Saturday, 13 June 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

ఆల్ ఫ్రీ అన్నాడు... అందరికి వెన్నుపోటు పొడిచాడు... !

09 Jun 2026
03:17 PM
69

* ప్రతిజ్ఞలు... బాండ్లు ఇచ్చి మరోసారి  మోసం చేసిన బాబు...

* బాబు మోసగిస్తూనే ఉన్నాడు.. జనం మోసపోతూనే ఉన్నారు...
* కమలాపురం వెన్నుపోటుకు రెండేళ్లు.. కార్యక్రమంలో వైసీపీ ఇన్ చార్జి నరేన్ రామాంజులరెడ్డి ఫైర్ ...


Astra desk :

కడప జిల్లాలో కూటమి రెండేళ్ల  పాలనను నిరసిస్తూ ప్రతిపక్ష వైసీపీ చేపట్టిన వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని వైసీపీ ఉద్యమ స్పూర్తితో ముందుకు తీసుకెళ్తుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చింది మొదలు కడప జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోను అయా నియోజకవర్గ ఇన్ చార్జులు ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని ముందుకుతీసుకెళ్తుండగా... వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథరెడ్డి సైతం తన వంతుగా పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మంగళవారం కమలాపరం నియోజకవర్గంలో నిర్వహించిన  వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో వైసీపీ ఇన్ చార్జి నేన్ రామాంజులరెడ్డి పాల్గొని కూటమి ప్రభుత్వం, సిఎం చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీ ఇన్ చార్జి నేన్ రామాంజులరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అల్ ఫ్రీ అంటూ హామీలిచ్చి అధికారంలోకి వచ్చాకా సిఎం చంద్రబాబునాయుడు అందరిని వెన్నుపోటు పోడిచారన్నారు. ఇంకా పొడుస్తూనే ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తైనా  కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. మోసానికి, దగాకు, వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబని, మొదట్లో తన మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడించిన అనుభవంతో ఇప్పుడు  ఆల్ ఫ్రీ అని ప్రజలందరికి వెన్నుపోటు పొడిచారన్నారు.  ప్రతిజ్ఞలు బాండ్లు ఇచ్చి మరోసారి   మోసం చేశారని,  బాబు మోసగిస్తూనే ఉన్నాడు మనం మోసపోతూనే ఉన్నామన్నారు. గత ప్రభుత్వం కన్నా నాలుగింతలు ఎక్కువ ఇస్తామని చంద్రబాబు  ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు. ఈ కారణంగానే  కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని,  కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లి  ప్రభుత్వ అధికార దుర్వినియోగాని అడ్డుకుంటామన్నారు. ప్రశ్నిస్తే కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్న కూటమి నాయకుల నుంచి  వైసీపీ నాయకులకు కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్న వారికి గుర్తింపు ఉంటుందన్నారు. ఈ నెల 12న జరగబోయే నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చెయ్యాలని,  గ్రామ చావిడి నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు  ర్యాలీ కొనసాగనుందని చెప్పారు
 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!