Astranews :
అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే వైసీపీ డీఎస్సీ అక్రమాలపై వాయిదా తీర్మానంతో కూటమి ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్దమైంది.
లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్థుల జీవితాలతో ఆటలాడుతూ క్వశ్చన్ పేపర్ లీక్ నుంచి స్పోర్ట్స్ కోటా నియామకాల వరకూ సాగిన అక్రమాలపై మండలిలో చర్చించాలని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి, కల్పలత రెడ్డి, రామచంద్రా రెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు.

స్పోర్ట్స్ కోటా నియామకాల్లో, నార్మలైజేషన్ విధానంలో మరియు మెరిట్ జాబితాల రూపకల్పనలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. పూర్తి స్థాయి మెరిట్ జాబితాలను బహిరంగంగా ఉంచకుండా గోప్యత పాటించారని విపక్షం ప్రశ్నిస్తోంది. డీఎస్సీ ప్రక్రియపై సీబీఐ విచారణ జరపాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని వైయస్‌ఆర్‌సీపీ డిమాండ్ చేస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. నిబంధనల ప్రకారమే అత్యంత పారదర్శకంగా మెరిట్ ఆధారంగా డీఎస్సీ నియామకాలు పూర్తి చేశామని స్పష్టం చేస్తోంది.
అలాంటప్పుడు మీ ప్రభుత్వంలో ఏ తప్పూ జరగకపోతే.. చర్చకు సిద్ధమా నారా చంద్రబాబు నాయుడు , నారా లోకేష్ ?అంటూ ప్రశ్నించారు. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందొ వేచి చూడాలి.