Friday, 11 September 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

మోదీ చేసిన "దిమాగీ నక్సల్స్" వ్యాఖ్యలకు...నటుడు ప్రకాశ్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్...! 

17 Aug 2026
10:04 AM
19

Astranews :

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేసిన ‘దిమాగీ నక్సల్స్’ (మేధో నక్సలైట్లు) వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించిన ఆయన, ప్రధాని వ్యాఖ్యలపై ఘాటుగా ... వ్యంగ్యంగా ...అస్త్రాలు సంధించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకుని ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.... గతంలో ‘అర్బన్ నక్సల్స్’, పురుగులు, బొద్దింకలు అంటూ సంబోధించిన వారు, ఇప్పుడు ప్రశ్నించే గొంతుకలకు ‘దిమాగీ నక్సల్స్’ అంటూ కొత్త పేరు తగిలించారంటూ ప్రకాశ్ రాజ్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసే విమర్శకులకు కనీసం బుద్ధి ఉందనే విషయాన్ని ‘సుప్రీం లీడర్’ ఒప్పుకున్నందుకు సంతోషమని ఆయన వ్యాఖ్యానించారు.

దేశ ప్రజలను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ ఈ సందర్భంగా ఒక కీలక సందేశాన్ని ఇచ్చారు. భారతీయులంతా అంధభక్తులుగా, మూర్ఖులుగా ఉండిపోకుండా ఆలోచనాపరులుగా, బుద్ధిమంతులుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. అంధభక్తిని వీడండి.. బానిసలుగా ఉండొద్దు...పాలకులకు బానిసలుగా బతకడం మాని, హక్కుల కోసం, న్యాయం కోసం ప్రభుత్వాన్ని నిలదీసే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ప్రశ్నించే హక్కునే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువుగా అభివర్ణించిన ఆయన, పాలకుల తీరును నిరసిస్తూ ప్రజలు తమ గొంతు వినిపించాలని కోరారు. ప్రకాశ్ రాజ్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. ఇదే అంశంపై పలువురు మేధావులు సైతం సందిస్తున్నారు

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!