Saturday, 12 September 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు హయాంలో నాయీ బ్రాహ్మణులకు ఎన్నో అవమానాలు..!

01 Aug 2026
08:56 PM
24

* వైసీపీ హాయంలో వైఎస్ జగన్ సమాజంలో తగిన గౌరవాన్ని తెచ్చిపెట్టారు... 
* కరోనా కష్టకాలంలో షాపులు మూతపడితే...
* ఒక్క బటన్ నొక్కి 50 వేల షాపులకు గాను రూ.50 కోట్లు నేరుగా ఆర్థిక సాయం అందించారు... 
*మాజీ టీటీడీ బోర్డు మెంబ‌ర్, వైసీపీ  ఎస్ఈసీ సభ్యుడు యానాద‌య్య‌..

తాడేపల్లి   : 
గతంలో చంద్రబాబు హయాంలో నాయీ బ్రాహ్మణులు ఎంతో అవమానాలకు గురయ్యారు. జగన్ గారు అధికారంలోకి రాగానే మనకు పూర్వ వైభవాన్ని, సమాజంలో తగిన గౌరవాన్ని తెచ్చిపెట్టారు. గతంలో నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, యాదవ వంటి బీసీ కులాలకు చెందిన వారు రాజకీయంగా ఎక్కడా కనిపించని పరిస్థితి ఉండేది, కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాతే ప్రతి సామాజిక వర్గానికి రాజకీయ ప్రాధాన్యత లభించింది. కరోనా కష్టకాలంలో షాపులు మూతపడి మనవాళ్లు ఇబ్బందులు పడుతున్నప్పుడు, జగన్ గారు ఒక్క బటన్ నొక్కి 50 వేల షాపులకు గాను రూ. 50 కోట్లు నేరుగా ఆర్థిక సాయం అందించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి షాపున‌కు లబ్ధి చేకూర్చడమే కాకుండా, నాయీ బ్రాహ్మణుల విజ్ఞప్తి మేరకు ప్రతి షాపునకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను కూడా మంజూరు చేశారు. దేవుడు పుట్టినప్పటి నుండి దేవాలయాల్లో కైంకర్యాలు, క్షౌరవృత్తి చేస్తూ ఆలయాలకు కోట్ల రూపాయల ఆదాయం తెస్తున్న మనల్ని గతంలో 'గుడికి మీకు సంబంధం లేదు' అని అవమానించారు. అలాంటిది జగన్ గారు చరిత్రలోనే తొలిసారిగా 70 ఏళ్లలో లేని విధంగా మనల్ని దేవాలయాల ఉద్యోగులుగా గుర్తించి, రూ20 వేల జీతాన్ని ఖరారు చేసి ఉద్యోగ భద్రత కల్పించారు. మంత్రులు వద్దన్నా వినకుండా, ప్రత్యేకంగా గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తెచ్చి మరి, రూ. 5 లక్షల ఆదాయం దాటిన ప్రతి దేవాలయ పాలక మండలిలో ఒక నాయీ బ్రాహ్మణుడికి సీటు ఇచ్చి రిజర్వేషన్ కల్పించారు. రాష్ట్రంలోని 1150 దేవాలయ పాలక మండళ్లలో 1150 మంది నాయీ బ్రాహ్మణులను శాశ్వత నాయకులుగా మార్చిన ఘనత జగనన్నది; మన పిల్లల కులం పేరుతో అవమానాలు పడకుండా చట్టం తెచ్చారు. 

కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత విద్యుత్ సగం జిల్లాల్లో అమలు కావడం లేదు, మన జీవోలను పక్కన పెట్టేసి మోసం చేస్తున్నారు; చంద్రబాబు పాలనలో మనకి దక్కింది ఏమీ లేదు. మనకు ఆత్మగౌరవం, జీవనోపాధి కల్పించిన వైయ‌స్ఆర్‌సీపీ కోసం ప్రతి నాయీ బ్రాహ్మణుడు ఒక మీడియా ఛానెల్‌లా మారి, జగనన్న చేసిన మేళ్లను ప్రజల్లోకి తీసుకెళ్లి మళ్లీ ఆయనను ముఖ్యమంత్రిని చేసుకోవడానికి కంకణబద్ధులై పనిచేయాలని పిలుపునిచ్చారు.

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!