Tuesday, 28 July 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / అంతర్జాతీయ వార్తలు

యుద్ధం ఇలాగే కొనసాగితే అన్ని హద్దులూ దాటిపోతాం...!

18 Jul 2026
08:47 PM
53

* 2-3 రోజులు ఇలాగే యుద్దం కొనసాగితే ...
* అత్యంత దూకుడుగా ఉండే ఒక 'విధ్వంసకర దశ'లోకి మారుతుంది...
* అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సైనిక సలహాదారు మొహసేన్ రెజాయ్ హెచ్చరికలు ...

America vs Iron war :

అమెరికా - ఇరాన్ వార్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్దం ఇలాగే కొనసాగితే అన్ని హద్దులూ దాటిపోతామని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సైనిక సలహాదారు మొహసేన్ రెజాయ్ హెచ్చరికలు చేశారు. శనివారం అయన ఈ మీడియా సంస్థ ఇంటర్వూలో అయన మాట్లాడుతూ యుద్ధంతో పాటు చర్చలను బ్యాలెన్స్‌ చేసే ఇరాన్ విధానం ముగిసిందని చెప్పారు. ఒకవేళ అమెరికా దాడులు మరో 2-3 రోజులు ఇలాగే కొనసాగితే, ఇరాన్ ఇకపై కేవలం ప్రతీకార దాడులకే పరిమితం కాకుండా, అత్యంత దూకుడుగా ఉండే ఒక 'విధ్వంసకర దశ'లోకి మారుతుందని ఆయన హెచ్చరించారు.

Article Image

అటువంటి పరిస్థితి ఎదురైతే, అమెరికాకు చెందిన ఏ ఒక్క సైనిక స్థావరం లేదా దళం కూడా ఇరాన్ పరిధిలో సురక్షితంగా ఉండలేవని రెజాయ్ స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా, ఇరాన్ మిస్సైల్స్‌ అండ్‌ డ్రోన్ దాడుల తీవ్రత కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. వేలాది క్షిపణులు, డ్రోన్లతో విస్తృత స్థాయి దాడులు చేసే సత్తా ఇరాన్‌కు ఉందని, అమెరికా భీకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడం, దేశం కోల్పోయిన ఆస్తులను రాబట్టుకోవడం తమ ప్రధాన లక్ష్యాలని స్పష్టం చేశారు. 

ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ చేసే దాడులకు ఏ దేశ భూభాగాన్ని లేదా స్థావరాలను ఉపయోగించుకుంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని గల్ఫ్ దేశాలైన కువైట్, ఖతార్, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లకు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే ఇరాన్ దాడులతో అతలాకుతలమైన గల్ఫ్ దేశాలు ...ఇరాన్ ఇక పై చేసే దాడులకు మరింత తీవ్ర స్థాయిలో నష్టం తప్పదని స్పష్టం చేశారు. 

అయితే, ఇది కేవలం ఒక వార్నింగ్ మాత్రమే, సైనిక చర్యకు సంబంధించిన ఖచ్చితమైన ప్రకటన కానప్పటికీ... ఇప్పటి వరకు అమెరికాపై ఇరాన్ చేసిన అత్యంత కఠినమైన  ఓపెన్ స్టేట్‌మెంట్‌ ఇదేనని చెప్పవచ్చు. ఈ ఘర్షణ రాబోయే రోజుల్లో మరింత ప్రమాదకరమైన దశలోకి ప్రవేశించవచ్చనే సంకేతాలను ఇది ఇస్తోంది.

  

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!