Tuesday, 28 July 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / జాతీయ వార్తలు

బెంగాల్ లో మమతకు బిజేపి మరో షాక్ ...!

10 Jul 2026
12:29 PM
49

* ఉప ఎన్నికల్లో మాజీ టిఎంసీని వీడిన వారికి బిజేపి టికెట్లు... !
* ఎన్నికల ముందు తీసుకునేలేదని చెప్పిన బిజేపి...
* ఇప్పుడు వారినే రాజ్యసభ అభ్యర్ధులుగా ప్రకటించడంపై తీవ్ర చర్చ....

కలకత్తా  : 
 
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మాజీ సిఎం మమత పార్టీ టిఎంసినీ నామరూపాలు లేకుండ చేసేందుకు బిజేపి చేస్తున్న ప్రయత్నాల్లో అన్యూహ పరిణామం చోటుచేసుకుంది. ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్ నేతలను తమ పార్టీలోకి తీసుకునేది లేదంటూప్రకటించిన కమలం పార్టీ.. ఇప్పుడు అదే పార్టీ నుంచి వచ్చిన తాజా మాజీలకు వెంటనే పెద్దపీట వేసింది. టీఎంసీని వీడి బీజేపీలో చేరిన ముగ్గురిని రాజ్యసభ ఉప ఎన్నికల అభ్యర్థులుగా ప్రకటించడం బెంగాల్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య సమక్షంలో  నిన్న మాజీ టిఎంసీకి చెందిన సుఖిండు శేఖర్ , సుష్మితా దేవ్, ప్రకాశ్ చికా బరైక్లు పార్టీ కండువా కప్పుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్‌కు రాజ్యసభ పదవులకు రాజీనామా చేసి కమలం గూటికి చేరిన ఈ ముగ్గురిని.. కొన్ని గంటల వ్యవధిలోనే జులై 24న జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికల అభ్యర్థులుగా కమలం పార్టీ ప్రకటించింది. దీంతో బెంగాల్ రాజకీయాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా  మారింది. వీరంతా 2026 ఎన్నికల దగ్గర పడిన నేపధ్యంలో వరుసగా అదునుచూసి టిఎంసిపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ తీవ్రంగానే అరోపణలు చేసిన వారే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

 అయితే గత ప్రభుత్వ హాయంలో చాలా మంది టిఎంసీ నేతలపై బిజేపి పెద్ద ఎత్తున అవినీతి అరోపణలు చేసింది. ప్రత్యేకించి అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ ప్రచారాన్ని మరింత తీవ్ర తరం చేసింది. దీంతో ఆ పార్టీ నాయకులకు తమ పార్టీలో చోటు ఉండదని స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు గంటల వ్యవధిలోనే ముగ్గురు మాజీ టీఎంసీ ఎంపీలకు రాజ్యసభ అవకాశం ఇవ్వడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. అయితే ఇది సాధారణ విధానం కాదని, ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయమని బెంగాల్ బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రజలను వేధించని, అవినీతి ఆరోపణలు లేని నేతలను మాత్రమే టీఎంసీకి వ్యతిరేకంగా జరిగి పోరాటంలో భాగస్వాములను చేసుకుంటామని బీజేపీ రాష్ట్ర నాయకత్వం పేర్కొటొంది. 

2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత 294 మంది సభ్యుల సభలో బీజేపీ 205 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది.ఈ ఎన్నికల్లో బెంగాల్ లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న బిజేపి ఇప్పుడు మరింత పూర్తి స్థాయిలో పార్టీని బోపేతం చేసుకునే దిశగా రాజ్యసభ ఉప ఎన్నికల సమీకరణాలు కూడా బీజేపీకి అనుకూలంగా మార్చకునే ప్రయత్నాలు చేపట్టింది. ఇందుకు  తృణమూల్ కాంగ్రెస్లో  ఏర్పడిన అంతర్గత విభేదాలు కూడా కలిసి రావడంతో రాజ్యసభ ఎన్నికల లెక్కలను పూర్తిగా మార్చేశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతొంది. ఇ:దులో భాగంగా ఎన్నికల తరువాత ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా విడిపోవడంతో- మూడు రాజ్యసభ స్థానాలను కూడా గెలుచుకునే అవకాశం బీజేపీకి ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా జరిగే 2-1 పోటీ కాస్తా.. ఇప్పుడు మూడు స్థానాలపై కమలం గురి పెట్టి పరిస్థితి ఏర్పడింది.

బెంగాల్లో రాజకీయ పోరు కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా.. ఎన్నికలకు ముందే ఆధిపత్యం కోసం సాగుతోంది. తృణమూల్ నుంచి వచ్చిన నేతలకు కీలక పదవులు ఇవ్వడం ద్వారా బీజేపీ ఒకేసారి రెండు లక్ష్యాలను సాధించాలనే వ్యూహంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు మనుతా బెనర్జీ పార్టీలో అసంతృప్తి ఉందనే సంకేతాన్ని ఇవ్వడం... మరోవైపు తృణమూల్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా తమ స్థాయిని పెంచుకోవడం కమలం పార్టీ ఉద్దేశంగా ముందుకు వెళ్తుంది. అంతేకాకుండా రాజ్యసభలో బలం పెంచుకోవడంతో పాటు.. బెంగాల్లో స్థానిక స్థాయిలో బలమైన నేతలను తమ వైపు తిప్పుకోవడం ద్వారా  ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే పునాది వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తృణమూల్ నుంచి వచ్చిన నేతలను వెంటనే కీలక స్థానాల్లోకి తీసుకుంటుంది. కానీ ఈ పరిణామాలు ఇప్పటికి బిజేపి బలపడుతుందన్న అభిప్రాయం రావచ్చు గానీ....ఎన్నికల ముందు టిఎంసీ నేతలను తీసుకునే ప్రసక్తే లేదని చెప్పి...ఇప్పుడు వారి ప్రకటనలకే  విరుద్ధంగా  వరుసబెట్టి తీసుకోవడం... వారినే రాజ్యసభ అభ్యర్ధులుగా ప్రకటించడం రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది వేచి చూడాలి.  

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!