Saturday, 06 June 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

జగన్ ప్రకటన..... వైసీపీలో పాజిటీవ్ వేవ్స్ ... !

30 May 2026
08:26 AM
237

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ క్యాడర్ కు అండగా ఉండాలన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్...
• క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపిన జగన్  ప్రకటన...
• క్యాడర్ కు మనం అండగా ఉంటే ...
• రేపు సార్వత్రిక ఎన్నికల్లో మనకు అండగా ఉంటారన్న కామెంట్స్ తో పాజిటీవ్ వేవ్స్...
• అధికారం లేక ఢీలా పడిన క్యాడర్ లో నూతనోత్సాహాం....
• ఏకగ్రీవాలు చేసుకొవచ్చునన్న కూటమి నేతల్లో మొదలైన గుబులు.....


Astra political desk   :

ఐదేళ్లు అధికారంలో ఉండి ఏం చేసుకోలేపోయామన్న అవేదన...ఇప్పుడు అసలే అధికారం దూరమైందన్న నిరుత్సాహంలో ఉన్న వైసీపీ క్యాడర్ లో ఇప్పుడు పాజిటివ్ వేవ్స్ కనిపిస్తున్నాయి. తాజాగా తాడేపల్లిలో పార్టీ ముఖ్యులతో నిర్వహించిన కీలక సమావేశంలో ... స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవం అన్న మాట లేకుండా... నియోజకవర్గ ఇన్చార్జీలు నాయకులకు, క్యాడర్ కు అండగా ఉండాలని ...ఇప్పుడు వారికి అండగా నిలబడితే ...రేపు మనకు వారు అండగా నిలబడతారని చేసిన సూచన పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపింది. అంతేకాదు ...నియోజకవర్గ ఇన్ చార్జులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవం అనే మాటకే చోటు ఇవ్వకూడదని.... ఒకవేళ ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగాయంటే, అక్కడ పార్టీ ఇన్చార్జ్ ఫెయిల్యూర్ గా  భావించాల్సి వస్తుందని జగన్ చేసిన హెచ్చరికలు కూడా క్యాడర్ ను ఎంతగా కాపాడుకోవాలనే విషయాన్ని గట్టిగానే ఇన్  చార్జులకు చెప్పడం కూడా క్యాడర్ లో మార్పుకు కారణమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
Article Image
వాస్తవానికి వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు కార్యకర్తల్ని, నాయకుల్ని అసలు పట్టించుకోలేదన్నది అధినేత వైఎస్ జగన్ పై ప్రధాన ఆరోపణ ఉంది. దీంతో ఆ ఆగ్రహమే ... సార్వత్రిక ఎన్నికల్లో నాయకులు పట్టిపట్టనట్లు వ్యవహరించడంతో వైసీపీ దారుణ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ప్రత్యేకించి రాయలసీమ లాంటి ప్రాంతంలో పార్టీకి అయువుపట్టైన రెడ్డి సామాజిక వర్గం నాయకులు కూడా పనిచెయ్యలేదు.  అయితే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకున్న వైఎస్ జగన్ .... అనతికాలంలోనే నిర్వహించిన ప్రతి సమావేశంలోను కార్యకర్తలు, నాయకులను జగన్ గుర్తు చెయ్యడమే కాకుండా ఈసార అధికారంలోకి వస్తే నాయకులకు, కార్యకర్తలకు పెద్ద పీఠ వేస్తానని చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే జరగనున్న సమయంలో మరోమారు అయన నాయకులకు, క్యాడర్ కు తాను ఎంతటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నానో చాటిచెప్పేలా ఇప్పుడు క్యాడర్ కు అండగా ఉండాలని, ఈ రోజు వారికి అండగా ఉంటేనే రేపు మనకు అండగా ఉంటారని చెప్పడం ...స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులకు ఆయా నియోజకవర్గ ఇన్ చార్జులు ఆర్థికంగా,  అన్ని విధాలా అండగా నిలవాలని చెప్పడం ద్వారా... కార్యకర్తల ను కాపాడుకునే విషయంలో ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో చెప్పకనే తెలియజేస్తొంది.
Article Image
కానీ వైసీపీ అధినేత ప్రకటన పార్టీ క్యాడర్ లో జోష్ పెంచితే.....  అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏకగ్రీవం చేసుకోవచ్చని ఇంతకాలం కలలు కంటున్న టీడీపీ నాయకుల ఆశలపై నీళ్లు చల్లినట్టైందన్న అభిప్రాయం వ్యక్తం అవుతొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ చావోరేవో తేల్చుకోడానికి సిద్ధపడిందని, ఆ దిశగానే జగన్ నియోజకవర్గ ఇన్ చార్జులను సమాయత్తం చేశారన్న గాబరా కూడా కూటమిలో కనపడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పక్షం ... ప్రతి పక్ష్యం పోటాపోటీగా తలపడి  రచ్చరచ్చగా మారితే, అంతిమంగా ప్రతికూల పరిస్థితులు కూటమిపై తీవ్రప్రభావం చూపే అవకాశం ఉంది. అసలే హామీల అమలులో కూటమి విఫలమైందన్న విమర్శలు ప్రతిపక్షమైన వైసీపీ నుంచి బలంగా వినపడుతుండగా... ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ సిద్దపడటం కూటమి అభ్యర్థులకు ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెట్టడం ఖాయంగా కనబడుతుంది. చేతిలో అధికారం ఉందన్న అహకారంతో పోలీస్ ల  బలాన్ని ఉపయోగించి వైసీపీ అభ్యర్థులను కేసుల పేరుతో బెదిరించో, భయపెట్టో ఏకగ్రీవం చేసుకోవచ్చని కూటమి నాయకులు అనుకుంటున్నా.... వైఎస్ జగన్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం.... ఎన్నికల్లో ఎలగైనా గెలవాలన్న పట్టుదల అయనలో చూశాక... జగన్ ప్రకటనతో వైసీపీలో కనిపిస్తున్న ఉత్సాహం.... కూటమి ఎత్తుగడలు అంత సులభం  కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (2)

S
Srinu naik • 30 May, 2026

ఎక్సలెంట్ డెసిషన్ కార్యకర్తలు ఉత్సాహగా ఉన్నారు. ఈ నిర్ణయం కోసం ఎదురు చూసాము. ఖచ్చితంగా స్థానిక సంస్థలు సాధించి తీరుతాం
####జై జగన్ ###
#### జై అవినాష్ ###

S
Srinu naik • 30 May, 2026

ఎక్సలెంట్ డెసిషన్ కార్యకర్తలు ఉత్సాహగా ఉన్నారు. ఈ నిర్ణయం కోసం ఎదురు చూసాము. ఖచ్చితంగా స్థానిక సంస్థలు సాధించి తీరుతాం
####జై జగన్ ###
#### జై అవినాష్ ###