Tuesday, 28 July 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / అంతర్జాతీయ వార్తలు

చర్చల దిశగా అమెరికా..ఇరాన్ అడుగులు... !

10 Jul 2026
02:03 PM
27

* ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్ విశ్వప్రయత్నాలు ...
* నేడు ఇరు వైపుల నుంచి చోటుచేసుకొని దాడులు....

America - Iran war   : 

అమెరికా, ఇరాన్ ల మధ్య జరిగిన పరస్పర దాడులతో ఉద్రిక్తంగా మారిన పశ్చిమాసియా...మళ్లీ చర్చల దిశగా అడుగులు పడుతుతున్నాయి. కొన్ని నెలల పాటు సాగిన యుద్దం చర్చల ద్వారా తగ్గుముఖం పట్టనట్లే పట్టి మళ్లీ ఇటీవల ఉద్రిక్తంగా మారాయి. దీంతో పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారింది. దీంతో  పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా -ఇరాన్ మధ్య రెండు రోజుల పాటు భీకర దాడులు చోటుచేసుకున్నాయి. అయితే  శాంతి చర్చలను మళ్లీ పట్టాలెక్కించేందుకు మధ్యవర్తి దేశాలు ముమ్మరంగా  ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో యుద్ధం తాత్కాలికంగా ఆగిందని సమాచారం.

అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన పరస్పర దాడులతో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే ప్రస్తుతం ఇరు దేశాలు చర్చల దిశగా అడుగులు వేస్తున్నట్లు అల్బజీరా ఓ కథనం వ్రాసింది. అందులో వాషింగ్టన్ ఇప్పటికీ చర్చలకు కట్టుబడి ఉందని, ఇరు దేశాల మధ్య సాంకేతిక స్థాయి చర్చలు కొనసాగుతున్నాయని ఓ అమెరికా అధికారి వెల్లడించారు. ఈ నేపధ్యంలో నిన్నటి వరకు ఇరు వైపుల నుంచి దాడులు కొనసాగగా, ఈ రోజు మాత్రం ఇరు వైపుల నుంచి కొత్తగా దాడులేం జరగలేదు. బుషిహర్ సైనిక స్థావరం వద్ద బాంబుల మోత మోగింది. అయితే. అమెరికా-ఇజ్రాయెల్ తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించాయి. దీంతో ఆ బాంబుల మోతకు కారణం ఎంటన్నదానిపై చర్చ నడుస్తుంది. 
 
అమెరికా- ఇరాన్ ఘర్షణను తగ్గించేందుకు ఖతార్ మధ్యవర్తిత్వ ప్రయత్నం చేస్తోంది. ఘర్షణలకు పరిష్కారం కేవలం దౌత్యం మాత్రమే మార్గమని, అందుకే చర్చల ద్వారానే సమస్య పరిష్కరించేందుకు అవకాశం ఉందని  ఖతార్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఖతార్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాజిద్ అన్సారీ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో శాశ్వత భద్రత, స్థిరత్వం కోసం సంభాషణలు దౌత్య మార్గాలకి తమ దేశం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. లండన్లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు జరిగినప్పటికీ, భారత్‌కు ముడిచమురు సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగలేదు

ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దులో  కొనసాగుతున్న ఉద్రిక్తతలు  : 
అమెరికా -ఇరాన్ మధ్య పరిస్థితి  శాంతించినప్పటికి, లెబనాన్ సరిహద్దులో  మాత్రం ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దక్షిణ లెబనాన్లో లోని నబాతియే ప్రాంతంలో ఇజ్రాయెల్  దాడి జరిగింది. చెత్తను తరలిస్తున్న ఓ వాహనంపై జరిగిన ఈ దాడిలో ఇద్దరు గాయపడినట్లు లెబనాన్ జాతీయ వార్తా సంస్థ వెల్లడించగా, షుడిన్, కఫర్ దజ్జల్ ప్రాంతాల సమీపంలో ఉదయం ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఇజ్రాయెల్ దాడుల కారణంగా లెబనాన్లో మార్చి 2 నుంచి ఇప్పటి వరకు 4,321 మంది మరణించగా.. 12,203 మంది గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. జూన్ 26న అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య దళాల ఉపసంహరణకు సంబంధించి ఒప్పందం కుదిరినప్పటికీ.. కొత్తగా జరిగిన ఈ దాడి అక్కడి ఉద్రిక్తతలకు అద్దం పడుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

 

 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!