Saturday, 12 September 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

ఉరవకొండలో తీవ్ర ఉద్రిక్తత ... !

03 Aug 2026
12:43 PM
281

* మంత్రి పయ్యావుల కేశవ్ భూ అక్రమాలపై ఉద్యమం ఉధృతం చేస్తామని వైయస్సార్‌సీపీ హెచ్చరిక..
* ధర్నాకు ముందే మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అరెస్ట్ ..
* మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌, బీసీ విభాగం నేత రమేష్‌ గౌడ్ అరెస్ట్ ...

ఉరవకొండ   : 
అనంతపురం జిల్లా ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపి గోరంట్ల మాధవ్ ల అరెస్టులతో సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో భూ అక్రమాలు, అధికారుల వైఖరికి నిరసనగా వైయస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. ధర్నాకు నేతృత్వం వహించిన ఉరవకొండ వైయస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని పార్టీ కార్యాలయం నుంచి పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు, పార్టీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ధర్నాకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను సైతం పోలీసులు అరెస్ట్ చేసి బలవంతంగా తరలించారు. అలాగే పార్టీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌ గౌడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పెనుకొండలో మాజీ మంత్రి శంకర్‌ నారాయణను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

హైకోర్టు ఆదేశాల కంటే మంత్రి ఆదేశాలే ముఖ్యమా ?  మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ...
విడపనల్‌ మండలం వేల్పుమడుగులో వైసీపీ నాయకుడు గోవింద్‌కు చెందిన 21 ఎకరాల ప్రైవేటు భూమిపై కావాలనే వివాదం సృష్టిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. ఆ భూమి ప్రైవేటు ఆస్తేనని రెవెన్యూ అధికారులు గతంలో స్పష్టం చేశారని, హైకోర్టు కూడా అనుకూల ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. అయినప్పటికీ మంత్రి పయ్యావుల కేశవ్‌ ఒత్తిళ్లతో పోలీసులు, రెవెన్యూ అధికారులు న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయకుండా టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. ప్రైవేటు ఆస్తులపై అధికార పార్టీ నేతలు పెత్తనం చెలాయించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు అధికార పార్టీ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి పయ్యావుల కేశవ్‌ ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న భూ అక్రమాలపై వైయస్సార్‌సీపీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. 
అరెస్టులతో ఉద్యమాన్ని అణచలేరు.. : 
ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం సరైంది కాదని వైయస్సార్‌సీపీ నేతలు ఈ సందర్బంగా ఖండించారు. అరెస్టులు, హౌస్‌ అరెస్టులు, పోలీసు నిర్బంధాలతో ఉద్యమాలను అణచివేయలేరని, ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. మీ తప్పుల్ని నిరసనల రూపంలో ప్రజలకి తెలియజేస్తున్నారని భయపడే ..మంత్రి పయ్యావుల ఆదేశాలతో ఇలా ముందస్తూ అరెస్టులు చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. 

 

 

 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!