* గన్నవరం నుండి ఢిల్లీ వెళ్లే ఓ ప్రయాణికుడు బ్యాగ్ లో బుల్లెట్ గుర్తింపు...
* ఎయిర్ ఇండియా విమానంలో వెళ్లే సమయంలో బుల్లెట్ గుర్తించిన భద్రతా సిబ్బంది.
* గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎయిర్ ఇండియా అధికారులు .
Astra news :
గన్నవరం ఎయిర్ పోర్టులో బుల్లెట్ కలకలం రేపింది. గన్నవరం నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి బయలుదేరిన ఓ ప్రయాణికుడి లగేజీలో భద్రతా సిబ్బంది బుల్లెట్‌ను గుర్తించారు. బ్యాగులో బుల్లెట్ లభ్యం కావడంతో తనిఖీ కేంద్రంలో కొంత కలకలం రేగింది. నిందితుడు ఓ ప్రైవేటు యూనివర్సిటీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నట్టుగా ఎయిర్ పోర్టు అధికారులు గుర్తించారు. గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్తున్న సదరు విద్యార్థి ఎవరు, తుపాకీని తనతో తీసుకువెళ్లాల్సిన అవసరం ఏంటనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని గన్నవరం పోలీసులకు అప్పగించారు.
విమానాశ్రయంలోని బ్యాగేజ్ స్క్రీనింగ్ (X-ray) సమయంలో ఈ తూటాలు బయటపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతా నిబంధనల ప్రకారం విమానాల్లోకి బుల్లెట్లు, తుపాకులు లేదా ఎలాంటి పేలుడు పదార్థాలను తీసుకెళ్లడం చట్టరీత్యా నేరం. అనుమతి లేకుండా వీటిని తీసుకువెళ్లే ప్రయాణికులను అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ కోసం విమానాశ్రయ పోలీసులు అదుపులోకి తీసుకుంటారు.