Friday, 11 September 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

జగన్ రోడ్డెక్కితే... అందుకేనా కూటమి భయం ... !

30 Jul 2026
09:42 PM
2,327

* సిక్కోలులో  వైఎస్ జగన్ కు జనజాతార ... 
* రహదారి వెంట జనమే జనం...
* జన జాతరలో .. 3 గంటలు ఆలస్యంగా జైలు దగ్గరకు జగన్...
* సమయం ముగిసిపోవడంతో ములాఖత్ కు అనుమతి నిరాకరణ.
* జైలు బయట అప్పలరాజు కుటుంబ సభ్యులతో మాట్లాడిన జగన్.

విశాఖ :

వైఎస్ జగన్ రోడ్డెక్కితే కూటమి ప్రభుత్వానికి ముచ్చమటలే అంటూ గత కొంత కాలంగా వైసీపీ నేతల చేస్తున్న కామెంట్స్ . అయితే ఇది వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ మాత్రమే కాదు. వైఎస్ జగన్ రోడ్డెక్కితే జనం పరిస్ధితి ఎలా ఉంటుందో చూపే దృశ్యాలు మరోమారు సిక్కోలు పర్యటనతో రుజువయ్యాయి. ఇప్పటికే వైఎస్ జగన్ రోడ్డెక్కితే జనం తండోపతండాలుగా వస్తున్నారని...జనంలో ఎందుకు అంతగా అదరణ వస్తుందు అంటూ ఓ వైపు కూటమి టెన్షన్ పడుతుండగా...ఇప్పుడు సిక్కోలు పర్యటన ఆ టెన్షన్ ను మరింతలా పెంచేలా చేసింది. చాలా రోజుల తరువాత ఉత్తరాంధ్ర పర్యటనకు వైఎస్ జగన్  వస్తే...అంతలా జనం ఎగబడటం చూసిన వారందరు నోరెళ్లబెట్టారంటే అతిశయోక్తి కాదు. 

Article Image

ఇటీవల మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు చేసిన రోడ్డు ప్రమాదం కేసు విషయమై ... శ్రీకాకుళం  జైలులో రిమాండ్ లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ములాఖత్ ద్వారా కలిసి పరామర్శించేందుకు వైఎస్ జగన్ పర్యటన చేపట్టారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి సాగిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన భారీగా జనసందోహం మధ్య  సాగింది. విశాఖ ఎయిర్ పోర్టు వద్దే పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జగన్ కు ఘన స్వాగతం పలకగా...రహదారి వెంట అయనను చూసేందుకు... కలిసేందుకు భారీగా జనం తరలివచ్చారు. పోలీసుల ఆంక్షలు.. నిబంధనలు ఉన్నప్పటికీ, పార్టీ శ్రేణులు, అభిమానులు ... స్థానిక ప్రజలు ఆయనకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. ప్రజలకు చేతులెత్తి అభివాదం చేస్తూ, అభిమానుల అభివాదాలకు ప్రతిస్పందిస్తూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగారు.

Article Image

పోలీసుల ఆంక్షలు  సైతం లెక్క చేయకుండా... : 
వైయస్‌ జగన్‌ శ్రీకాకుళం జిల్లా పర్యటనపై  ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలపై పలు విమర్శలు వ్యక్తం కాగా... పార్టీ నాయకులు, కార్యకర్తలనే కాకుండా సామాన్య ప్రజలు కూడా స్వేచ్ఛగా తిరగకుండా పోలీసులు ఆంక్షలు విధించడం ఏమిటని ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌ కాన్వాయ్‌ను కేవలం 8 వాహనాలకే పరిమితం చేయడం, పలుచోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రించడం రాజకీయ నిర్బంధం కాదా అని నిలదీశారు. కానీ ఇలాంటి పోలీసుల ఆంక్షలను సైతం లెక్క చేయకుండా ..బారికడ్లను తోసుకుంటూ మరి జగన్ వెంట జనం ముందుకు కదిలారు. ఈ జన స్పందనపై ... ఉత్తరాంధ్ర ప్రజల్లో వైఎస్‌ జగన్‌పై ఉన్న ఆదరణకు నిదర్శనంగా నిలిచిందని వైయ‌స్ఆర్‌సీపీ పేర్కొంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి కూటమి ప్రభుత్వం భయపడుతుందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ రోడ్డెక్కితే వస్తున్న జనసంద్రాన్ని చూసి అధికార పార్టీలో వణుకు పుడుతోందని, అందుకే పర్యటనలపై ఆంక్షలు విధిస్తున్నారని విమర్శిస్తున్నారు.

Article Image

 3 గంటలు ఆలస్యంగా జైలు దగ్గరకు జగన్. : 
వైఎస్ జగన్ పర్యటన నేపధ్యంలో రహదారి వెంట భారీగా జనం తరలిరావడంతో అయన పర్యటన గంటల పాటు ఆలస్యంగా సాగింది. ఎంతలా అంటే ... జైలులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కలిసేందుకు ములఖాత్ సమయం దాటి ఆలస్యం అయ్యేలా చేసింది. దీంతో అయన జైలు బయటే సీదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులను పరామర్శించి మీడియా ముందు మాట్లాడారు. 

  

 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!