Tuesday, 28 July 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

ఎపిలో డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి... !

27 Jul 2026
04:22 PM
61

* నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చెయ్యాలి...
* అక్రమాలపై కూటమి ప్రభుత్వ అలసత్వాన్ని నిరసిస్తూ...వైసీపీ సమరం...
* రేపు కడపలో వైసీపీ అధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత ర్యాలీ...
* నిరసనలతో కూటమి ఎలా స్పందించదో తేల్చుకుంటాం ...
* కడప వైసీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి హెచ్చరిక ...

కడప  : 

ఎపిలో మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేశారని....తక్షణం డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాల్సిందేనని ... నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చెయ్యాలని వైసీపీ సమరభేరి మోగిస్తుందని కడప వైసీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి  చెప్పారు. కడపలో జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ డిప్యూటి సిఎం అంజాద్ బాషతో కలిసి నిర్వహించిన సమావేశంలో అయన మాట్లాడుతూ ....  ఈ నెల 28న జిల్లా పార్టీ ఆఫీసు నుంచి గాంధీ సర్కిల్ వరకు విద్యార్థులు, నిరుద్యోగ యువత ర్యాలీ నిరసన కార్యక్రమం నిర్వహించి  తమ నిరసన తెలియజేస్తామన్నారు.  ఎపిలో డీఎస్సీ లో జరిగిన అక్రమాలపై నిరసన చేయవలసిన అవసరం ఉందిని, డీఎస్సీ లో  పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినా... డీఎస్సీ నియామకాలపై ఆంధ్ర ప్రదేశ్ లో విమర్శలు వస్తున్నా...ఈ రాష్ట్ర ప్రభుత్వం  స్పందించడం లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేయడం జరుగుతుంది. ప్రశ్నించే ప్రతి ఒకరిపై కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో బ్రిటిష్ పరిపాలన సాగుతోంది.  మెగా డిఎస్సి విడుదల చేస్తామని చెప్పి వేలాది పోస్టులు ఉన్నా.. కేవలం 16 వేల పోస్టులు భర్తీ చేయడం జరిగింది.. నోటిఫికేషన్ కన్నా ముందు నుంచి లీక్ లు కోసం ఒక పథకం ప్రకారం ప్లాన్ ప్రకారం జరిగింది.  స్పోర్ట్స్ కోటాల్లో విచ్చలవిడిగా అక్రమాలు జరిగాయి..కష్టపడి పరీక్ష రాసినవారికి ఉద్యోగాలు రాలేదు. ప్రశ్నా పత్రాలు అప్లోడ్ చేసిన వ్యక్తి టాపర్ గా నిలవడం జరిగింది..పేకాట ఆడే వారికి స్పోర్ట్స్ కోటాలో కూడా ఉద్యోగాలు ఇవ్వడం వంటి విడ్డురం జరిగింది.. నీట్ వ్యవహారంలో సరైన ఆధారాలు లేకపోయినా కేవలం ఆరోపణలతోనే విద్యా శాఖ మంత్రి రాజీనామా చేశారు.

మరో వైపు కేవలం సోషియల్ మీడియాతో వచ్చిన వార్తలతోనే  నీట్ పరీక్ష పేపర్ లీక్ కు నైతిక బాధ్యత వహించి కేంద్రమంత్రి నాజీనామా చేయడం జరిగింది. కానీ రాష్ర్టంలో మాత్రం అన్ని అధారాలున్నా ఇక్కడ మాత్రం స్పందన కరువైంది. 
కేవలం కొంత మంది అధికారులపై చర్యలు తీసుకోవడం జరిగింది. డీఎస్సీ లో స్పష్టమైన ఆధారాలు ఉన్న కారణమైన అధికారులపై చర్యలు లేవు మంత్రి రాజీనామా చేయలేదు…

తక్షణం సిబిఐ విచారణ జరిపించాలి. లేకిపక్షంలో తమ ఉద్యమాలు, నిరసనలతో ప్రభుత్వం ఎలా స్పందించదో చూస్తాం. మంత్రి లోకేష్ రాజీనామా చేసే వరకు నిరసనలు అపేది లేదు. ఈ నిరసనలతో కూటమి ప్రభుత్వ ఎలా స్పందించో...లోకేష్ ఎలా రాజీనామా చెయ్యడో తేల్చుకుంటాం.  ఈ సందర్బంగా వైసిపి విద్యార్థి, యువత విభాగాల అధ్వర్యంలో నిర్వహించనున్న పోస్టర్లను వారు ఆవిష్కరించారు.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!