Friday, 11 September 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / జాతీయ వార్తలు

దేశంలో మరో పేపర్ లీక్ నిరసనలు..!

03 Aug 2026
02:44 PM
115

* స్టూడెంట్స్‌కు  మద్దతు తెలిపిన కాక్రోచ్ జనతా పార్టీ ..
* ఝార్ఖండ్ రాజధాని రాంచీలో మిన్నంటిన విద్యార్థుల నిరసనలు ...

Astranews desk : 
దేశ రాజధాని ఢిల్లీలో జెన్ జీ నిరసనల వేడి తగ్గకముందే...మరో పేపర్ లీక్ ఘటన చోటు చేసుకుంది. ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ పరీక్షలో పేపర్ లీకైనట్టు ఆరోపణలు రావడంతో అక్కడి విద్యార్థులు గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కాక్రోచ్ జనతా పార్టీ తాజాగా ఝార్ఖండ్ విద్యార్థులకు మద్దతు ప్రకటించడంతో.. రాజధాని రాంచీలో ప్రస్తుతం విద్యార్థుల నిరసనలు మిన్నంటాయి. పేపర్ లీక్‌ ఉదంతంపై దర్యాప్తు జరపాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

రాంచీలో గత కొన్ని రోజులుగా జైపాల్ సింగ్ ముండా స్టేడియం వద్ద విద్యార్థులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహాతో ఆదివారం ఆమరణ దీక్ష సైతం  ప్రారంభించారు. వారాల తరబడి నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని మహాతో ఆరోపించారు. కమిషన్, ప్రభుత్వం తీరుతో విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారని, ముఖ్యమంత్రి తమ డిమాండ్స్‌కు ఆమోదం తెలిపే వరకూ తన దీక్ష కొనసాగుతుందని చెప్పారు. ఇటీవల జరిగిన ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఈ మధ్యకాలంలో టీడీపీఎల్ ద్వారా జరిగిన పరీక్షలను సమీక్షించాలని డిమాండ్ చేశారు.

ఏ ఎగ్జామ్‌లోనైనా పేపర్ లీక్ జరుగుతూనే ఉందని ఒక విద్యార్థులు మండిపడ్డారు. ఈ విషయాలపై సీఎం హేమంత్ సోరెన్ తమతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. అవకతవకలపై దర్యాప్తు జరపాలని కోరారు. ఈ నిరసనలపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. తాను ఝార్ఖండ్ విద్యార్థులతో మాట్లాడినట్టు చెప్పారు. విద్యార్థులకు సీజేపీ మద్దతు ప్రకటిస్తోందని అన్నారు. మరి ఈ నిరసనల సెగ ఎవరికి తగలనుందొనన్నది ఇప్పుడు అసక్తిని రేపుతొంది. 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!