* వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి
* చంద్రబాబు పాలన అంతా వాతలు, కోతలు, ఎగవేతలే ..
* నిన్నటి దినం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ పై రాచమల్లు హాట్ కామెంట్స్
కడప :
సంపద సృష్టించటమంటే సంతానాన్ని కనటమని చెప్పిన ఘనుడు సిఎం చంద్రబాబునాయుడని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి విమర్శించారు. బుధవారం ప్రొద్దుటూరులో అయన మీడియాతో మాట్లాడుతూ.... మంగళవారం సిఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ పై హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు పాలన అంతా వాతలు, కోతలు, ఎగవేతలే .. అబద్ధాలు,అవినీతి,మోసం, వెన్ను పోటు ఇదే చంద్రబాబు అజెండా.. 26 నెలల పరిపాలన కాలంలో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చేసిన మంచి ఏంటి ? .. సంక్షేమ పథకాలకు లక్ష కోట్లు ఇచ్చినంటున్న చంద్రబాబు, ప్రజలేమో మాకు ఎలాంటి సంక్షేమం రాలేదు, మమ్మల్ని మోసం చేసాడు అంటున్నారు.
కూటమి ప్రభుత్వం హాయంలో ప్రజలకు వాతలు పెట్టి,కోతలు పెట్టి ఎగవేతల పెట్టి ప్రజలను వంచించింది. 3 లక్షల 65 వేల కోట్ల అప్పు చెయ్యటంలో చంద్రబాబు టాప్. ఆర్భాటపు మాటలు చెప్పటంలో చంద్రబాబు టాప్. తప్పుడు ఆరోపణలు చేసి పబ్బం గడపటంలో చంద్రబాబు టాప్. అప్పుచేయడంలో .. అవినీతి చెయ్యటంలో ..సాటి లేని మేటి ఘనాపాటి.
ఎన్నికల ముందు చెప్పింది కొండంత.. ఇచ్చింది గోరంత.. ఇప్పుడు మాత్రం హిమాలయ పర్వతాలకు మించి ఇచ్చాను అని నీతిమాలిన మాటలు చెప్తున్నాడు. సంపద సృష్టించటం అంటే సంతానాన్ని కనటం అని చెప్పిన ఘనుడు చంద్రబాబు. ప్రజలకు ఎన్నికల్లో చెప్పిన హామీలను చెప్పినట్లు నువ్వు అమలు చేశావా లేదా చంద్రబాబు ? కరోనా లాంటి విపత్కర సంక్షోభంలో ప్రజలకు సంక్షేమాన్ని అద్భుతంగా లక్ష 31 వేల కోట్లు ఇచ్చిన గొప్ప సంక్షేమకర్త మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. DBT ద్వారా నాన్ DBT ద్వారా ఎంత ఇచ్చారో వివరించడం లేదు.? 69 వేల కోట్లు సామాజిక పెన్షన్ రూపంలో ఇవ్వడం గొప్పనా..? మీ గొప్పలు గొప్పనా.. ?
ఎన్నికల హామీల కాలాన్ని ప్రజలు గమనించాలి. హామీ ఇచ్చిన పథకం మొదటి సంవత్సరం నుండి అమలు చేశారా లేదా ? అమలు చేసిన విధానాన్ని హామీ ఇచ్చిన విధానాన్ని గమనించాలి. 2 సంవత్సరాల కాలంలో జగన్ 8 కోట్ల 89 లక్షల మంది లబ్ధిదారులకు ఇచ్చారు. 1 కోటి 41 లక్ష కుటుంబాలకు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హాయంలో చెప్పిన ప్రతి ఒక్కటి అమలు చేసి చూపితే... ఈ కూటమి ప్రభుత్వం మాత్రం కోతలు, వాతలతో జనాలను వంచించింది. ఇప్పటికైనా