠం చేజిక్కించుకుంది. సాధారణంగా అధికారం మారిందంటే శాసనమండలిలో ఎమ్మెల్సీలతో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు ఇలా అందరిని తమ వైపు పూర్తిస్థాయిలో బలం నిరుపించుకునే ప్రయత్నం చెయ్యడం సహజం. ఇక టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అయితే ఇలాంటి వాటిల్లో చాలా ముందే ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లైనా శాసనమండలిలో మాత్రం పట్టుదొరకడం లేదు. బిల్లుల ఆమోదం విషయంలో శాసనమండలి చాలా అవసరం. అయితే అధికారంలోకి వచ్చినప్పట్టి నుంచి ఎంతగా ప్రయత్నం చేసిన మండలి మాత్రం కూటమికి చిక్కడం లేదు. ఈ కారణంగానే వైసీపీ అసెంబ్లీకి రాకపోయినా... మండలిలో తమ వాయిస్ బలంగా అసెంబ్లీ కి వెళ్లని లోటు కనపడకుండా చేస్తొంది. డిఎస్సీ అక్రమాలపై కూడా తన వాయిస్ బలంగానే వినిపిస్తుండటంతో ... కూటమి సభ్యులు చర్చకు రెడీ అంటూనే హడలిపోతున్నారు.
ఏపీ రాజకీయాల్లో 2024 ఎన్నికలు పెను మార్పును తెచ్చాయి. అప్పటివరకూ 150కి పైగా ఎమ్మెల్యేలతో ఎంతో బలంగా కనిపించిన వైసీపీ (YCP) కాస్తా ఎన్నికల ఫలితాల తర్వాత 11 సీట్లకు పడిపోయింది. అదే సమయంలో శాసనమండలిలో (AP Legislative Council) మాత్రం 50 ఎమ్మెల్సీలు ఉండటంతో పటిష్టంగా కనిపించింది. అయినా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో.. మండలిపై వైసీపీ పట్టు కొనసాగించడం అంత సులువు కాదని అంతా భావించారు. కానీ రెండున్నరేళ్ల పాలన తర్వాత కూడా కూటమి మండలిపై పట్టు సాధించడంలో విఫలం కాగా.. వైసీపీ మాత్రం అదే పట్టు కొనసాగిస్తుండటం ఆ పార్టీకీ కొండంత బలాన్ని ఇచ్చినట్లైంది.

ఈ నేపథ్యంలో తాజాగా మండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక వచ్చింది. గతంలో వైసీపీ మండలి ఛైర్మన్ గా గెలిపించుకున్న జకియా ఖానం.. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరిపోయారు. అయినా ఛైర్మన్ రూపంలో కొయ్యే మోషేన్ రాజు ఉండటంతో కూటమి ఫిరాయింపు రాజకీయాలు పనిచేయలేదు. వైసీపీ నుంచి కూటమిలోకి ఆరుగురు ఎమ్మెల్సీలు ఫిరాయించినా వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మోషన్ రాజు సైలెంట్ గా ఉండిపోవడంతో చంద్రబాబు కూడా చేసేదేమీ లేకుండా పోయింది. మరికొందరు పార్టీ మారతారని కూటమి భావించినా అది జరగలేదు. ఇలాంటి పరిస్ధితుల్లో జకియా ఖానం పదవీకాలం ముగిసిపోయి మండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక రావడంతో కూటమి కచ్చితంగా అభ్యర్ధిని నిలబెట్టి గెలిపించుకుంటుందని అంతా భావింంచారు. కానీ ఇక్కడా సీన్ రివర్స్ అయింది. ఆదిలోనే చేతులెత్తేసింది.
వైసీపీ మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి నిలబెట్టిన ఎమ్మెల్సీ తూమాటి మాధవరావుకు పోటీగా కూటమి నుంచి అభ్యర్దిని నిలబెట్టలేదు. దీంతో ఆయన ఏకగ్రీవంగా మండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికయ్యారు. దీంతో మండలిలో ఛైర్మన్ గా కొయ్యే మోషేన్ రాజు, విపక్ష నేతగా బొత్స సత్యనారాయణ తర్వాత మూడో కీలక పదవిలోనూ మరో వైసీపీ నేత ఎంపికయ్యారు. తద్వారా వైసీపీ ఇక్కడ హ్యాట్రిక్ సాధించింది. అదే సమయంలో సొంత ప్రభుత్వం ఉన్నా.. వైసీపీ ఎమ్మెల్సీలను తమవైపు తిప్పుకోవడంలో ప్రభుత్వం విఫలమైనట్లయింది. దీని వెనుక మరో కారణం ఫిరాయింపులకు దిగితే సదరు ఎమ్మెల్సీలపై మండలి ఛైర్మన్ వేటు వేసే ప్రమాదం పొంచి ఉండటమే. మరోవైపు గతంలో స్దానిక సంస్దల కోటాలో బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ కాకుండా అడ్డుకోవడంలోనూ కూటమి విఫలమైంది. తాజా పరిణామంతో కూటమి సర్కార్ పై పైచేయి సాధించిన వైసీపీ.. మండలిలో మరోసారి పట్టు నిలుపుకుంది.
అయితే ఈ ఎన్నికలో కూటమి కనీసం అభ్యర్థిని పోటీలో దించలేకపోవడం...వైసీపీ అభ్యర్ది ఏకగ్రీవంగా గెలవడం...మండలిలో పట్టుదొరకకపోవడం వంటి పరిణామాలతో సిఎం చంద్రబాబులోనే కాదు...కూటమి సభ్యుల్లోను తీవ్ర అక్రోశం... అసంతృప్తి నెలకొందని చెప్పవచ్చు. కొత్తగా ఎన్నికైన డిప్యూటీ చైర్మన్‌ను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టేందుకు అన్ని పార్టీల సభ్యులు కలిసి రావాలని చైర్మన్ కోరినప్పటికీ కూటమి పార్టీల సభ్యులు ఆ కార్యక్రమానికి హాజరుకాలేదు. బయటకు వెళ్ళిపోవడంతో వారిలోని అక్రోశాన్ని చెప్పకనే చెప్పింది. దీంతో వారి తీరుపై వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రులు సభా నియమాల గురించి మాట్లాడుతున్నారని, అదే సమయంలో డిప్యూటీ చైర్మన్‌కు గౌరవం ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటన జరగలేదని అన్నారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, సభా సంప్రదాయాలు, గౌరవాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని స్పష్టం చేశారు. గెలుపోటములు ప్రజాస్వామ్యంలో సహజమని, కానీ సభా సంప్రదాయాలు, విలువలు శాశ్వతమని పేర్కొన్నారు. తెలియదా? ప్రజలు మీకు అధికారం ఇచ్చారు.. అహంకారం ఇవ్వలేదు.. గుర్తుంచుకోవాలి..కూటమి పార్టీ సభ్యులు చరిత్ర హీనులుగా నిలిచిపోతారు అని విమర్శించారు.
కానీ మండలి లో అదిపత్యం మాత్రం వైసీపీ అసెంబ్లీకి రాకపోయినా పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ కాకుండా చేస్తొంది. మరో వైపు అసెంబ్లీ లో సొంత డబ్బా కొట్టుకుంటున్న కూటమి... మండలి వ్యవహారంతో డ్యామేజే అవుతుంది.