Saturday, 12 September 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / జాతీయ వార్తలు

ఉప ఎన్నికల్లో బిజేపికి షాక్ .... ?

03 Aug 2026
01:35 PM
163

* బీహార్ లో బంకీపూర్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్  ఆధిక్యం..!
* ప్రస్తుత బిజేపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామాతో ఉప ఎన్నిక... 
* బీజేపీ అభ్యర్థి నీరజ్‌కుమార్‌పై ఆధిక్యంలో ప్రశాంత్‌ కిషోర్...
* దాటియా స్థానంలో కాంగ్రెస్ అధిక్యం...
* మంజల్ పూర్ లో బిజేపి అధిక్యం ...
* ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పరిణామాల అనంతరం జరుగుతున్న ఎన్నిక కావడంతో అందరిలో నెలకొన్న అసక్తి...

బీహార్   : 
దేశవ్యాప్తంగా పేపర్ లీకేజీలపై జెన్ జీ ఉద్యమం..కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత జరిగిన తొలి ఉపఎన్నికల్లో బిజేపికి అప్పుడే ప్రతికూల ఫలితాలు వెలువడే దిశగా ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ వైపు ఈ ఉప ఎన్నికల ఫలితాలు సర్వతా ఆసక్తిగా మారగా... మరో వైపు దేశ ప్రజల మూడ్ ఏ విధంగా ఉందో ఈ ఫలితాలు స్పష్టం చేయనున్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్ పైనే అందరి దృష్టీ నెలకొంది. 

దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈ రోజు ప్రారంభమైంది. బీహార్ లోని బండిపూర్, గుజరాత్ లోని మంజర్ పూర్, మధ్యప్రదేశ్ లోని దాటియా అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నిక పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ సోమవారం ఉదయ 8 గంటల నుంచి ప్రారంభం కాగా... ఈ ఫలితాల్లో తమకు కంచుకోటగా ఉన్న బంకిపూర్ స్థానంలో బీజేపీకి ఊహించని షాక్  తగిలింది. ఈసీ వెబ్ సైట్ ఫలితాల ప్రకారం ఈ స్థానంలో ఐదో రౌండ్ ఫలితాలు ముగిసే సమయానికి ప్రశాంత్ కిశోర్ 8971 ఓట్లు సాధించి 2319 అధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ కు 6652 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. అర్జేడీ అభ్యర్థి రేఖా కుమారికి 1534 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ తొలిసారి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలవగా...ఊహించని విధంగా అయనకు భారీగా ఓట్లు రావడం అందరి ఆశ్చార్యానికి గురిచేస్తుంది. ఇది వరకు పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల కోసం వ్యూహాలు రచించి గెలిపించిన చరిత్ర ఉన్న ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) ఆ తర్వాత బీహార్ లో సొంతంగా జన్ సురాజ్ పార్టీ స్థాపించినా పోటీ చేయలేదు. తన పార్టీ తరఫున అభ్యర్ధుల్ని నిలబెట్టినా అంతా ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఖాళీ చేసిన బంకీపూర్ సీటుకు ఉప ఎన్నిక రావడంతో ఉన్నట్లుండి బరిలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, ఆర్జేడీకి చెందిన రేఖా గుప్తాపై 50 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించిన నబిన్.. వరుసగా ఐదోసారి ఈ సీటును నిలబెట్టుకున్నారు. ఈసారి కూడా ఆర్జేడీ అభ్యర్థిగా రేఖాగుప్తానే బరిలో నిలిచినా, నబీన్ స్ధానంలో నీరజ్ సిన్హాను బరిలోకి దింపినా, ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్ పైనే అందరి దృష్టీ నెలకొంది. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 31 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. 

మిగిలిన  రెండు స్థానాల్లో.. :
ఇక మధ్యప్రదేశ్ లోని దాటియా స్థానంలో 3 రౌండ్ల కౌంటింగ్ అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి ఘన్యామ్ సింగ్ 12432 ఓట్లు, బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీ 12399 ఓట్లు సాధించారు. ఇక్క ఇద్దరి మధ్య ఆధిక్యం కేవలం 33 ఓట్లు మాత్రమే తేడా ఉండటం ఫలితం మరింత ఉత్కంద రేపుతోంది. ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కారే అధికారంలో ఉన్నా... కాంగ్రెస్ అభ్యర్ధికి అదిక్యం రావడం చర్చనీయాంశంగా మారింది. అలాగే గుజరాత్ లోని మంబల్ పూర్ స్థానంలో 8 రౌండ్ల ఫలితాలు ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి నరేంద్రభాయ్ పటేల్ 23632 ఓట్లు సాధించగా కాంగ్రెస్ అభ్యర్థి బిబాబాయ్ రబార్ 10123 ఓట్లు సాధించారు. ఇక్కడ మాత్రమే బిజేపి అధిక్యంలో కొనసాగుతుంది.  మరి కౌంటింగ్ చివరి రౌండ్ వరకు గెలుపోటములు ఎలా ఉంటాయో... జెన్ జీ ఉద్యమం ఎఫెక్ట్ ఎంత వరకు ఉంటుందో మరికొన్ని గంటల్లోనే వెల్లడికానుంది. 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!