Friday, 11 September 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

ముద్ర‌గ‌డ సంస్మ‌ర‌ణ స‌భ‌లో దాసరి..చిరు..బొత్స...!

01 Aug 2026
08:21 PM
423

* ముద్రగడ పట్ల బాబు ప్రభుత్వ కక్ష సాధింపును వివరిస్తూ  మాట్లాడిన పాత వీడియో ప్ర‌ద‌ర్శ‌న‌...
* చర్చనీయాంశంగా మారిన పాత వీడియో ప్రదర్శన ...
* గత చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపును మరోమారు గుర్తు చేసిన వీడియో...
* కూటమికి మింగుపడని పరిణామం....

కాకినాడ   :

ఏపీ రాజకీయాల్లో సామాజిక ముద్ర వేసుకున్న కాపు నేత...మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో ... కూటమికి మింగిడుపడిన ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. శనివారం  కిర్లంపూడిలో  జరిగిన ముద్రగడ  సంస్మరణ సభలో గత  కూటమి ప్ర‌భుత్వంలో ( 2014-19 ) కాపు రిజ‌ర్వేష‌న్ కోసం ముద్ర‌గ‌డ దీక్ష‌ చేపడితే...అయన పట్ల సీఎం చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించిన తీరును ఎండగడుతూ దివంగత కాపు నేత మాజీ కేంద్ర మంత్రి దాస‌రి నారాయ‌ణ‌రావు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, ప్రస్తుత వైసీపీ మండలి పక్షనేత బొత్స సత్యానారాయణ  చేసిన విమ‌ర్శ‌లకు సంబంధించిన పాత వీడియోను పదర్శించడం చర్చనీయాంశంగా మారింది. ముద్రగడ పట్ల చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరును ...మరచిన గతాన్ని మళ్లీ గుర్తు చేసిన చందంగా ఈ వీడియో ప్రదర్శన తలపించింది. 
 
అప్పట్లో దాసరి నారాయణరావు మాట్లాడుతూ ..... ముద్రగడ పద్మనాభం శాంతియుతంగా చేస్తున్న దీక్షను భగ్నం చేయడం, ఆయనను వేధించడం ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు నిదర్శనమని ఆరోపించారు. ముద్రగడ చేస్తున్న దీక్ష ఓ సామాజిక సమస్య అని, అందుకే అయనకు తామాంతా వెంట ఉంటామన్నారు. ఇప్పటికే రంగా గారెని పొగొట్టుకున్నాం. ఇప్పుడు ముద్రగడ గారెని పొగొట్టుకోవడానికి సిద్దంగా లేమని చెప్పారు.  అయన చుట్టూ జామర్లు పెట్టడం, అయనతో ఎవర్ని కలవనివ్వకపోవడం వంటివి చాలా దారుణమన్నారు.  కాపు మంత్రులను, నాయకులను అడ్డంపెట్టి ఉద్యమాన్ని నీరుగార్చాలని, సామాజికవర్గంలో చిచ్చు పెట్టాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. కాపు నేతలంతా ముద్రగడకు మద్దతుగా నిలుస్తారని, ప్రభుత్వ దమననీతిని ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తే, ఆయన ప్రాణాలకు హాని జరిగితే రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ దీక్షపై, ఉద్యమంపై చంద్రబాబు ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తొంద...మాలో మాకే పెట్టి బెరదజల్లే ప్రయత్నం చేస్తుంది... ఒఖ వేళ బురద జల్లితే ...తిరిగి బురదజల్లేందుకు తమ వద్ద బుదర ఉందని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. 

చిరంజీవి మాట్లాడుతూ... ముద్రగడ దీక్ష చేపట్టిన కొన్ని గంటల్లోనే  అయన ఇంటి డోర్లు బద్దలు కొట్టడం, అయనను నిర్బంధించడం, ఇంటి మహిళల పట్ల అసభ్యంగా అమానుషంగా ప్రవర్తించడం హేయమైన చర్చ. మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు మ్యానిఫెస్టోలో ఎమీ చెప్పారో ాటినే అయన ప్రశ్నిస్తున్నారు. అయన కొత్తగా ఏ విషయాలను  ప్రస్తావించడం లేదు. గోదావరి జిల్లాలకు చెందిన చెందిన ముద్రగడ దీక్షలో లేరని, పులివెందులకు చెందిన వారు ఉన్నారని, దీక్షకు సంఘీభావం చెబుతున్న వారిని తీసుకెళ్లి  జైళ్లలో పెట్టడం దారుణం. అయనకు జరగరానీది ఎది జరిగినా తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటే మాత్రం...ప్రభుత్వానికి బాధ్యతని హెచ్చరించారు. 

Article Image

ముద్రగడ గురించి ఎమి తెప్పినా తక్కువే ... : 
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాబం గురించి ఎంత చెప్పినా...ఎమి చెప్పినా తక్కువేనని వైసీపీ మండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అరుదైన రాజకీయ నాయకుడు ముద్రగడ, ఆయనను స్పూర్తిగా తీసుకుని పోరాట పటిమతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ముద్రగడకు ఎంతో గౌరవం ఉందన్నారు.

Article Image

ముద్రగడ సంస్మరణ సభలో తోట త్రిమూర్తులు కీలక వ్యాఖ్యలు ..  : 
ముద్రగడ పేరు జాతి గుండెల్లో నిలిచిపోతుందని, ముద్రగడ ఉద్యమాలు తరాలు గుర్తుంచుకుంటాయని చెప్పారు. ముద్రగడ ఆశయం నెరవేరితేనే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుందని, భవిష్యత్ కార్యాచరణపై జేఏసీ నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాపు కులం భవిష్యత్ కార్యచరణపై చర్చించేందుకు డేట్ ఫిక్స్ చేయాలన్నారు.

ఈ కార్యక్రములో వైఎస్సార్సీపీ నేతలు కురసాల కన్నబాబు, అంబటి రాంబాబు, ఇక్కంపూడి విజయలక్ష్మి, గుడివాడ అమర్నాధ్, కరణం ధర్మశ్రీ , తానేటి వనిత, వేణుగోపాల కృష్ణ, వంగా గీతా, దవులూరి దొరబాబు సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!