Tuesday, 28 July 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / జాతీయ వార్తలు

"బొద్దింకను కీటక నాశిని మందు కొట్టి చంపినట్లు చంపాలి !”

24 Jul 2026
10:30 AM
184

○ డిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై మహిళాRAF అధికారి సంచలన వ్యాఖ్యలు...
○ నిరసనలో మరో  వివాదం..!
○ ఆ అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థుల డిమాండ్ ....

DELHI  :
నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ, అక్రమాలకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ఢిల్లీలో కొనసాగుతున్న అందోళనలో పాల్గొన్న విద్యార్థులపై బందోబస్తుకు వచ్చిన ఓ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ( Raf ) మహిళా అధికారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. “ఇంట్లో బొద్దింకల బెడద ఎక్కువైతే వాటిపై కీటక నాశిని మందు కొట్టి ఎలా నాశనం చేస్తారో....అలా రోడ్లపైకి వచ్చి పోరాడుతున్న ఈ యువకులను కొట్టాలి” అనే రీతిలో ఆమె మాట్లాడిన మాటలు విపరీతంగా వ్యాప్తి చెందాయి. దీంతో ఇప్పుడు నిరసనల్లో పాల్గొన్న యువత, విద్యార్థులతో పాటు ప్రజల్లోను తీవ్ర ఆగ్రహజ్వాలలు రేపుతున్నాయి.

ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి.
న్యాయమైన డిమాండ్లను ముందుంచి రోడ్లపైకి వచ్చి పోరాడుతున్న భవిష్యత్తు కిరణాలైన విద్యార్థుల గళాన్ని నొక్కేయడానికి వివిధ మార్గాల్లో ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF )చెందిన ఒక మహిళా అధికారి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర వివాదాన్ని, దిగ్భ్రాంతిని రేకెత్తించాయి. ఆందోళనను అదుపు చేయడానికి ఏర్పాటు చేసిన భద్రతా విధుల్లో ఉన్నప్పుడు, రంగంలో నిలిచిన ఆ మహిళా అధికారి నిరసన తెలుపుతున్న యువకులను, విద్యార్థులను అవమానించేలా మాట్లాడారు.

శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక ప్రభుత్వ అధికారి, ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడుతున్న దేశ యువతను బొద్దింకలతో పోల్చి మాట్లాడటం అత్యంత క్రూరమైన మనస్తత్వాన్ని చూపిస్తోందని సామాజిక వేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. అంతేకాకుండా, ఆందోళన స్థలంలో భద్రతా విధుల్లో ఉన్న మహిళా పోలీసులు, నిరసనలో పాల్గొన్న విద్యార్థినులపై జరిపిన దాడులు, అతిక్రమణలకు సంబంధించిన దృశ్యాలు కూడా వెలుగులోకి రావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. మహిళలు, విద్యార్థినులపై జరిగిన ఇటువంటి దారుణ దాడులను సమర్థించేలా ఆ మహిళా అధికారి మాట్లాడటం, పోలీసు శాఖ నిష్పాక్షికతపైనే పెద్ద ప్రశ్నార్థకాన్ని లేవనెత్తింది. అధికారం చేతిలో ఉందనే కారణంతో ఆందోళనకారులను అమానుషంగా విమర్శించిన ఆ అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఆమె బహిరంగ క్షమాపణ చెప్పాలని దేశవ్యాప్తంగా నిరసన గళాలు హోరెత్తుతున్నాయి.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!