Tuesday, 28 July 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / జాతీయ వార్తలు

"చలో పార్లమెంట్ మార్చ్ " భారతదేశపు రెండో స్వాతంత్య్ర్య పోరాటం...!

19 Jul 2026
03:16 PM
131

* తొలిసారి  ప్రజలకు ఒక సందేశాన్ని విడుదల చేసిన  సామాజిక కార్యకర్త సోనమ్ వాంగుచుక్ ..
* ప్రైవేటు అసుపత్రికి మార్చాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన  వాంగుచుక్ సతీమణి..

DELHI  : 

నీట్ పేపర్ లీకులు వ్యవహారంపై అమరణదీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగుచుక్ తొలిసారిగా ప్రజలకు ఒక సందేశాన్ని విడుదల చేశారు. ఢిల్లీలోని ఢిల్లీలోని సఫ్టర్ జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అయన  జూలై 20న జరగనున్న 'చలో పార్లమెంట్' మార్చ్ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, ఇది  "భారతదేశపు రెండో స్వాతంత్య్ర్య పోరాటం' అంటూ ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అన్యాయం, భయం, పేపర్ లీకులు, అక్రమ నిర్బంధం వంటి సమస్యలకు వ్యతిరేకంగా ఈ పోరాటం సాగుతుందన్నారు. ఈ నిరసనను విజయవంతం చేసి, న్యాయం కోసం జరుగుతున్న ఈ ఉద్యమానికి మద్దతు తెలపాలని కోరారు.

ప్రస్తుతం అయన ఢిల్లీలోని సఫ్టర్ జంగ్ ఆసుపత్రిలో సోనమ్ వాంగుచుక్ చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన నాడి, రక్తపోటు, ఇతర కీలక ఆరోగ్య సూచికలు సాధారణంగా ఉన్నాయి. అయితే, సుదీర్ఘకాలం పాటు నిరాహార దీక్ష చేయడంతో ఆయన రక్త పరీక్ల నివేదికలలో కొన్ని మార్పులు కనిపించినట్లు, ఆయన శరీరంపై ఉపవాస ప్రభావం తీవ్రంగా ఉందని, అందుకే నిపుణులైన వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోందని వైద్యులు తెలిపారు.

ఇధిలా ఉండగా, మరోవైపు సోనమ్ వాంగుచుక్ సతీమణి డాక్టర్ గీతాంబులి ఆంగ్మో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోనమ్ వాంగుచుక్ కు సిస్టర్ జంగ్ ఆసుపత్రి నుండి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోరారు. తన భర్తను ఇష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచారని, అక్కడ అందుతున్న చికిత్సపై తమకు నమ్మకం లేదని ఆమె ఆరోపించారు. అనేక సార్లు అభ్యర్థించినా, ఆసుపత్రి యాజమాన్యం ఆయనను డిశ్చార్జ్ చేయడం లేదని లేదా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతించడం లేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తక్షణం అసుపత్రి మార్పుకు అదేశాలు ఇవ్వాలని కోరారు. 

 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!