* కూటమి క్రెడిట్ చోరీపై వైసీపీ వరుస ట్విట్ లు...
* ప్రాజెక్టుకు పునాది వేసింది జగనే అన్న వైసీపీ...
* ప్రాజెక్టు విజయంలో చంద్రబాబు పాత్ర లేదన్న వైసీపీ
తాడేపల్లి :
ఉత్తరాంధ్ర ప్రాంతానికి గేమ్ ఛేంజర్ ... విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇవాళ ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన వేళ....ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవంపై పెద్ద ఎత్తున క్రెడిట్ వార్ నడుస్తుంది. ఇలాంటి సమయంలో వైసీపీ ఎక్స్ వేదికగా ఓ అసక్తికర ట్వీట్ చేసింది. భోగాపురం ఎయిర్‌పోర్టు సాకారమవ్వడంపై మాజీ సీఎం జగన్ తరఫున ప్రజలకు వైసీపీ ధన్యవాదాలు తెలిపింది. ఈ ప్రాజెక్టుకు పునాది వేసి, కల నుంచి నిజం దిశగా నడిపించిన నాయకుడు ఎవరో రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుసునని, అయితే అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి నాయకులు ఎలాంటి పాత్ర లేకుండానే మొత్తం క్రెడిట్ వారి ఖాతాలో వేసుకునేందుకు తాపత్రయపడుతున్నారని తీవ్రంగా విమర్శించింది.
జగన్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం రూ.1,200 కోట్లు ఖర్చు చేసి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేశామననట్లు పేర్కొంది. నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించడంలో తమ ప్రభుత్వమే ముందడుగు వేసిందని స్పష్టం చేసింది. ప్రాజెక్టుకు అవసరమైన అన్ని రకాల కీలక పర్యావరణ, విమానయాన అనుమతులను జగన్ హయాంలోనే వేగవంతంగా సాధించామని తెలిపింది. ఎయిర్‌పోర్టు అనుసంధానతకు అవసరమైన రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు నాటి జగన్ ప్రభుత్వమే శ్రీకారం చుట్టిందని, అందువల్ల ఈ ప్రాజెక్టు విజయంలో చంద్రబాబు పాత్ర ఏమీ లేదని విమర్శించింది.
ఉత్తరాంధ్ర ప్రజలు మాజీ సీఎం జగన్ కు ధన్యవాదాలు చెప్తున్నారని వైసీపీ పోస్టు ... :
అంతకుముందు భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంలో చంద్రబాబు పాత్ర ఏమీ లేదని స్పష్టం చేసింది. భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో ఉత్తరాంధ్ర ప్రజలు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెబుతున్నారని తెలిపింది. 'భోగాపురం ఎయిర్‌పోర్టుకు పునాది వేసి.. దాన్ని సాధ్యం చేసిన నాయకుడు ఎవరో ప్రజలకు బాగా తెలుసు. అయిన్పటికీ మొత్తం ఘనతను తనదేనని చెప్పుకునేందుకు కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారు' అని వరుస పోస్టులతో చెప్పింది.
సోషియల్ మీడియాలో పోస్టుల హోరు... :
మరో వైపు సోషియల్ మీడియాలోను కూటమిని ఓ ఆటేడుసుకుంటున్నారు నెటిజన్లు. గత కూటమి ప్రభుత్వ హాయంలో చంద్రబాబు వేసిన శిలాఫలకాన్ని చూపుతున్న ఫోటోను... ప్రస్తుతం భోగాపురం ఎయిర్ పోర్టు చూపుతున్న ఫోటోను సోషియల్ మీడియాతో పోస్టు చేస్తూ... శిలాఫలకం Vs ఎయిర్ పోర్ట్ ... చంద్రబాబు నాయుడు Vs వైయస్ జగన్మోహన్ రెడ్డి... అంటూ పోస్టులు పెడుతున్నారు.
