Saturday, 12 September 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

కూటమి పాలనలో ..రాయలసీమ రైతాంగాన్ని పట్టించుకునే వారే లేరు.. !

04 Aug 2026
03:20 PM
226

* శ్రీశైలం పూర్తిగా నిండిన తరువాతే నీరు కిందకు వదలాలి...
* తాగు, సాగు నీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యతనివ్వాలి...
* శ్రీశైలం నిండకముందే..సాగర్, విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీరు కిందకు వదిలితే... సీమకు ద్రోహం చేసినట్లే....!
* తక్షణం పోతిరెడ్డిపాడు ద్వారా సీమకు నీటిని విడుదల చెయ్యాలి...
* లేకపోతే ప్రత్యేక్ష ఉద్యమాలకు వైసీపీ సిద్దంగా ఉంది... 
* మైదుకూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఘాటు హెచ్చరిక ...

కడప  : 
ఎపిలో ప్రస్తుత కూటమి పాలనలో  రాయలసీమ రైతాంగాన్ని పట్టించుకునే వారే లేరని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి విమర్శించారు. కడప నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అయన మాట్లాడుతూ  ఈ యేడాది సరైన వర్షాలు లేకపోవడం వల్ల శ్రీశైలంలో ఉన్న నీటిని సీమ రైతాంగం అడగలేదన్నారు. కానీ ఇటీవల ఎగువన వర్షాలు కురిసి కృష్ణా, తుంగభద్రలో నీరు వస్తుందని,  ఆ నీరు శ్రీశైలానికి నీరు వచ్చి చేరుతుందన్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో ఎగువన ఉన్న కర్ణాటకలో ప్రాజెక్టులు నిండనిదే నీరు విడుదల చెయ్యడం లేదని, కానీ తెలంగాణాలో మాత్రం నీరు అప్పుడే ఎత్తిపోతల పథకాల ద్వారా వాడుకుంటున్నారని, దీనిపై మన ఎపి పాలకులు నోరుమెదపడం లేదని విమర్శించారు. ఇప్పుడే  శ్రీశైలానికి నీరు వచ్చి చేరుతున్న తరుణంలో ...నాగార్జునసాగర్, విద్యుత్ అవసరాల పేరిట నీరు కిందకు వదిలితే సీమకు తీవ్ర ద్రోహం చేసిన వారే అవుతారని హెచ్చరించారు. శ్రీశైలానికి పూర్తి స్థాయిలో నీరు వచ్చాకే...ప్రాజెక్ట్ పూర్తిగా నిండిన తరువాతే కిందకు నీరు వదలాలి డిమాండ్ చేశారు. తాగునీరు, సాగునీటి అవసరాలు తరువాతే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని కోరారు. 

రాయలసీమ ఎత్తిపోతల పథకం మాజీ సిఎం వైఎస్ జగన్ గత వైసీపీ ప్రభుత్వ హాయంలో  ప్రారంభిస్తే... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా చంద్రబాబు నాయుడు నిలిపివేశారని, తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డి చెబితే... సీమ ఎత్తిపోతల పథకం పనులు అపేశారని అసెంబ్లీలోనే ప్రకటించారు...రేవంత్ రెడ్డి ..చంద్రబాబులు గురు శిశ్యులైనందుకే సీమకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కానీ ఇప్పుడు రేవంత్ చంద్రబాబును మించిన గురువులా మారాడు... ఇటీవల ఫీజు రీఎంబర్స్ మెంట్ ఎపీలో అమలు చెయ్యడం లేదు కాబట్టి... తెలంగాణాలు అమలు చెయ్యలేనని చెప్పారు...దీన్ని బట్టే తెలుస్తుందని.. రేవంత్ రెడ్డి చంద్రబాబును మించిన గురువయ్యారని చెప్పారు. 

ఎదిఎమైనా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా పూర్తి స్థాయిలో నీటిని తక్షణం విడుదల చెయ్యాలి... లేకపోతే చంద్రబాబు సీమకు తీరని అన్యాయం చేసినట్లే...రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు కూడా వెంటనే ప్రారంభించాలి... ఇది పూర్తి అయితే ..శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీటి తీసుకునే అవకాశం ఉండేది... ఈ పనులు అపేసి సీమ ద్రోహిగా చంద్రబాబు నిలిచారు..చంద్రబాబుకు రాయలసీమ పట్ల చిత్తశుద్ది లేదు...చంద్రబాబుకు ఎప్పుడు అమరావతి, విజయవాడ మాత్రమే కావాలి... కృష్ణా డెల్టాకు పట్టిసీమ నీరు ఇచ్చారు...కానీ రాయలసీమపై చంద్రబాబుకు ఎందుకు ఈ వివక్ష.. సీమ సిఎం అయ్యి ఉండి ఎందుకు ఈ ద్రోహం చేస్తున్నారు...

తాగు, సాగునీటి విషయంలో వైసీపీ వెనకడుగు వెసే ప్రసక్తే లేదు...తప్పక రాయలసీమ ప్రాయోజనాల కోసం తాగు, సాగునీటిని సాధించి తీరుతాం... వెంటనే నీరు వదలకపోతే ప్రత్యక్షంగా పోరాటాలకు సిద్దమవుతున్నామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ....ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరిచి సీమ ప్రయోజనాలు కాపాడాలి. లేకపోతే ఉద్యమాలతో ప్రభుత్వ కళ్లు తెరిపిస్తాం. 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!