Tuesday, 28 July 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

అమరావతిలో వైసీపీకి చిక్కిన "పట్టు" సడలించేందుకేనా టిడిపి దాడులు...!

28 Jun 2026
07:28 PM
90

• రైతుల్లో అసంతృప్తి వైసీపీకి కలిసొచ్చేనా...?
• వైసీపీకీ చిక్కిన పట్టు సడలించడం... టిడిపికి సాధ్యామేనా...?


Amaravati desk  :
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో టిడిపికి తిరుగులేదు అన్నది రాష్ట్ర విభజన తర్వాత నెలకొన్న అభిప్రాయం. కానీ ఇప్పుడు అదే ప్రాంతంలో వైసిపి పట్టు సాధించిందా అంటే అవునన్న అభిప్రాయమే వ్యక్తం అవుతుంది.  కానీ పూర్తిగా తమ ఆధిపత్యం కొనసాగుతుందనుకున్న ప్రాంతంలో వైసిపి పట్టు సాధించడం జీర్ణించుకోలేక టిడిపి ఇప్పుడు వైసీపీ పై దాడులకు దిగడం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి టిడిపి భయపడుతున్నంతగా వైసిపికి ఇప్పుడు అమరావతి ప్రాంతంలో పట్టి దొరికిందా అన్నది అందరిలోనూ చర్చ నడుస్తుంది. ఇందుకు  ప్రధాన కారణం ...రాజధాని పేరిట రైతుల భూములు లాక్కోడానికి ఒక వైపు భూ సమీకరణ ... మరో వైపు భూసేకరణను ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇప్పుడు ఇదే ఆ ప్రాంతంలో వైసీపీకి పట్టు దొరికేలా చేసిందని చెప్పక తప్పదు.

రాజధాని అమరావతి పేరుతో ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కోడానికి ప్రయత్నిస్తుందని పెనుమాక రైతులు ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కలిసి విన్నవించారు.
మా భూములు లాక్కోడానికి ఒక వైపు భూ సమీకరణ, మరో వైపు భూసేకరణ అమలు చేస్తున్నారు. రైతుల పొలాల్లో గుంటలు తవ్వుతున్నారు.. రోడ్లు వేస్తున్నారు.. అనేక విధాలుగా ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అరాచకాన్ని వైఎస్ జగన్ దృష్టికి తీసుకు వెళ్లారు.

రైతుల సమస్యలు విన్న వైఎస్ జగన్  రైతు పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ మేరకు రైతు పరిరక్షణ కమిటి పేరుతో రైతుల భూములు చూడటానికి వైసీపీ నేతలు రావడంతో టిడిపి నాయకులు దాడులకు దిగుతూ అడ్డుకున్నారు. ఈ అడ్డుకునే ప్రయత్నంలో టిడిపి నాయకులు వైసీపీ నేతలపై, పోలీసులపై  చేసిన దాడులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపాయి.  ఇటీవల విజయవాడ క్రిష్ణ పోలీసు స్టేషన్ లో జనసేన యువకుడు సాయిక్రిష్ణ ఘటనతో రాష్ట్రంలో శాంతిభద్రతలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు కూటమి కిందమీద పడుతున్న పరిస్థితుల్లోనూ ...భూముల పరిశీలనకు వెళ్లిన రైతు పరిరక్షణ కమిటీలోని వైసీపీ నేతలపై, పోలీసులపై రాళ్లు, గుడ్లు, కర్రలతో  దాడికి దిగడం... దాడిలో వైసీపీ నేతల వాహనాలు ధ్వంసం, పోలీసుకు తీవ్ర గాయం కావడం ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచివి కాదని కూటమి చెప్పించుకోవలసి వచ్చింది. కానీ ఇలాంటి సమయంలోను టిడిపి అంతటి దాడులకు తెగబడటం అంటే... రాజధాని ప్రాంతంలో వైసీపీకి పట్టు దొరకడం సహించలేకపోడమేనని చెప్పొచ్చు.

కానీ ఈ దాడులతో రాజధాని ప్రాంత రైతులు బెదిరిపోతారనుకుంటే.... వారు మరోమారు మీడియా ముందుకు వచ్చి కూటమి దాడులను తీవ్రంగానే ఖండించారు.
రాజధాని అమరావతి పేరుతో ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కోడానికి ప్రయత్నిస్తుందని తామే వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు చెప్పామని,  అందుకే రైతు పరిరక్షణ కమిటిని ఏర్పాటు చేసి పరిశీలనకు పంపారన్నారు. కానీ అంతా కరెక్ట్ గా చేస్తే చెప్పాలి  గానీ దాడులు చెయ్యడం ఎంటని ప్రశ్నించారు. మా భూములు లాక్కోడానికి ఒక వైపు భూ సమీకరణ, మరో వైపు భూసేకరణ అమలు చేస్తున్నారని, రైతుల పొలాల్లో గుంటలు తవ్వుతున్నారని, రోడ్లు వేస్తున్నారని,  అనేక విధాలుగా ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఆర్డీఏ,  రైతు పరిరక్షణ కమిటీని మా భూములను పరిశీలించడానికి మళ్లీ ఆహ్వానిస్తామని,  అవసరమైతే వైఎస్ వైఎస్ జగన్నే మా గ్రామానికి ఆహ్వానిస్తామని పెనుమాక రైతులు స్పష్టం చేశారు.

నిన్నటి దాడులతో రాజధాని ప్రాంతంలో టిడిపికి గట్టి పట్టుందని చాటుకుంటే .... మరోవైపు పెనుమాక రైతులు మాత్రం వైసిపి అధినేత వైఎస్ జగన్ ను మరోమారు పొలాల పరిశీలనకు  ఆహ్వానిస్తామని చెప్పడమంటే వైసీపీకి మంచి పట్ట దొరికిందని అభిప్రాయం కూడా లేకపోలేదు. అయితే ఈ పోరాటం టిడిపికి ఉన్న పట్టుకు...... వైసీపీకి దొరికిన పట్టుకు మధ్య జరుగుతున్న పోరాటంగా చెప్పక తప్పదు.  మరి ఈ పోరాటంలో ఎవరు ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారనని.... ఇది తప్ఫక భవిష్యత్తు రాజకీయాల్లో కీలక పరిణామంగా మారనుంది. 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!