Tuesday, 28 July 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతల్లో పెరిగిన కాన్ఫిడెన్స్ ...!

13 Jun 2026
07:21 PM
108

" వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన కార్యక్రమాల సక్సెస్ తో  నూతనోత్సాహం...
* పార్టీ క్యాడర్ కలిసిరావడం.... ప్రజలు మద్దతు పలకడంతో పెరిగిన పాజిటీవ్ వేవ్స్ ....
* కూటమి పతనం అరంభమైందంటూ  కడప జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథరెడ్డి ప్రకటన...


ASTRANEWS DESK  :

ఆంధ్రప్రదేశ్ లో "వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన కార్యక్రమాల సక్సెస్ తో  వైసీపీలో నూతనోత్సాహం కనపడుతుంది. రాష్ర్టంలోని ప్రతి నియోజకవర్గంలోను పార్టీ క్యాడర్ మళ్లీ యాక్టీవ్ అవ్వడంతో పాటు ప్రజలు కూడా భారీగానే తరలిరావడంతో "వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన కార్యక్రమాలు జనహోరును తలపించాయి. దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీలో నూతనోత్సాహాం కనిపిస్తొంది. నూతనోత్సాహామే కాదు... కూటమి పతనం అరంభమైందంటూ ప్రకటనలు కూడా వినిపిస్తున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లా కడప జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథరెడ్డి ...అబద్దాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పతనం అరంభమైందని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.  కుప్పం నుండి ... కురుపాం వరకు... రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో.."వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన కార్యక్రమాలను పరిశీలిస్తే....కూటమికి  పతనం అరంభమైందని, రెండేళ్ల పాలనలో అన్ని వర్గాల వారిని వెన్నుపోటు పొడవటం తప్పా ఎవరికి మంచి చేసింది లేదని కడప జిల్లా వైసీపీ అధ్యక్షులు పి. రవీంద్రనాథరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.  ఎన్నికలకు ముందు సూపర్‌ సిక్స్‌... సూపర్‌ సెవెన్‌ అంటూ అబద్దపు హామీలు ఇఛ్చారని, మొత్తం 143 హామీలు త‌న మేనిఫెస్టోలోను బాండ్ల రూపేనా, ప్ర‌తి ఇంటికీ వెళ్లి బాండ్లు రాసి మ‌రి ఇవ్వడంతో పాటు వారి ఎల్లో మీడియా పత్రికల్లో భారీ యాడ్స్ కూడా ఇచ్చారని మండిపడ్డారు. కానీ ఈ రోజు  ఆ హామీలు ఏమయ్యాయి చంద్రబాబుగారూ? అని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పకుండా దొంగతిరుగుడు మాటలతో కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. ఈ కూటమి పాలనలో రైతులను మోసం చేశారని,  మహిళలను మోసం చేశారని, యువతను,విద్యార్థిని మోసం చేశారని, చివరకు ప్రతి కుటుంబాన్ని మోసం చేశారన్నారు.  ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులకు ఏ మాత్రం పొంతనే లేదని,  ప్రతి క్షణం మోసం, ప్రతి పనిలో దగా, అంతా స్కాంల మ‌య‌మేనన్నారు.  ఈ రెండేళ్లలో రాష్ట్రం చూసింది అభివృద్ధి కాదని, పచ్చి అబద్ధాల ప్రచారమని, సంక్షేమం కాదని రాష్ట్ర ప్ర‌జ‌లు చూసింది మోసమని, ప్రజాపాలన కాదని,  రాజకీయ కక్షసాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో భయానక పాలన సాగిందన్నారు. ‘ఇది మంచి ప్రభుత్వమని’’  చెప్పుకునే ఈ పాలనలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయని, మహిళలకు, చిన్నారులకు రక్షణే లేదు. పోలీసు సహా అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించారు. శాంతిభద్రతలను దారుణంగా దెబ్బతీశారన్నారు. కానీ నేడు వైసీపీ ప్రభుత్వ మాయంలో విధ్వంసం జరిగిందని విమర్శిస్తున్నారని, మరి వైసీపీ హాయంలో నాడు నేడు కింద పాఠశాల నిర్మాణం, మెడికల్ కాలేజీల నిర్మాణం, హర్బర్లు వంటివి కూటమి ప్రభుత్వానికి కనినించడం లేదని ప్రశ్నించారు. వ్యవసాయం సంక్షోభంలో ఉందని,  ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదని,  ఎరువులు అందజేయలేకున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆశలు చూపించారని, మొదటి యేడాది ఇవ్వకపోయినా... రెండవ యేడాది మెగా డీఎస్సీ అంటూ .... నిర్వహణలో అక్రమాలు, అవకతవకలు, స్కామ్‌ల‌తో  యువత భవిష్యత్తును దారుణంగా దెబ్బతీశారన్నారు. కానీ తిరుపతిలో నిర్వహించిన విజయోత్సవ సభలోను అన్ని అపద్దాలే చెప్పారని, జగన్ నామస్మరణే చేశారని, అంతకుమించి చెప్పేందుకు ఎమీ లేదన్నారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రతి హామీని గుర్తుంచుకున్నారు. ప్రతి మోసాన్ని లెక్కపెడుతున్నారన్నారు. ఈ రోజు ఈ కేసులను చూసి ప్రజలు చెప్పకపోవచ్చునని, ఎన్నికల నాడు మాత్రం తప్పక బుద్ది చెప్పడం ఖాయమన్నారు. ప్రజల తరుపున ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే వైసీపీ వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని నిర్వహించామని, ఈ కార్యక్రమానికి ప్రతి చోట ప్రజల స్వచ్చందంగా తరలివచ్చి మద్దతు పలికారన్నారు. 

 

 

 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!