* వైసీపీ ప్రభుత్వంలో బీసీసీలకే ఆగ్రతాంబూలం ..
* ఒక యాదవ్ ను మొదటిసారిగాఎమ్మెల్సీని చేసిన మహోన్నత వ్యక్తి జగన్ ...
* మన బీసీ కులాలు, వర్గాలు రాజ్యాధికారంలోకి రావాలంటే మళ్లీ జగనే రావాలి...
* వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ...
తాడేపల్లి :
ఆంధ్రప్రదేశ్ లో సుమారు 130 కి పైగా ఉన్న బీసీ కులాలను దగ్గరకు తీసి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ప్రతి కార్పొరేషన్ కూ ఒక ఛైర్మన్ ను, 10 నుండి 12 మంది డైరెక్టర్లను నియమించిన గొప్ప నాయకుడు జగన్ గారు. కూటమి ప్రభుత్వం కార్పొరేషన్లు నామమాత్రంగా పెట్టి నిధులు ఇవ్వకపోగా, జగన్ గారు మాత్రం ఒకే సంతకంతో 56 కార్పొరేషన్ ఛైర్మన్లకు, ఎందరో కార్యకర్తలకు పదవులు ఇచ్చి అగ్రతాంబూలం అందించారు. గతంలో కోట్లు ఖర్చు పెడితే తప్ప దక్కని టీటీడీ బోర్డు మెంబర్ పదవిని, సాధారణ కార్యకర్త అయిన యానాదయ్య గారికి ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్న ఘనత మన జగన్ గారిదే. గతంలో 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునేవారు బీసీల వెన్నుముక విరిస్తే, 2019-24 మధ్య జగన్ గారు బీసీలను రాజ్యాధికారంలో కూర్చోబెట్టి వెన్నుదన్నుగా నిలిచారు. సామాన్య కడప జిల్లా యాదవ కులానికి చెందిన నాలాంటి ఒక చిన్న కార్యకర్తను కూడా గుర్తించి, మొదటిసారిగా శాసనమండలికి (ఎమ్మెల్సీగా) పంపిన మహోన్నత వ్యక్తి జగన్ గారు. కులం, మతం, పార్టీలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందించిన జగన్ గారి పాలనలో, పెన్షన్ల సంఖ్యను 30 లక్షల నుండి ఏకంగా 66 లక్షలకు పెంచడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని దొంగ హామీలిచ్చి గెలిచిన కూటమి ప్రభుత్వం, ఈరోజు ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా, పైగా ప్రతి దంట్లోనూ స్కామ్‌లకు పాల్పడుతోంది. నాడు జగన్ గారు ఒక్క సంతకంతో 1,32,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చి చరిత్ర సృష్టిస్తే, నేడు కూటమి ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతూ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తోంది. నాడు 'నాడు-నేడు' ద్వారా స్కూళ్లను కార్పొరేట్ నిమిత్తం తీర్చిదిద్ది, అమ్మఒడితో ప్రోత్సహించిన జగన్ గారి పథకాల పేర్లు మార్చి కూటమి ప్రభుత్వం ఇవాళ ప్రజలను వంచిస్తోంది. మన బీసీ కులాలు, వర్గాలు రాజ్యాధికారంలోకి వచ్చి అభివృద్ధి చెందాలంటే మళ్లీ జగన్ గారు ముఖ్యమంత్రి కావాలి. అందుకోసం మనమందరం 2029 లక్ష్యంగా కష్టపడి పనిచేసి వైయస్ఆర్‌సీపీ విజయం కోసం ఐకమత్యంగా పనిచేయాలి.