Saturday, 13 June 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

కూట‌మి సౌండ్... ! వైసీపీ రీసౌండ్.... !!

12 Jun 2026
10:59 PM
105

* వైసీపీ నిరసనలతో మార్మోగిన రాష్ట్రం....
* కూటమి విజయోత్సవ సభను మించి రీ సౌండ్ చేసిన "వెన్నుపోటుకు రెండేళ్లు"  ....
* విజయోత్సవ సభలో చేసింది చెప్పుకుంది కొంతే ...
* వైసీపీ మీద చేసిన గత అరోపణలకే  ఇప్పుడు మరోమారు ప్రాధాన్యత....
 

ASTRA NEWS DESK  : 
అంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేడు చోటుచేసుకున్న పరిణామాలు రాష్ట్రంలో  చర్చనీయాంశంగా మారాయి.  అధికార కూటమి సౌండ్ చేస్తే... ప్రతిపక్ష వైసీపీ ఆ మూడు పార్టీలకు మంచి రీ సౌండ్ చేసింది.  కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లైన సందర్బంగా అధికారంలో ఉన్న కూటమి విజయోత్సవ సభ పేరుతో సౌండ్ చేస్తే .... ప్రతిపక్ష్యంలో ఉన్న  వైసీపీ వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో రాష్ర్ట వ్యాప్తంగా చేసిన నిరసనలు రీసౌండ్ ను తలపించాయి. తిరుపతి కేంద్రంగా గడిచిన రెండేళ్ల పాలనను వివరించేందుకు కుటమిలోని మూడు పార్టీలు విజయోత్సవ సభను నిర్వహించాయి. ఓ వైపు రెండేళ్ల పాలనపై ప్రతిపక్ష వైపిపి  హామీల అమలులో వైఫల్యం చెందిందని ప్రతినిత్యం దుమ్మెత్తిపోస్తుండగా.... నేటి సభ ద్వారా కూటమి ఎలాంటి సందేశం ఇస్తుందొనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. దీంతో అందరి దృష్టి తిరుపతి సభపైనే ఉండిపోయింది. కానీ మరోవైపు ప్రతిపక్ష వైసిపి గడచిన పది రోజులుగా నియోజకవర్గాలలో కూటమి రెండేళ్ల పాలన వెన్నుపోటు కార్యక్రమాలు  నిర్వహిస్తుండగా నేడు రాష్ట్రవ్యాప్తంగా  వెన్నుపోటుకు రెండేళ్లంటూ  భారీ ర్యాలీలో నిరసనలు చేపట్టింది. ఈ కార్యక్రమాల ద్వారా  ప్రభుత్వ వైఫల్యాలను మరోమారు రీ సౌండ్ చేసి మరి చెప్పింది. దీంతో తిరుపతి సభ మీద ఉన్నదృష్టి యావత్తు వైసీపీ నిరసనల వైపు మళ్లేలా చేసిందని చెప్పకతప్పదు. 

Article Image

తిరుపతిలో కూటమి విజయోత్సవ సభ నిర్వహిస్తే.... అక్కడే వైసీపీ వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీగా నిర్వహించింది. ఈ నిరసనకు పెద్ద ఎత్తున జనాలు తరలిరావడం కూడా ఆలోచింపచేస్తొంది. ఇలా ఒక్క తిరుపతిలోనే కాదు... వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలోను వైసీపీ నిరసనలకు భారీగానే జనం పొటెత్తారు. రాష్ర్టంలో ప్రతిచోట వేల సంఖ్యలో జనాలు తరలిరావడం కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత... ఇటీవల కాలంలో క్యాడర్ పై వైఎస్ జగన్ చూపిన శ్రద్ద కలిసి రావడంతో క్యాడర్ తో పాటు జనం కూడా పొటెత్తారు.  అంతేకాదు... నిరసన ర్యాలీ అనంతరం ప్రతి చోట కూటమి ప్రభుత్వ వైఫల్యాలను దుమ్మెత్తిపోశారు. అసలు ఎన్నికల ముందే అమలు చేయ్యాలేమని తెలిసి కూడా గెలవడమే లక్ష్యంగా అబద్దపు హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాకా వైసీపీ నేతలు, నాయకులపై అక్రమ కేసుల భనాయింపు, అణచివేత తప్పా రాష్ర్టంలో సంక్షేమం, అభివృద్ది లేవని చాటిచెప్పారు. ఎన్నికల్లో హామీల్లో భాగంగా ఎంది పిల్లలున్నా తల్లికి వందనం, ఎంత మంది మహిళలున్నా ప్రతి ఒక్కరికి ‘ఆడబిడ్డకు నిధి కింద రూ. 1500, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 యేళ్లకే పెన్షన్లు ఇస్తామని, యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తామని,  రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీలు ఇచ్చారన్నారు. కానీ అచరణలో మాత్రం తల్లికి వందనం మొదటి యేడాది అసలే ఇవ్వలేదని, రెండవ యేడాది వేల సంఖ్యలో విద్యార్ధులకు కోత పెట్టి అమలు చేశారని, మహిళలకు ఇస్తామన్న రూ. 1500 అసలు ఇవ్వలేమంటూ చేతులెత్తేశారని, 50 యేళ్లపైబడి వారికి పెన్షన్లు ఇవ్వలేదని, యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని, ఉద్యోగాలు ఇవ్వలేదని, రైతులకు మద్దతు ధర ఒక్క పంటకు ఇవ్వడం లేదని, మద్దతు ధర అటుంచితే కనీసం ఎరువులు ఇవ్వలేకపోయారని కూటమి పాలనపై తీవ్ర స్థాయిలో జనాల చెవ్వుల్లో రీ సౌండ్ వచ్చేలా చెప్పారు. దీంతో రెండేళ్ల కూటమి పాలనకు ఏకంగా వెన్నుపోటు అంటూ పేరు పెట్టడం కూడా అందరినీ అలోచింపచేసింది. 

Article Image

ఇక విజయోత్సవ సభ పేరుతో కూటమి సభ నిర్వహించిన తీరు చూస్తే.... రెండేళ్ల పాలనలో అంతా చేసేశామంటూ చెప్పుకోచ్చారు. కానీ చేసింది కూడా పూర్తి స్థాయిలో చెప్పుకోలేకపోయారు. చంద్రబాబు, పవన్, లోకేష్ ఇలా ముగ్గురు చేసింది చెప్పుకుంది కొంత సేపే. కానీ వైసీపీ మీద విమర్శలకు ప్రాధాన్యత ఇచ్చింది మాత్రం చాలానే అని చెప్పొచ్చు. గత వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని సీఎం  చంద్రబాబు విమర్శించారు. ప్రజా వేదిక కూల్చివేతతో జగన్‌ అరాచక పాలన మొదలైందని, కేంద్ర పథకాలు, సాగునీటి ప్రాజెక్టులను పక్కన పడేశారని మండిపడ్డారు. అప్పులు, అరాచకాలు, ఆర్థిక విధ్వంసం తప్ప జగన్‌ చేసిందేమీలేదని, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నారు. కేసులు, జైళ్లతో చీకటి పాలన సాగించారని దుయ్యబట్టారు. అలాంటి దశలో నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించానని, ఏపీలో చీకటి పాలన పోయి.. ప్రజాపాలన వచ్చిందన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్‌ ఇచ్చి కేంద్రం బతికించిందని చెప్పుకొచ్చారు. ఆర్థిక ఇబ్బందులున్నా.. ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఎక్కడా లేనివిధంగా ఏపీలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యాలతో ముందుకెళ్తున్నామని చెప్పారు. అమరావతి, పోలవరం, రైల్వే జోన్‌ అంశాల్లో కేంద్ర సహకారం దక్కిందన్నారు. అన్ని వ్యవస్థలను గాడిలో పెడుతున్నామని చెప్పుకొచ్చారు. మంత్రి నారా లోకేష్ కూటమి పాలనలో జేసీబీలు, దాడులు, హత్యలు, బూతులు లేవని  అంటూనే మరోమారు తిరుమల లడ్డూ అంశాన్ని లేవనెత్తుతూ...  దేవుడితో పెట్టుకుంటే పరిస్థితి ఏంటో ఇవాళ అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించి మరో వివాదాం లేపినట్లయ్యింది. ఇక డిప్యూటి సిఎం పవన్ అయితే ...  అహంకారం, విధ్వంసక రాజకీయాలపై ప్రజాస్వామ్యం సాధించిన విజయమే 2024 ఎన్నికల ఫలితమని  అభిప్రాయపడ్డారు.

 Article Image
మొత్తం మీద కూటమి పాలనపై వైసీపీ నిరసనలు రెండేళ్ల పాలన వైఫల్యాలను బలంగా జనాల్లోకి తీసుకెళ్తే... కూటమి మాత్రం పత అరోపణలు, పాత విమర్శలతో విజయోత్సవ సభ నిర్వహించిందన్న విమర్శలే ఎక్కువ. కూటమి వైఫల్యాలను జనాల్లోకి తీసుకెళ్లే విషయంలో వైసీపీ ఈ విధంగ సక్సెస్ అయ్యిందన్న చర్చ ఇప్పుడు ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అంతేకాదు రాజకీయంగా కూడా వైసీపీ ర్యాలీలు, ప్రసంగాలు కూటమి విజయోత్సవ సభనే చిన్నబోయేలా చేశాయని చెప్పక తప్పదు.  

Article Image

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!