Saturday, 12 September 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

వైసీపీ ఎమ్మెల్యేలకు షాక్‌..!

12 Aug 2026
01:33 PM
189

* అసెంబ్లీకి రాకపోతే జీతం కట్‌..!
* స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు సంచలన ప్రతిపాదన..
* అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల జీతం కట్‌ చేయాలని ..
* కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు
* ఇరకాటంలో  10 మంది ఎమ్మెల్యేలు...
* ఖచ్చితమైన హాజరు కోసం అసెంబ్లీలో ..
* AI ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాల ఏర్పాటు ...
* వైఎస్ జగన్ మాత్రం జీతం తీసుకోవడం లేదని... 
* ఇది వరకే ప్రకటించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు...
* వైఎస్ జగన్ వ్యూహం ఎంటీ.. ? సర్వత్రా చర్చ...

అమరావతి  : 
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా నిరసన తెలుపుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరీపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్రంగా స్పందించారు. సభకు రాకుండా జీతాలు తీసుకోవడంపై రాజ్యాంగపరమైన నిబంధనలు, చర్యలపై పరిశీలిస్తున్నామని హెచ్చరించారు. వైఎస్ జగన్ తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వనందున అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే సభ అనుమతి లేకుండా వరుసగా దీర్ఘకాలికంగా గైర్హాజరైతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4) ప్రకారం అనర్హత వేటు పడే అవకాశం ఉంటుందని నిపుణులు, నేతలు పేర్కొంటున్నారు. విధులకు హాజరు కాకుండా ప్రజాప్రతినిధులు జీతాలు తీసుకోవడంపై సభలో,  బహిరంగంగా తీవ్ర చర్చ జరుగుతోంది. 

రాష్ట్ర శాసన సభ 7వ సమావేశాలు ఈ నెల 17 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఎమ్మెల్యేలకు, ప్రభుత్వ శాఖలకు నోటిఫికేషన్ ప్రతులను కూడా పంపించారు. అమరావతి లోని అసెంబ్లీ హాలులో జరిగే సమావేశాలకు సంబందించి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షుత జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పని దినాలు, ఎజెండా ఖరారు చేస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సహచర మంత్రులకు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈసారైనా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్న చర్చ జరుగుతుంది.  

ఖచ్చితమైన హాజరు కోసం AI ఆధారిత కెమెరాలు .. : 
సభ్యుల కచ్చితమైన హాజరు కోసం అసెంబ్లీలో AI ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్లు స్పీకర్ తెలిపారు. ఎమ్మెల్యేలు వచ్చి కేవలం సంతకాలు పెట్టి వెళ్లకుండా పకడ్బందీగా హాజరు నమోదు చేసేందుకు అసెంబ్లీలో అత్యాధునిక ఏఐ (AI) ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను సీట్లకు ఏర్పాటు చేశారు. సభ్యులు తమ సీట్లలో కూర్చుని సభలో పాల్గొన్నప్పుడు మాత్రమే ఖచ్చితమైన హాజరు నమోదయ్యేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. 

ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు అసెంబ్లీకి వచ్చేది లేదన్న వైఎస్ జగన్  .. :    
2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, YSRCP ప్రతిపక్షంగా మారింది. కానీ పది శాతం సీట్లు రాకపోవడంతో ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ న్యాయపోరాటం చేస్తున్నారు. కానీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు YSRCPకు  ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. దీంతో వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు బాయ్‌కాట్ చేస్తోంది. ఈ క్రమంలో 11 మంది YSRCP ఎమ్మెల్యేలు  జగన్ సహా హాజరు కావడం లేదు. ప్రతిపక్ష పాత్ర ఇఛ్చే వరకు అసెంబ్లీ సమావేశాలకు వచ్చేది లేదని కూడా తెగేసి చెప్పారు.  జగన్ తన జీతాన్ని తీసుకోవడం లేదని, మిగిలిన 10 మంది తీసుకుంటున్నారని స్పీకర్  మీడియాకు ఇది వరకే చెప్పారు. 

10 మంది ఎమ్మెల్యేల అసెంబ్లీకి వస్తారా .. ?
ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు అసెంబ్లీకి రానని వైఎస్ జగన్ చెప్పడంతో మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు సమావేశాలకు వెళ్లడం లేదు. ఇప్పుడు జగన్ అసెంబ్లీకి రాకపోయినా... వైసీపీ ఎమ్మెల్యేలోనైనా అసెంబ్లీకి తీసుకురావలనే వ్యూహంలో భాగంగానే స్పీకర్ ఈ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారన్న అనుమానాలు లేకపోలేదు. రాష్ట్రంలో ఇటీవల తిరుమల లడ్డూ, డిఎస్సీలో అక్రమాలు, శాంతిభద్రతలు, రైతులకు గిట్టుబాటు ధర, హామీల అమలు వంట అంశాలపై పెద్దగానే వైసీపీ రీ సౌండ్ చేస్తుంది. ఈ కారణంగా అధికార పక్షానికి ఇక్కట్లు తప్పడం లేదు. దీంతో ఇలాంటి నిబంధనల పేరుతో సమావేశాలకు పిలిచి వైసీపీని ఇరుకున పెట్టాలనే పన్నాగమా అన్నది కూడా చర్చ నడుస్తొంది. మరి వైసీపీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తారా లేదా అన్నది వేచి చూడాలి.  

తాడేపల్లెలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ భేటి... : 
అసెంబ్లీ సమావేశాలు...స్పీకర్ అయ్యన్న పాత్రుడు చర్యల నేపధ్యంలో ...నేడు తాడేపల్లెలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటి కావడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలె ఎలాంటి అభిప్రాయం వెలిబుచ్చుతారు... వైఎస్ జగన్ వీరికి ఎలాంటి దిశానిర్ధేశనం చేస్తారు అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశం అనంతరం అసెంబ్లీసమావేశాల్లో వైసీపీ వ్యూహం ఎంటన్నది కూడా బహిర్గతమయ్యే అవకాశం లేకపోలేదు. మొత్తం మీద వైఎస్ జగన్ భేటి ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!