Tuesday, 28 July 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / జాతీయ వార్తలు

శబరిమల కానుకలపై కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు... !

10 Jul 2026
12:43 PM
59

* కానుకల మదింపులో అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ..
* మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేటీ శంకరస్ కు  ఆదేశం ...

తిరువనంతపురం   : 

శబరిమల  కానుకలపై   ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డుకు కేరళ హైకోర్టు  కీలక ఆదేశాలు జారీ చేసింది. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకల మదింపులో మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేటీ శంకరస్ కు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించింది. అయ్యప్పస్వామికి సంబంధించిన బంగారు కానుకలతో పాటు ఇతర విలువైన వస్తువులను 80 బస్తాలలో నిల్వ ఉంచిన నేపథ్యంలో వాటి లెక్కింపుకు సహకరించాలని కోర్టు  ఆదేశించింది. 

ఇప్పటి వరకు స్వీకరించిన కానుకలనే కాకుండా భవిష్యత్తులో స్వీకరించే విలువైన కానుకలను సురక్షితంగా భద్రపరచేందుకు అనుసరించబోయే విధానం గురించి సైతం తమకు ఖచ్చితంగా తెలియజేయాలని బోర్డు స్టాండింగ్ కౌన్సిల్కు ఆదేశాలిచ్చింది. అటువంటి కానుకలను క్రమానుగతంగా మదింపు చేసి, సమగ్రమైన డిజిటల్ ఇన్వెంటరీ ద్వారా నమోదు చేయడమే దీని ఉద్దేశమని తెలిపింది. ప్రత్యేక కమిషనర్ సమర్పించిన నివేదికను పరిశీలిస్తున్న సమయంలో జస్టిస్ వి.రాజా విజయ రాఘవన్ ఈ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కేసును తదుపరి విచారణ కోసం కోర్టు ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేసింది.

ఇటీవల అయోధ్య రామమందిర ఆలయం కానుకలు వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగుచూడటం, అమర్ నాథ్ ఆలయంలోను కానుకల అక్రమాల నేపధ్యంలోనే  కేరళా హైకోర్టు కూడా ఇలాంటి జారీ చేసినట్లు సమాచారం.  ఇప్పటికే శబరిమల ఆలయంలో అదమళ స్ట్రాంగ్ రూమ్లో 'కనిపొన్ను' అని లేబుల్ చేసి 80 సంచులలో వీటిని నిల్వ ఉంచారు. శురిమల ఆలయ తిరువాభరణ రిజిస్టర్లో నమోదైన అన్ని వస్తువులతో పాటు, ఆరమ్మళ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన విలువైన వస్తువుల సమగ్ర మదింపును చేపట్టేందుకు, జస్టిన్ టీ శుకరస్ ను హైకోర్టు 2025 సెప్టెంబర్ 29న నియమించింది. ప్రత్యేక కమిషనర్ నివేదిక ప్రకారం, మదింపు ప్రక్రియ ఇప్పుడు పూర్తి కావస్తోంది.

అయితే, జూలై 4న నిర్వహించిన తనిఖీలో  గుర్తించబడిన 80 సంచులలో బంగారం వెండి కానుకలు మాత్రమే. అనేక ఇతర సామగ్రి కూడా ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. విలువైన వస్తువుల నుండి విలువ లేని వస్తువులను ముందుగా వేరు చేస్తే తప్ప ఆ విలువైన వస్తువుల సరైన విలువను నిర్ధారించడం సాధ్యం కాదని నివేదిక పేర్కొంది. అయితే ఈ విషయంలో పూర్తి సహకారం అందిస్తామని డ్రావెన్ కోర్ దేవస్థానం బోర్డ్ హామీ ఇచ్చిన నేపథ్యంలో.... సంచులలోని వస్తువులను వేరు చేయడం వాటిలో ఉన్న విలువైన వస్తువుల విలువను అంచనా వేయడం రెండింటికీ సహకరించాలని బోర్డును ఆదేశించింది. శబరమల ఆలయానికి వచ్చే విలువైన వస్తువుల కోసం ఒక క్రమబద్ధమైన. డిజిటల్ పద్దతిలో నిర్వహించబడి బాబితా వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా భక్తులు సమర్పించే కానుకల నమోదు, భద్రతను బలోపేతం చేయడానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!