* రోడ్డుపై పగుళ్లను మార్కు వేసి చూపిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు...
* టీడీపీ-వైసీపీ నేతల మధ్య వాగ్వాదం.. !
* ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పుత్ర వాత్సల్యం వ్యక్తిగతంగా చూపించుకో...
* ప్రజా ధనం దోచి పుత్ర వాత్సల్యం చూపించవడం సరికాదు...
* మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఘాట్ వ్యాఖ్యలు ....
ప్రొద్దుటూరు :
ప్రొద్దుటూరులో రోడ్ల నాణ్యతపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రచ్చకు దారితీసింది. పట్టణంలో టిడిపి నాయకులు వేసిన రోడ్లు నాణ్యతగా లేవంటూ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు మార్కు వేసి చూపడం... అడ్డుకునేందుకు టిడిపి నాయకులు రావడంతో కొంత ఉద్రిక్తత పరిస్ధితులు నెలకొన్నాయి. రాచమల్లు సమావేశం నిర్వహిస్తున్న చోటికి నంద్యాల కొండారెడ్డి, మహేశ్వర రెడ్డి మరికొంతమంది తెలుగుదేశం నాయకులు అక్కడికి చేరుకొని వై.యస్.ఆర్.సి.పి నాయకులపై వాగ్వివాదానికి దిగారు. ఇరు వర్గాలు వాదోపవాదాలకు దిగడంతో పోలీసులు చెదరగొట్టాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే ... ప్రొద్దుటూరు పట్టణం బొల్లవరం పరిధిలోని సెయింట్ జోసెఫ్ స్కూల్ వద్ద పొట్టిపాడు రోడ్డులో స్పెషల్ కాంట్రాక్టర్ మహేశ్వర్ రెడ్డి ఇటీవల వేసిన రోడ్డు పగుళ్ళు వచ్చాయి. ఈ రోడ్లలో నాణ్యతను పరిశీలించేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు రోడ్డెక్కారు. రోడ్డుపై పగుళ్లను మార్కు వేసి చూపిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు... 20 ఏళ్ళు గ్యారంటీ అన్నావు ఇప్పుడు కళ్లు బాగా పెద్దవి చేసి చూడు మిస్టర్ స్పెషల్ కాంట్రాక్టర్ మహేశ్వర్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. మీకు చేతగాక పావలా వాటాదారుడు మహేశ్వర రెడ్డి తో సమాధానం చెప్పించడం కాదు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, ప్రజలకు సమాధానం మీరు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. నేను నిజాయతీ పరుణ్ణి, దేశ భక్తున్ని, అవినీతి పరుణ్ణి అని చెప్పుకొని తిరిగే ఓ పెద్దమనిషి, 2 సంవత్సరాలు చేసిన వెధవ పనులకు సమాధానం చెప్పకుండా , మీ ప్రభుత్వంలో కూడా చేసారు అనడం అత్యంత అవివేకమని మండిపడ్డారు. వేల మంది ప్రజలకు ఎంతోమంది కి ముఖ్యంగా ఉపయోగపడే ఈ రోడ్డును ఇంత నాశిరకంగా వేయడం పై దమ్ముంటే సమాధానం చెప్పు పెద్దాయన అంటూ సవాల్ విసిరారు. సింగల్ టెండర్ విధానం తీసుకోచ్చి, ప్రజల స్వేచ్ఛను హరించింది మీరు కాదా.

మా ప్రభుత్వంలో ప్రొద్దుటూరు అభివృద్ధికి నేను తెచ్చిన నిధులు, దమ్ముంటే మీరు తెచ్చి అభివృద్ధి చేయండి. మా వై.యస్.ఆర్.సి.పి ప్రభుత్వంలో మేము నిర్మించిన కొత్త బస్టాండు ప్రారంభోత్సవం చేయకపోవడం సిగ్గుచేటు. కూరగాయల మార్కెట్ నిర్మిస్తున్న కాంట్రాక్టర్ వద్ద డబ్బులు అడగడం నిజం కాదా. కరోనా మహమ్మారీ లాంటి ప్రాణాంతక పరిస్థితుల్లో, ప్రజలకు ఉపయోగపడింది వై.యస్.ఆర్.సి.పి అండదండగా ఉన్న విషయం ప్రజలు గమనించాలి. మాజీ తెలుగుదేశం ఇంచార్జ్ ప్రవీణ్ రెడ్డి ఇంటికి పార్లపాడు మహేశ్వర్ రెడ్డి ని పంపించి సిగ్గులేని లోపాయకారి ఒప్పందం చేసుకొనే మీరా మమ్మల్ని మాట్లాడేది.. మీ దోపిడీ, మీ దౌర్జన్యం, మీ ద్వంద వైఖరి చూస్తుంటే ప్రజలు అసహించుకుంటున్నారు. ప్రొద్దుటూరు అభివృద్ధి లో అవినీతి మయం చేసి, ప్రజా ధనం దోచుకునే మీ ఆరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు... ఖబద్దార్ అంటూ సవాల్ విసిరారు.